Dharani
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న వేళ ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలకు భారీ షాక్ తగిలింది. ఆమెపై కేసు నమోదయ్యింది. ఆ వివరాలు. .
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న వేళ ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలకు భారీ షాక్ తగిలింది. ఆమెపై కేసు నమోదయ్యింది. ఆ వివరాలు. .
Dharani
ఆంధ్రప్రదేశ్ ఎన్నికలకు సమయం దగ్గర పడుతుంది. పోలింగ్‌కు మరో ఆరు రోజుల సమయం మాత్రమే ఉంది. ఇక ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండటంతో.. అధికార, విపక్ష పార్టీల నేతలు ఎన్నికల ప్రచారంలో దూకుడు పెంచారు. పోలింగ్‌కు 2 రోజుల ముందే ప్రచారం ఆపేయాలి. అంటే ఇంకా 4 రోజులు మాత్రమే ఎలక్షన్ క్యాంపెయిన్‌కి సమయం ఉంది. దాంతో నేతలు దూకుడు పెంచారు. ఒకరిపై ఒకరు విమర్శలు, ప్రతి విమర్శలు చేసుకుంటున్నారు. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు, కడప పార్లమెంట్ నియోజకవర్గం కాంగ్రెస్ అభ్యర్థి వైఎస్ షర్మిలపై కేసు నమోదైంది. ఇంతకు కారణం ఏంటి అంటే..
ఎన్నికల వేళ ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు, కడప పార్లమెంట్ నియోజకవర్గం కాంగ్రెస్ అభ్యర్థి వైఎస్ షర్మిలపై కేసు నమోదైంది. బద్వేల్ పోలీస్ స్టేషన్‌లో ఆమెపై కేసు నమోదు అయ్యింది. కారణం ఏంటి అంటే.. మే 2వ తేదీన బద్వేల్ బహిరంగ సభలో పాల్గొన్న వైఎస్ షర్మిల.. వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు గురించి ప్రసంగించారు. దాంతో షర్మిలపై బద్వేల్ నోడల్ అధికారి, మున్సిపల్ కమిషనర్‌లు ఫిర్యాదు చేశారు. దీని ఆధారంగా పోలీసులు షర్మిలపై కేసు నమోదు చేశారు. పలు సెక్షన్ల కింద ఆమె మీద కేసు నమోదు చేశారు.
ఎన్నికల సమయంలో వైఎస్ వివేకా హత్య కేసు గురించి ప్రస్తావించకూడదని కొన్ని రోజుల క్రితమే కడప కోర్టు ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. అయితే వైఎస్ షర్మిల మాత్రం.. కోర్టు ఆదేశాలను ధిక్కరిస్తూ మే 2న బద్వేల్‌లో నిర్వహించిన బహిరంగా సభలో.. వివేకా హత్య కేసును ప్రస్తావించారని అధికారులు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు మేరకు బద్వేల్ పోలీస్ స్టేషన్‌లో ఆమెపై కేసు నమోదు చేశారు.
వైఎస్ వివేకా హత్య కేసు గురించి ప్రచారంలో పదే, పదే ప్రస్తావిస్తున్నారని.. ఎవరూ ఈ అంశంపై మాట్లాడకుండా ఆదేశాలు ఇవ్వాలంటూ కొన్ని రోజుల క్రితం వైఎస్సార్‌సీపీ నేత కడప కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన కడప కోర్టు.. ఎన్నికల వేళ వివేకా హత్య కేసు గురించి ఎవరూ మాట్లాడకూడదని ఆదేశాలు జారీ చేసింది. కానీ షర్మిల మాత్రం.. కోర్టు ఆదేశాలను ధిక్కరించి.. వైఎస్ వివేకా హత్య కేసు గురించి ప్రస్తావించింది. దాంతో ఆమెపై కేసు నమోదు చేశారు.