రిపబ్లిక్ డే పరేడ్.. AP విద్యాశాఖ శకటానికి థర్డ్ ప్రైజ్

75 వ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో ఏపీ శకటం అందరినీ ఆకట్టుకుంది. కాగా రిపబ్లిక్ డే పరేడ్ వేడుకల్లో ప్రదర్శించిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రూపొందించిన విద్యాశాఖ శకటానికి ప్రైజ్ లభించింది.

75 వ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో ఏపీ శకటం అందరినీ ఆకట్టుకుంది. కాగా రిపబ్లిక్ డే పరేడ్ వేడుకల్లో ప్రదర్శించిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రూపొందించిన విద్యాశాఖ శకటానికి ప్రైజ్ లభించింది.

ఈ నెల 26న దేశ వ్యాప్తంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు అట్టహాసంగా జరిగాయి. ఈ వేడుకల్లో దేశంలోని పలు రాష్ట్రాలకు చెందిన శకటాలు ఆకట్టుకున్నాయి. కాగా రిపబ్లిక్ డే పరేడ్ వేడుకల్లో ప్రదర్శించిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రూపొందించిన శకటానికి ప్రైజ్ లభించింది. ఏపీ విద్యాశాఖ శకటం అందరినీ ఆకట్టుకోగా మూడో స్థానం లభించింది. డిజిటల్ విద్యా బోధన, నాడు-నేడు, ఆంగ్ల మాధ్యమంలో బోధన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ శకటాన్ని తయారు చేసి గణతంత్ర వేడుకల్లో ప్రదర్శించింది. ఏపీ విద్యాశకటానికి మూడో ప్రైజ్ లభించడంతో అరుదైన గౌరవం దక్కినట్లైంది.

పరేడ్ లో పాల్గొన్న శకటాలపై దేశవ్యాప్తంగా ప్రజాభిప్రాయాన్ని సేకరించారు. జనవరి 26, 27 తేదీల్లో దేశ వ్యాప్తంగా ప్రజాభిప్రాయ సేకరణ ద్వారా ఓటింగ్ నిర్వహించారు. ఆన్ లైన్ ఓటింగ్ లో ఏపీ విద్యాశాఖ శకటం మూడో స్థానం సొంతం చేసుకుంది. కాగా మొదటి స్థానంలో గుజరాత్, ఒడిషా ప్రభుత్వాలు రూపొందించిన శకటాలు నిలిచాయి. మంగళవారం ఢిల్లీలో జరిగే కార్యక్రమంలో కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ చేతుల మీదుగా ఆంధ్ర ప్రదేశ్ సమాచార శాఖ జేడీ కిరణ్ కుమార్ అవార్డు అందుకోనున్నారు.

ఇక ఏపీలోని జగన్ సర్కార్ విద్యారంగాన్ని బలోపేతం చేసేందుకు, చారిత్రాత్మక నిర్ణయాలు తీసుకుని విద్యా వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు తీసుకు వచ్చింది. విద్యార్థులకు పేద, ధనిక అనే తారతమ్యాలు లేకుండా నాణ్యమైన విద్యను అందించేందుకు చర్యలు తీసుకుంది. ఏపీలో 62వేల డిజిటల్‌ క్లాస్‌ రూమ్‌ల‌తో బోధన అందిచడం ద్వారా ఏపీ ప్రభుత్వం సరి కొత్త చరిత్ర సృష్టించింది. ఈ నేపథ్యంలోనే డిజిటల్ క్లాస్ రూమ్ థీమ్‌తో రూపొందించిన శకటాన్ని జనవరి 26న ఏపీ తరఫున గణతంత్ర దినోత్సవ వేడుకల్లో ప్రదర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యా రంగంలో చేపట్టిన సంస్కరణలు అద్దం పట్టేలా శకటాన్ని తీర్చిదిద్దారు.

Show comments