P Venkatesh
నేడు ఏపీలో ముసాయిదా ఓటర్ల జాబితాను ఎన్నికల సంఘం ప్రకటించింది. ఏపీ ముసాయిదా ఓటర్ల జాబితాను రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రధానాధికారి ముఖేశ్ కుమార్ మీనా విడుదల చేశారు. ఈ మేరకు ఓటర్ల జాబితాను ఆన్ లైన్ లో అందుబాటులో ఉంచారు.
నేడు ఏపీలో ముసాయిదా ఓటర్ల జాబితాను ఎన్నికల సంఘం ప్రకటించింది. ఏపీ ముసాయిదా ఓటర్ల జాబితాను రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రధానాధికారి ముఖేశ్ కుమార్ మీనా విడుదల చేశారు. ఈ మేరకు ఓటర్ల జాబితాను ఆన్ లైన్ లో అందుబాటులో ఉంచారు.
P Venkatesh
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. ఇప్పటికే అధికార ప్రతిపక్షపార్టీలు ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా వ్యూహాలు రచిస్తున్నాయి. ఈ క్రమంలోనే ఎన్నికల సంఘం ఎన్నికలకు సంబంధించిన ప్రక్రియపై దృష్టిపెట్టింది. దీనిలో భాగంగానే నేడు ఏపీలో ముసాయిదా ఓటర్ల జాబితాను ఎన్నికల సంఘం ప్రకటించింది. ఏపీ ముసాయిదా ఓటర్ల జాబితాను రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రధానాధికారి ముఖేశ్ కుమార్ మీనా విడుదల చేశారు. ఈ మేరకు ఓటర్ల జాబితాను ఆన్ లైన్ లో అందుబాటులో ఉంచారు.
ముసాయిదా ఓటర్ల జాబితాపై ఏవైనా అభ్యంతరాలుంటే డిసెంబర్ తొమ్మిదో తేదీ వరకు అభ్యంతరాలను స్వీకరించనున్నట్టు ప్రకటనలో పేర్కొంది. ఇంటింటి సర్వే పూర్తయ్యాక 2024, జనవరి 5న తుది ఓటర్ల జాబితా వెల్లడిస్తామని పేర్కొంది. ముసాయిదా ఓటర్ల జాబితాను ప్రతి జిల్లాలో రాజకీయ పార్టీలకు ఇవ్వాలని అధికారులను ఈసీ ఆదేశించారు. కాగా ఎన్నికల సంఘం విడుదల చేసిన జాబితా ప్రకారం ఏపీలో మొత్తం ఓటర్లు 4 కోట్ల ఒక లక్ష 53 వేల 292 మంది. ఇందులో పురుషులు కోటి 98 లక్షల 31 వేల 791. మహిళలు 2 కోట్ల 3లక్షల 85 వేల 851 మంది ఉన్నారు.
అనంతపురం జిల్లాలో అత్యధికంగా 19,79,775 19 లక్షల 79 వేల 775 మంది ఓటర్లు ఉండగా… అల్లూరి సీతారామారాజు జిల్లాలో అత్యల్పంగా 7 లక్షల 40 వేల 857 మందిఓటర్లు ఉన్నట్లు ఈసీ తెలిపింది. 2022 జనవరి 6 నుంచి 2023 ఆగస్టు 30వరకు అన్ని స్థాయిల్లో ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ చేపట్టినట్లు ఈసీ వెల్లడించింది. 21 లక్షల 18 వేల 940 ఓట్ల తొలగింపు ప్రక్రియను పునః పరిశీలన చేసినట్టు వివరించింది. ఆగస్టులో చేపట్టిన ఇంటింటి సర్వేలో జీరో డోర్ నెంబర్లతో 2,51,767 2 లక్షల 51 వేల 767 ఓట్లు గుర్తించినట్టు స్పష్టం చేసింది. ఒక లక్ష 57 వేల939 ఇళ్లలో 10 కంటే ఎక్కువ మంది ఓటర్లు ఉన్నట్టు తేలిందని వెల్లడించింది.
జాబితా ఇదే..
మొత్తం ఓటర్లు- 4,01,53,292
పురుషులు- 1,98,31,791
మహిళలు – 2,03,85,851
ట్రాన్స్ జెండర్లు – 3808
సర్వీస్ ఓటర్లు 66,158
పోలింగ్ కేంద్రాలు – 46,165