iDreamPost
android-app
ios-app

చంద్రబాబు లేఖ వ్యవహారంపై DGP కీలక వ్యాఖ్యలు!

ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణంలో టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టై రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నారు. ఈ నేపథ్యంలోనే చంద్రబాబు పేరుతో ఓ లేఖ బయటకు వచ్చింది. ఈ లేఖ వ్యవహారంపై డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.

ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణంలో టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టై రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నారు. ఈ నేపథ్యంలోనే చంద్రబాబు పేరుతో ఓ లేఖ బయటకు వచ్చింది. ఈ లేఖ వ్యవహారంపై డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.

చంద్రబాబు లేఖ వ్యవహారంపై DGP కీలక వ్యాఖ్యలు!

ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణంలో టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టై రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నారు. ఇక చంద్రబాబు అరెస్టుతో టీడీపీ దిక్కుతోచని స్థితిలో ఉందని పలువురు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు. మరోవైపు చంద్రబాబు అరెస్టుకు నిరసనగా టీడీపీ నేతలు పలు కార్యక్రమాలు చేపట్టారు. దసరాకు నిజం గెలవాలి పేరుతో మరో కార్యక్రమం చేయనున్నారు. నిజం గెలవాలి పేరుతో చంద్రబాబు సతీమణి భువనేశ్వరి ఈ యాత్ర చేయనున్నారు. ఈ నేపథ్యంలోనే చంద్రబాబు పేరుతో ఓ లేఖ బయటకు వచ్చింది. తాను జైల్లో లేననని, ప్రజల గుండెల్లో ఉన్నా… తెలుగు ప్రజలకు దసరా శుభాకాంక్షలు చెబుతూ రాజమండ్రి జైలు నుంచి ఆదివారం ఆ లేఖ విడుదల చేశారు.

చంద్రబాబు లేఖ వ్యవహారంపై రాష్ట్ర డీపీ రాజేంద్రనాథ్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ లేఖ వ్యవహారంపై సమగ్ర విచారణ జరుగుతోదని డీజీపీ అన్నారు. ఇందులో నిజా నిజాలు ఏమిటో తేలాల్సి ఉందన్నారు. చంద్రబాబు లేఖ వ్యవహారం, జైల్లో భద్రతపై ఆయన అనంతపురంలో మీడియాతో మాట్లాడారు. జైలు నుంచి ఎటువంటి లేఖ బయటకు వెళ్లలేదని జైలు అధికారులు చెప్తున్నారని డీజీపీ వెల్లడించారు. విచారణ జరిపిన తర్వాత ఈ వ్యవహారంలో చర్యలుంటాయని తెలిపారు. రాజమండ్రి సెంట్రల్‌ జైల్లో చంద్రబాబు భద్రతకు ఎలాంటి ఢోకా లేదన్నారు డీజీపీ.

జైల్లో చంద్రబాబుకు పూర్తి భద్రత కల్పిస్తున్నామని  వెల్లడించారు. చంద్రబాబు భద్రత కోసం జైల్లో అదనపు బందోబస్తును ఏర్పాటు చేసినట్లు తెలిపారు. భువనేశ్వరి యాత్రపై టీడీపీ నేతలు ఎటువంటి అనుమతి కోరలేదన్నారు. భువనేశ్వరి యాత్రపై టీడీపీ నేతలు ఎటువంటి అనుమతి కోరలేదని రాజేంద్రనాథ్ రెడ్డి తెలిపారు. ఇదే విధంగా టీడీపీ ఆందోళన కార్యక్రమాలను పోలీసులు అడ్డుకుంటున్న వస్తున్న వార్తల్లో ఎటువంటి నిజం లేదని స్పష్టం చేశారు.  పోలీసులు ఎవరూ కూడా టీడీపీ ఆందోళన కార్యక్రమాలు అడ్డుకోవడం లేదన్నారు. మరి.. చంద్రబాబు లేఖ వ్యవహారంపై డీజీపీ చేసిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి