iDreamPost
android-app
ios-app

జగన్ పాలన సంక్షేమానికి చిరునామా: డిప్యూటీ సీఎం

వైఎస్సార్ సీపీ చేపట్టిన సామాజిక సాధికార యాత్ర ఐదో రోజు కొనసాగుతోంది. ఉత్తరాంధ్ర, రాయలసీమ, కోస్తాంధ్రలో ఈ యాత్ర కొనసాగుతోంది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై  ప్రసంశల వర్షం కురిపించారు. సీఎం జగన్ మోహన్ రెడ్డి పాలన సంక్షేమానికి చిరునామా అని మంత్రి నారాయణ స్వామి తెలిపారు.

వైఎస్సార్ సీపీ చేపట్టిన సామాజిక సాధికార యాత్ర ఐదో రోజు కొనసాగుతోంది. ఉత్తరాంధ్ర, రాయలసీమ, కోస్తాంధ్రలో ఈ యాత్ర కొనసాగుతోంది. ఉత్తరాంధ్రలో అనకాపల్లి జిల్లా మాడుగుల, కోస్తాలో అవనిగడ్డ, రాయలసీమలో చిత్తూరు జిల్లాలో బస్సు యాత్ర సాగుతోంది. రాయలసీమలో జరుగుతున్న ఈ యాత్రలో ఉపముఖ్యమంత్రి నారాయణ స్వామి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై  ప్రసంశల వర్షం కురిపించారు. సీఎం జగన్ మోహన్ రెడ్డి పాలన సంక్షేమానికి చిరునామా అని మంత్రి నారాయణ స్వామి తెలిపారు.

చిత్తూరులో ఎమ్మెల్యే అరని శ్రీనివాసుల ఆధ్వర్యంలో సామాజిక సాధికార యాత్ర సాగింది. మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, నారాయణ స్వామి, అంజాద్ భాషా తదితరులు పాల్గొన్నారు. గురువారం మధ్యాహ్నం 2:45కి మీడియా సమావేశంలో ఈ మంత్రులు పాల్గొన్నారు. సూర్య ప్రతాప కల్యాణ మండపం నుంచి బైక్ ఆటో ర్యాలీ చేశారు. సాయంత్రం 4 గంటలకు ఏర్పాటు చేసిన బహిరంగ సభలో నేతలు ప్రసంగించారు.

ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామి మాట్లాడుతూ..”సీఎం జగన్ పాలన సంక్షేమానికి చిరునామా. అన్ని వర్గాలకూ న్యాయం చేసిన నాయకుడు సీఎం జగన్. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు అండగా నిలిచిన నాయకుడు మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. పేదల తలరాతను మార్చాలంటే సామాజిక న్యాయంతోనే సాధ్యం. చంద్రబాబు ఏ రోజూ వెనుకబడిన వర్గాల ప్రజల గురించి పట్టించుకోలేదు.  దళితులను అవమానించిన నీచుడు చంద్రబాబు. సామాజిక న్యాయం నినాదాన్ని టీడీపీ ప్రభుత్వం ఓటు బ్యాంకుగానే వాడుకుంది. ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చిన నాయకుడు సీఎం జగన్” అని ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామి తెలిపారు. మరి..డిప్యూటీ సీఎం నారాయణ స్వామి  చేసిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.