Dharani
ఏపీలో గ్యాస్ వినియోగదారుల కోసం ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దీనిపై జనాలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇంతకు ఏంటా నిర్ణయం అంటే..
ఏపీలో గ్యాస్ వినియోగదారుల కోసం ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దీనిపై జనాలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇంతకు ఏంటా నిర్ణయం అంటే..
Dharani
గ్యాస్ వినియోదారులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఇక మీదట గ్యాస్ డెలివరీ సమయంలో ఒక్క రూపాయి కూడా అదనంగా చెల్లించాల్సిన అవసరం లేదని వెల్లడించింది. గ్యాస్ సిలిండర్ డెలివరీ సమయంలో రశీదులో ఉండే మొత్తానికి మించి.. అదనంగా ఒక్క రూపాయి కూడా చెల్లించాల్సిన అవసరం లేదని పౌరసరఫరాల శాఖ కమిషనర్ హెచ్ అరుణ్ కుమార్ తెలిపారు. పట్టణ ప్రాంతం, గ్రామీణ/పట్టణ ప్రాంతంలోని ఎల్పీజీ డిస్ట్రిబ్యూటర్ సెంటర్ నుంచి 15 కిలోమీటర్ల పరిధిలోని గ్రామాలు, గిరిజన, కొండ ప్రాంతాలకు ఎటువంటి డెలివరీ ఛార్జీలు తీసుకోవడానికి వీల్లేదని ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేశారు.
ఎల్‌పీజీ డిస్ట్రిబ్యూషన్ సెంటర్ నుంచి 15 కిలోమీటర్లు పైబడిన ప్రాంతాలకు మాత్రమే.. నిర్ణయించన మేరకు డెలివరీ చార్జ్‌లు వసూలు చేయాడానికి ప్రభుత్వం అనుమతిచ్చింది. అంతకు మించి ఒక్క రూపాయి అధికంగా వసూలు చేసినా.. పౌరసరఫరాల శాఖ, ఆయిల్ మార్కెటింగ్ కంపెనీ టోల్‌ఫ్రీ నంబర్ 1967, 1800 2333555కు ఫిర్యాదు చేయాలని తెలిపారు. అలా వచ్చిన ఫిర్యాదులపై విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా కమిషనర్ అరుణ్ కుమార్ వెల్లడించారు.
గ్యాస్ సిలిండర్ డెలివరీ పేరుతో జరుగుతున్న దోపిడీని అరికట్టేందుకే ఏపీ ప్రభుత్వం ఈ కీలక నిర్ణయం తీసుకుందని అరుణ్ కుమార్ తెలిపారు. సిలిండర్ డెలివరీ చేసే బాయ్‌లు రవాణా పరిధిలో నివాసం ఉన్నా కూడా డెలివరీ కోసం అదనపు రుసుము వసూలు చేస్తున్నారంటూ గత కొంతకాలంగా ఫిర్యాదులు వస్తున్నాయి. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని.. ఇకపై ఎల్‌పీజీ డిస్ట్రిబ్యూషన్ సెంటర్‌కు 15 కిమీ పరిధి లోపల ఉన్న వారు గ్యాస్ డెలివరీ సందర్భంగా ఒక్క రూపాయి కూడా చెల్లించాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. అలాగే వినియోగదారులకు ప్రత్యేక సూచనలు కూడా చేశారు.