iDreamPost
android-app
ios-app

డ్యాక్రా మహిళలకు జగన్ సర్కార్ శుభవార్త.. వారి ఖాతాల్లోకి డబ్బులు

డ్యాక్రా మహిళలకు జగన్ సర్కార్ శుభవార్త.. వారి ఖాతాల్లోకి డబ్బులు

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. ప్రజా సంక్షేమం కోసం అనేక సంస్కరణలు చేపట్టారు. అలానే మహిళల అభివృద్ధి కోసం పలు స్కీమ్ లను ప్రారంభించారు. తరచూ ఏపీలోని అన్ని వర్గాల ప్రజలకు సీఎం జగన్ శుభవార్త చెప్తుంటారు. అలానే తాజాగా డ్వాక్రా మహిళలకు జగన్ ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. పొదుపు సంఘాల మహిళల బ్యాంకు రుణాలకు సంబంధించి వైఎస్సార్‌ సున్నా వడ్డీ పథకంలో భాగంగా శుక్రవారం మరో విడతగా విడుదల చేశారు. ఈ కార్యక్రమానికి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం వేదికైంది. ఇక్కడి నుంచి సీఎం జగన్ బటన్ నొక్కి లబ్దిదారుల అకౌంట్‌లలోకి విడుదల చేశారు.

శుక్రవారం సీఎం జగన్ డాక్టర్  బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో పర్యటించారు.  ఈ సందర్భంగా నాలుగో విడత వైఎస్సార్ సున్నా వడ్డీ పథకం కింద పొదుపు మహిళల అకౌంట్లలో డబ్బులు జమ చేశారు. అమలాపురంలో ఏర్పాటు చేసిన సభ వేదికపై నుంచి సీఎం జగన్ బటన్ నొక్కి నేరుగా నగదు డ్వాక్రా మహిళ ఖాతాల్లో జమ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా అర్హత గల 9.48 లక్షల స్వయం సహాయక సంఘాల్లోని 1.05 కోట్ల మంది అక్కచెల్లెమ్మలు బ్యాంకులకు చెల్లించిన రూ.1,358 కోట్ల వడ్డీని రీయింబర్ చేస్తూ వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేశారు.

వైఎస్సార్ సున్నా వడ్డీ పథకం కింద ఇప్పటి వరకు అందించిన మొత్తం సాయం రూ.4,969.05 కోట్లు. పేద అక్కచెల్లెమ్మలకు సాధికారత కల్పిస్తూ… వారు చేస్తున్న వ్యాపారాలకు ఊతమిచ్చేలా సున్నా వడ్డీకే రుణాలు ఏపీ ప్రభుత్వం అందిస్తున్న సంగతి తెలిసిందే. సున్న వడ్డీ రుణాల ద్వారా అక్కచెల్లమ్మల జీవన ప్రమాణాలను ప్రభుత్వం మెరుగుపరుస్తుంది.  వాస్తవానికి ఈ కార్యక్రమం గత నెల 26న జరగాల్సి ఉంది. అయితే అకస్మాత్తుగా వచ్చిన వర్షాల కారణంగా వాయిదా పడింది. డ్వాక్రా మహిళలకు బ్యాంకుల్లో ఉన్న అప్పును, అది కూడా గత అసెంబ్లీ ఎన్నికల నాటికి ఉన్న రుణాల వడ్డీని ఏపీ ప్రభుత్వం చెల్లిస్తోంది.

పొదుపు సంఘాల మహిళలకు రుణాలపై 9 శాతం వడ్డీ వర్తింపజేసేలా బ్యాంకర్ల సమావేశంలో జగన్ సర్కార్ ఒత్తిడి తెచ్చి చర్యలు కూడా చేపట్టింది. ఇక అమలాపురం పర్యటనలో సీఎం జగన్.. అక్కడ ఏర్పాటు చేసిన స్టాళ్లను పరిళీలించారు. ఈ క్రమంలోనే మహిళలు తయారు చేసిన ఉత్పత్తులను కూడా సీఎం పరిశీలించారు. పొదుపు సంఘాల మహిళలతో సీఎం జగన్ ఫోటో దిగారు. మరి.. కార్యక్రమంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.