ఇంగ్లీష్ మీడియం తెచ్చినందుకు బాబుతో యుద్ధం చేయాల్సి వస్తోంది: CM జగన్

YS Jagan: శుక్రవారం సీఎం జగన్ మోహన్ రెడ్డి కృష్ణా జిల్లా పామర్రు నియోజవర్గంలో పర్యటించారు. జగనన్న విద్యా దీవెన పథకంలో భాగం అక్టోబరు, డిసెంబరు-2023 త్రైమాసికానికి సంబంధించిన నిధులను విడుదల చేశారు.

YS Jagan: శుక్రవారం సీఎం జగన్ మోహన్ రెడ్డి కృష్ణా జిల్లా పామర్రు నియోజవర్గంలో పర్యటించారు. జగనన్న విద్యా దీవెన పథకంలో భాగం అక్టోబరు, డిసెంబరు-2023 త్రైమాసికానికి సంబంధించిన నిధులను విడుదల చేశారు.

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి విద్యారంగంలో చేపట్టిన సంస్కరణల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. నాడు-నేడుతో ప్రభుత్వ పాఠశాలల రూపు రేఖలే మార్చిసిన ఘన సీఎం జగన్ ది. అలానే పేద విద్యార్థులకు చదువు విషయంలో ఎలాంటి ఆటకం కలగకుండా ఉండేందు.. అమ్మఒడి, జగనన్న విద్యాదీవెన, జగనన్న వసతి దీవెన, జగనన్న విదేశీ విద్యా దీవెన వంటి అనేక పథకాలను ప్రవేశ పెట్టారు. ప్రతి ఏటా  క్రమం తప్పకుండా విద్యార్థులకు  స్కీమ్ ల ద్వారా నిధులను విడుదల చేస్తున్నారు. తాజాగా జగనన్న విద్యా దీవెన్ అక్టోబరు,డిసెంబరు-2023 త్రైమాసికానికి సంబంధించిన నిధులు విడుదల చేశారు. ఈ కార్యక్రమానికి కృష్ణా జిల్లా పామర్రు నియోజవర్గం వేదిక అయ్యింది.

పేద విద్యార్థుల కోసం జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం ప్రవేశ పెట్టిన పథకాల్లో జగనన్న విద్యా దీవెన ఒకటి. ఈ స్కీమ్ ద్వారా ఉన్నత విద్యాను అభ్యసించే విద్యార్థులకు ఆర్థిక సాయం అందిస్తున్నారు. ఇప్పటికే పలు విడుదతల్లో జగనన్న విద్యా దీవెన పథకం కింద నిధులను విడుదల చేశారు. తాజాగా అక్టోబరు-డిసెంబరు2023 త్రైమాసికానికి సంబంధించిన నిధులు విడుదల చేసే కార్యక్రమంలో భాగంగా సీఎం జగన్ మోహన్ రెడ్డి శుక్రవారం కృష్ణాజిల్లాలోని పామర్రులో పర్యటించారు. ఈ సందర్భంగా  రాష్ట్రంలో ఉన్నత విద్యను అభ్యసిస్తున్న 9.44 లక్షల మందికి విద్యార్థులకు  జగనన్న విద్యాదీవెన కింద రూ.708.68 కోట్లను సీఎం జగన్ విడుదల చేశారు. సీఎం జగన్ బటన్ నొక్కి తల్లులు, విద్యార్థుల జాయింట్ అకౌంట్ లో పూర్తి ఫీజును రీయింబర్స్ మెంట్ ను జమ చేయనున్నారు.  దీంతో విద్యాదీవెన, వసతి దీవెన స్కీమ్ కింద జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం ఇప్పటి వరకు రూ.18,002 కోట్లను ఖర్చు చేసింది.

ఇక పామర్రు సభలో సీఎం జగన్ మాట్లాడుతూ..“విద్యార్థులకు మనం అందించే నిజమైన ఆస్తి..విద్యే. అలానే మన విద్యార్థులు అంతర్జాతీయ స్థాయిలో అత్యుత్తమంగా ఎదగాలి. ప్రపంచంతో పోటీపడే విధంగా విద్యారంగంలో మన ప్రభుత్వం విప్లవాత్మకమైన మార్పులు తెచ్చింది. ఫీజులే కాకుండా, వసతి ఖర్చుల కోసం వసతి దీవెను కూడా ఇస్తున్నాం. 57 నెలలుగా ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాం. రూ.708.68 కోట్లు ఖాతాల్లో ఇప్పుడు జమ చేయబోతున్నాం. జగనన్న విద్యాదీవెనతో ఇప్పటి వరకు రూ.12,610 కోట్లు అందించాం.  ఎప్పుడు చూడని విధంగా విద్యారంగంలో విప్లవాత్మక మార్పులు తెచ్చాం.

మన విద్యార్థులకు నాణ్యమైన విద్యనే అందించాలి. నాణ్యమైన విద్య అవసరం తెలుకున్నాం కాబట్టే విప్లవాత్మక మార్పులను విద్యారంగంలో అమలు చేస్తున్నాం. విద్యార్థుల భవిష్యత్ కోసం ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం విద్యాను తీసుకొచ్చాం. అలా పేద విద్యార్థుల కోసం ఇంగ్లీష్ మీడియం తీసుకొస్తే కొందరు విమర్శలు చేస్తున్నారు. వారి పిల్లలు ఇంగ్లీష్ మీడియంలోనే చదవాలి..పేద పిల్లలు మాత్రం ఇంగ్లీష్ మీడియంలో చదవొద్దా?. పెత్తందారుల పిల్లల చేతుల్లో ట్యాబులు ఉండొచ్చు,  పేదల పిల్లలకు ఇస్తే చెడిపోతారంటూ తెగ రచ్చ చేస్తున్నారు. పేదల పిల్లలు ఎప్పటికీ పేదలుగానే మిగిపోలన్న పెత్తందారుల మనస్తత్వాన్ని మీరు గమనించండి.

విద్యారంగంలో కూడా క్లాస్ వార్ జరుగుతోంది. ఇక్కడ కూడా పెత్తందారులతో మనం క్లాస్ వార్ చేస్తున్నాం. చంద్రబాబు, రామోజీ, రాధకృష్ణ, టీవీ5, దత్తపుత్రుడితో యుద్ధం చేయాల్సి వస్తోంది. ప్రభుత్వం ట్యాబ్ లు ఇస్తే చంద్రబాబు, పవన్ విమర్శిస్తున్నారు. పిల్లల మంచి చేస్తున్న మనపై చంద్రబాబు అండ్ కో యుద్ధం చేస్తుంది. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం తీసుకొచ్చినందుకు బాబుతో మనం యుద్ధం చేయాల్సి వస్తోంది. పేద విద్యార్థుల విషయంలో చంద్రబాబు అండ్ కో చేస్తున్న అసత్య ప్రచారాలను ప్రజలు గమనించాలని కోరుతున్నాను.

రాబోయే ఎన్నికల్లో బాబు ప్రతి ఇంటికి కేజీ బంగారం, బెంజ్ కారు ఇస్తానని హామీలు ఇస్తాడు. ఇలాంటి బాబు మాటలను నమ్మోద్దని ప్రజలను కోరుతున్నాను.  ఇంట్లో మంచి జరిగి ఉంటేనే ఓటు వేయ్యండి అని కోరుతున్నాను. జగన్ మళ్లీ రాకుంటే..పేద వాడు అప్పులపాలవుతాడు. పేద విద్యార్థుల భవిష్యత్ ను మార్చేందుకు చంద్రబాబు ఎనాడైన ప్రయత్నించారా?. చంద్రబాబు పేరు చెబితే ఆయన చేసిన చెడు చాలానే ఉంది” అని సీఎం జగన్ మోహన్ రెడ్డి అన్నారు.

Show comments