iDreamPost
android-app
ios-app

‘ఆడుదాం ఆంధ్రా’ పోటీలను ప్రారంభించిన CM జగన్!

Aadudam Andhra: ఆంధ్రప్రదేశ్ లో ఓ పెద్ద క్రీడా సంగ్రామం ప్రారంభమైంది. 'ఆడుదాం ఆంధ్రా' పేరుతో ప్రభుత్వం మెగా టోర్నిని నిర్వహిస్తుంది. నేడు ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఈ పోటీలను ప్రారంభించారు.

Aadudam Andhra: ఆంధ్రప్రదేశ్ లో ఓ పెద్ద క్రీడా సంగ్రామం ప్రారంభమైంది. 'ఆడుదాం ఆంధ్రా' పేరుతో ప్రభుత్వం మెగా టోర్నిని నిర్వహిస్తుంది. నేడు ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఈ పోటీలను ప్రారంభించారు.

‘ఆడుదాం ఆంధ్రా’ పోటీలను ప్రారంభించిన CM జగన్!

దేశంలోనే అతిపెద్ద మెగా టోర్ని ‘ఆడుదాం ఆంధ్రా’తో క్రీడోత్సాహం ఉప్పొంగింది. ఈ పోటీలను ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మంగళవారం ప్రారంభించారు. గుంటూరు జిల్లా నల్లపాడులోని లయోలా పబ్లిక్ స్కూల్ లో ఈ టోర్ని లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం ఆడుదాం ఆంధ్రలో స్పోర్ట్స్ కిట్స్ ను సీఎం జగన్ పరిశీలించారు.  సీహెచ్ రమాదేవికి క్రీడల టార్చ్ ను సీఎం అందజేశారు. అనంతరం సీఎం జగన్ టెన్నిస్, క్రికెట్ ఆడుతూ క్రీడాకారులను ఉత్సాహ పరిచారు. ఈ కార్యక్రమం సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో సీఎం జగన్ ప్రసంగిచారు.

మంగళవారం గుంటూరు జిల్లా నల్లపాడులో లయోలా పబ్లిక్ స్కూల్ లో  ‘ఆడుదాం ఆంధ్రా’ క్రీడా పోటీలను సీఎం జగన్ మోహన్ రెడ్డి లాంఛనంగా ప్రారంభించారు. ఇక అనంతరం 15,004 గ్రామ/వార్డు సచివాలయాల పరిధిలో ఎమ్మెల్యేలు, మంత్రులు, కలెక్టర్లు, ఇతర అధికారుల సమక్షంలో ఆటల పోటీలు ప్రారంభమయ్యాయి. ఇక ఈ క్రీడల ప్రారంభోత్సవంలో సీఎం జగన్ బ్యాడ్మింటిన్ ప్లేయర్ కిందాంబి శ్రీకాంత్ తో కలిసి క్రీడా జ్యోతిని వెలిగించారు. ‘ఆడుదాం ఆంధ్రా’ టోర్నమెంట్ -2023 లో క్రీడలకు సంబంధించి క్రీడాకారులతో సీఎం జగన్ ప్రమాణం చేయించారు.

ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. ఆడుదాం ఆంధ్రా క్రీడా సంబురాలు దేశ చరిత్రలోనే ఓ మైలు రాయి. ఈ రోజు నుంచి 47 రోజుల వరకూ ఊరురా పోటీలు జరగుతాయని ఆయన తెలిపారు. అందరూ పాల్గొనే ఓ గొప్ప పండుగా ఈ ఆడుదాం ఆంధ్ర అని సీఎం చెప్పుకొచ్చారు. మంచి ఆరోగ్యానికి క్రీడలు ఎంతగానో ఉపయోగపడతాయని ఆయన తెలిపారు.ఇక ఈ కార్యక్రమంలో సీఎం జగన్ క్రీడాకారులతో ముచ్చటించారు. అలానే వివిధ గేమ్స్ ఆడి.. సందడి చేశారు. ఇక బ్యాడ్మింటన్ క్రీడాకారులకు బ్యాట్స్, కాక్స్ ను సీఎం జగన్ అందజేశారు. అలానే వాలీబాల్స్, నెట్ ను సీఎం అందించారు. క్రికెట్ కిట్స్ , వాలీబాల్ కిట్ , బ్యాడ్మింటన్ కిట్ లను సీఎం జగన్ మోహన్ రెడ్డి  ఇచ్చారు. అనంతరం క్రికెట్ లో పాల్గొన్న సీఎం జగన్ బ్యాటింగ్ చేశారు. శాప్ ఛైర్మన్ బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డితో కలిసి సీఎం జగన్ టెన్నిస్ ఆడారు. ఇలా పలు క్రీడల్లో సీఎం జగన్ స్వయంగా పాల్గొన్ని అందరిని ఆకట్టుకున్నారు.

రాష్ట్ర వ్యాప్తంగా 5.09 లక్షల స్పోర్ట్స్ కిట్లను ఏపీ ప్రభుత్వం పంపిణీ చేసింది. ఇక ఈ టోర్నికి  1.22 కోట్ల మంది క్రీడాకారులు, వీక్షకులు రిజిస్ట్రేషన్లు చేయించుకున్నారు. మొత్తం ఐదు క్రీడాంశాల్లో 34.19 లక్షల మంది క్రీడాకారులు నమోదు చేసుకున్నారు. అత్యధికంగా క్రికెట్  13 లక్షల మంది పేర్ల నమోదు  చేసుకున్నారు. యోగా, మారథాన్, టెన్నీ కాయిట్ లో 16 లక్షల మంది పేర్లు నమోదు చేసుకున్నారు. ఈ పోటీలు  51,004 గ్రామ, వార్డు సచివాలయా స్థాయిలో జరుగుతాయి. 9000 ప్లే గ్రౌండ్స్ ను ఏర్పాటు చేశారు. 47 రోజులు, ఐదు దశల్లో ఈ  పోటీలు నిర్వహణ ఉంటుంది.  ఈ క్రీడా సంబురాలు ఇక నుంచి ఏటా జరుగుతాయి.  రూ.12 కోట్లకు పైగా నగదు బహుమతి ఉంటుంది.