iDreamPost
android-app
ios-app

మహిళలకు CM జగన్ శుభవార్త.. ఖాతాల్లో డబ్బులు జమ!

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్ని వర్గాల ప్రజలను ఆర్థికం, సామాజిక సాధికారత సాధించేలా అనేక కార్యక్రమాలు చేపట్టారు. అంతేకాక మహిళలకు, రైతులకు..తరచూ ఏదో ఒక శుభవార్త చెబుతూనే ఉంటారు. తాజాగా మహిళకు సీఎం జగన్ ఓ గుడ్ న్యూస్ చెప్పారు.

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్ని వర్గాల ప్రజలను ఆర్థికం, సామాజిక సాధికారత సాధించేలా అనేక కార్యక్రమాలు చేపట్టారు. అంతేకాక మహిళలకు, రైతులకు..తరచూ ఏదో ఒక శుభవార్త చెబుతూనే ఉంటారు. తాజాగా మహిళకు సీఎం జగన్ ఓ గుడ్ న్యూస్ చెప్పారు.

మహిళలకు CM జగన్ శుభవార్త..  ఖాతాల్లో డబ్బులు జమ!

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మహిళల అభివృద్ధి కోసం ఎన్నో పథకాలను ప్రవేశ పెట్టారు. అంతేకాక ప్రభుత్వం ఇచ్చే ఇళ్లను కూడా ఆడబిడ్డల పేరును అందస్తున్నారు. అలానే వివిధ పథకాల ద్వారా విడుదల చేసే డబ్బులను నేరు మహిళ అకౌంట్లలో జమ చేస్తున్నారు. తాజాగా మహిళలకు ఇళ్ల నిర్మాణం కోసం ఇచ్చిన రుణాలపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వడ్డీని తిరిగి చెల్లించాలని ఆదేశించారు. అలాగే అధికారులకు మరికొన్ని కీలక సూచనలు చేశారు.

శుక్రవారం ఏపీ సీఎం వైఎస్ జగన్ గృహ నిర్మాణ శాఖపై ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో నవరత్నాలు–పేదలందరికీ ఇళ్లు పథకంలోని పురోగతిని పరిశీలించి.. అధికారులకు కీలక సూచనలు చేశారు. ఈ పథకంలో కింద నిరుపేద అక్కచెల్లెమ్మల ఇంటి నిర్మాణం కోసం బ్యాంకు రుణాలు మంజూరు చేసిన సంగతి తెలిసిందే. మంజూరు చేసిన బ్యాంకు రుణాలకు సంబంధించి వడ్డీ డబ్బుల విడుదలకు చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు.

అలాగే ఇళ్ల నిర్మాణం విషయంలో లబ్ధిదారులపై భారం పడకుండా ఒక్కొక్కరి అదనపు సాయం కింద పావలా వడ్డీకి రూ.35 వేల బ్యాంకు రుణాలను అందిస్తున్నామని సీఎం తెలిపారు. ఈ నేపథ్యంలో ఇప్పటివరకూ మంజూరు చేసిన రుణాలకు సంబంధించి ప్రభుత్వం భరించే వడ్డీ జమ చేసేందుకు సిద్ధం కావాలని సూచించారు. అలాగే హౌసింగ్ కింద చేపట్టిన గృహ నిర్మాణాల వేగాన్ని పెంచాలని సీఎం అధికారులను ఆదేశించారు.

అంతేకాక అందుకు అవసరమైన చర్యలను కూడా తీసుకోవాలని సూచించారు. అక్టోబర్ నెలలో 7.43 లక్షల  ఇళ్లను ఇప్పటికే మహిళలకు అందించామని అధికారులకు సీఎం జగన్ కి తెలిపారు. అలానే వచ్చే ఏడాది ఫిబ్రవరి నాటికి మరో 6 లక్షల ఇళ్లు పూర్తిచేసే దిశగా ముందుకు సాగుతున్నామని వెల్లడించారు. ఈ సందర్భంగా జగనన్న కాలనీల్లో మౌలిక సదుపాయాలపై నిరంతరం పర్యవేక్షణ జరపాలని సీఎం జగన్ సూచించారు.

ఇళ్ల నిర్మాణం కోసం ఇప్పటిరకూ 12,72,143 మంది అక్కచెల్లెమ్మలకు పావలా వడ్డీకే రూ.35వేల చొప్పున రుణాలు మంజూరు చేశామని సీఎం తెలిపారు.  ఇప్పటి వరకు అక్క చెల్లెమ్మలు రూ.4,483 కోట్ల రుణాలు అందుకున్నారని సీఎం తెలిపారు. అదేవిధంగా పావలా వడ్డీ రుణాలపై చెల్లించాల్సిన మిగిలిన వడ్డీ భారాన్ని ప్రభుత్వమే భరిస్తుందన్నారు. ఇప్పటివరకూ తీసుకున్న రుణాలపై వడ్డీ డబ్బు విడుదల చేసేందుకు  సిద్ధం కావాలని అధికారులను సీఎం ఆదేశించారు.

అలాగే లబ్ధిదారులతో అసోసియేషన్లు ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. వాటిని సమర్థవంతంగా పనిచేసేలా వారికి తగిన అవగాహన కల్పించాలని సీఎం సూచించారు. ప్రభుత్వం ఇచ్చిన లక్షల విలువైన ఆస్తిని ఎలా సమర్ధవంతగా వినియోగించుకోవాలనే దానిపై వారికి అవగాహన కల్పించాలని తెలిపారు. తద్వారా భవనాలు నిరంతరం నాణ్యతగా, పరిసరాలు పరిశుభ్రంగా ఉండేలా చూసుకోగలుగుతారని సీఎం అన్నారు. ఈ విషయంలో అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు సూచించారు.