iDreamPost
android-app
ios-app

దుర్గమ్మ గుడి అభివృద్ధికి మాస్టర్ ప్లాన్! ఏకంగా రూ.216 కోట్లతో..

Kanaka Durga Temple: గురువారం ఉదయం ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దుర్గమ్మదేవిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం వివిధ పనులకు సీఎం జగన్ శంకుస్థాపన చేశారు.

Kanaka Durga Temple: గురువారం ఉదయం ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దుర్గమ్మదేవిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం వివిధ పనులకు సీఎం జగన్ శంకుస్థాపన చేశారు.

దుర్గమ్మ గుడి అభివృద్ధికి మాస్టర్ ప్లాన్! ఏకంగా రూ.216 కోట్లతో..

విజయవాడలో ఇంద్రకీలాద్రి కొండపై కొలువైన కనక దుర్గమ్మను దర్శించుకునేందుకు వేలాది మంది భక్తులు వస్తుంటారు. ఇక భక్తులకు సౌకర్యాలను, సదుపాయాలను అందించేందుకు ప్రభుత్వం, పాలకమండలి తరచూ చర్యలు తీసుకుంటూనే ఉంటుంది. ఇప్పటికే  అమ్మవారికి గుడి అభివృద్ధికి భారీగా నిధులు వినియోగించారు. తాజాగా మరోసారి కనక దుర్గమ్మ ఆలయాన్ని ఏపీ ప్రభుత్వం భారీ స్థాయిలో అభివృద్ధి చేస్తోంది. భక్తులకు సకల సదుపాయాలు అందించేందుకు భారీ  ప్రణాళికను సిద్ధం చేసింది. మాస్టర్ ప్లాన్‌లో భాగంగా రూ. 216 కోట్లతో పనులు చేపట్టింది.

గురువారం ఉదయం ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దుర్గమ్మదేవిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం వివిధ పనులకు సీఎం జగన్ శంకుస్థాపన చేశారు. మాస్టర్ ప్లాన్ లో భాగంగా అన్నప్రసాద భవనం, ప్రసాదం పోటు, కనకదుర్గ నగర్ నుంచి మహా మండపం వరకు ఎలివేటెడ్ క్యూ కాంప్లెక్స్ లను ఏర్పాటు చేయనున్నారు. అలానే రాజాగోపురం ముందు మెట్ల దారి, క్యూ కాంప్లెక్స్ , మహా రాజద్వారా నిర్మాణం కూడా ఈ మాస్టర్ ప్లాన్ లో భాగంగా నిర్మించనున్నారు. వీటితో పతాటు తలనీలాల హాలు, మల్టీ లెవల్ కార్ పార్కింగ్, గ్రానైట్ రాతి యాగశాలను ఏర్పాటు చేస్తారు. అభివృద్ధి పనులకు ప్రభుత్వం ఇప్పటికే రూ.70 కోట్లను మంజూరు చేసింది. మొత్తంగా కనక దుర్గాదేవి ఆలయ అభివృద్ధికి రూ.216 కోట్లను వినియోగిస్తున్నారు. ఇందులో రూ.131 కోట్లు దేవస్థాన నిధులు కాగా, రూ.5 కోట్లు దాతలు అందించారు. రూ.33 కోట్లు ప్రైవేటు భాగస్వామ్యం కింద అందాయి.

cm jagan durgamma temple

ఇక ఈ రూ.216 కోట్లను వివిధ పనులకు కేటాయించారు. అందులో మల్లేశ్వర స్వామివారి ఆలయ పునర్నిర్మాణాన శంకుస్థాపనకు రూ. 5.60 కోట్లు, మల్లికార్జున మహామండపం క్యూ కాంప్లెక్స్ మార్పు పనులకు రూ. 18.37 కోట్లు అన్నప్రసాద భవన నిర్మాణానికి రూ. 30 కోట్లు కేటాయించారు. ఇంద్రకీలాద్రి కొండ రక్షణ చర్య పనులకు రూ. 4.25 కోట్లు, తలనీలాల భవణ నిర్మాణానికి రూ. 19 కోట్లు ఉపయోగించనున్నారు. అదే విధంగా గోశాల అభివృద్ధి పనులకు 10 కోట్లు రూపాయాలు,  కొండపైన పూజా మండపాల నిర్మాణానికి  7 కోట్లు రూపాయలను, కొండపైన రాతి యాగశాల నిర్మాణానికి రూ. 5 కోట్లు కేటాయించారు.

cm jagan durgamma temple

ఇక పోతే.. ఎలివేటెడ్ క్యూ కాంప్లెక్స్ నిర్మాణానికి 17 కోట్ల రూపాయాలను  ఇవ్వనున్నారు. మహామండపం వద్ద అదనపు క్యూలైన్ల ఏర్పాటుకు రూ.23.50 కోట్లు, రాజగోపురం ముందు భాగాన మెట్ల నిర్మాణానికి రూ.15 కోట్లు కేటాయించారు. మల్లీలెవర్ కారు పార్కింగ్ కు రూ.33 కోట్లు, ఎల్లీ ప్యానల్ వంటి ఇతర అభివృద్ధి పనులకు రూ.3.25 కోట్లు ఇచ్చారు. మెగా సోలార్ విద్యుత్ కేంద్రం ఏర్పాటుకు రూ.5.67 కోట్లను, మహారాజద్వారం నిర్మాణంకి రూ.7.75 కోట్లను కోటాయించారు. ఇలా కనక దుర్గ ఆలయం అభివృద్ధికి మాస్టర్ ప్లాన్ సిద్ధమైంది. మరి..ప్రభుత్వం తీసుకున్న ఈ చర్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి