AP లో రిలయన్స్, బిర్లా భారీ పెట్టుబడులు.. ఏకంగా రూ.4,883 కోట్లతో

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ ఆధ్వర్యంలో రాష్ట్రంలో సంక్షేమంతో పాటు.. అభివృద్ధి పథంలో దూసుకుపోతుంది. ఈ క్రమంలో నేడు ఏపీలో వేల కోట్ల పెట్టుబడులు పెట్టనున్న అనేక కంపెనీల పరిశ్రమలకు శంఖుస్థాపన చేయనున్నారు సీఎం జగన్‌

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ ఆధ్వర్యంలో రాష్ట్రంలో సంక్షేమంతో పాటు.. అభివృద్ధి పథంలో దూసుకుపోతుంది. ఈ క్రమంలో నేడు ఏపీలో వేల కోట్ల పెట్టుబడులు పెట్టనున్న అనేక కంపెనీల పరిశ్రమలకు శంఖుస్థాపన చేయనున్నారు సీఎం జగన్‌

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఒవైపు సంక్షేమ పాలన అందిస్తూనే మరోవైపు రాష్ట్రాభివృద్ధికి కృషి చేస్తున్నారు. యువతకు వారు ఉన్నచోటనే ఉపాధి కల్పించాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నారు. ఈ క్రమంలో తాజాగా ఏపీ పారిశ్రామిక రంగ అభివృద్ధిలో మరో కీలక ఘట్టానికి శ్రీకారం చుట్టనున్నారు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి. రాష్ట్రానికి 4,883 కోట్ల పెట్టబడులు రానున్నాయి. రాష్ట్రంలో పరిశ్రమలు నెలకొల్పుతున్న కంపెనీల్లో రిలయన్స్‌, ఆదిత్య బిర్లా వంటి బడా కంపెనీలు ఉన్నాయి. వీటి వల్ల వేల మందికి ఉద్యోగాలు రానున్నాయి.

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి.. రాష్ట్రంలో రిలయన్స్‌ బయో ఎనర్జీ, ఆదిత్య బిర్లా గ్రూప్‌తో పలు సంస్థలు రాష్ట్రంలో నెలకొల్పుతున్న పరిశ్రమలకు బుధవారం నాడు తన క్యాంప్‌ కార్యాలయం నుంచి వర్చువల్‌గా శంఖుస్థాపన చేయనున్నారు. రూ.సుమారు రూ.4,178 కోట్ల పెట్టుబడులతో ఏర్పాటవుతున్న పలు పరిశ్రమలకు భూమి పూజ నిర్వహించనున్నారు. ఇవే కాకుండా రూ.655 కోట్లతో నెలకొల్పిన ఆగ్రో ప్రాసెసింగ్‌ యూనిట్లను కూడా సీఎం జగన్‌ ప్రారంభించనున్నారు. ఈ పరిశ్రమల వల్ల రాష్ట్రానికి మొత్తంగా సుమారు రూ.4,833 కోట్ల పెట్టుబడులతో పాటు.. కొత్తగా 4,046 మందికి ఉద్యోగాలు లభించనున్నాయి అని తెలిపారు.

రిలయన్స్‌ బయో ఎనర్జీ తొలుత రాష్ట్రంలో 8 ప్రాంతాల్లో వ్యవసాయ వ్యర్ధాల నుంచి బయో గ్యాస్‌ ప్లాంట్లను ఏర్పాటు చేయనుంది. మొత్తం రూ.1,024 కోట్ల పెట్టుబడితో తొలి దశలో కాకినాడ, రాజమండ్రి, విజయవాడ, కర్నూలు, నెల్లూరులో బయో గ్యాస్‌ ప్లాంట్లను నెలకొల్పనుంది. తద్వారా 576 మందికి ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి. అలానే ఆదిత్య బిర్లా గ్రూప్‌ కంపెనీ రూ.1,700 కోట్ల పెట్టుబడితో తిరుపతి జిల్లా నాయుడుపేటలో మాన్యుఫ్యాక్చరింగ్‌ ఆఫ్‌ కార్బన్‌ బ్లాక్‌ను ఏర్పాటు చేయనుంది. దీని వల్ల సుమారు 250 మందికి ఉద్యోగాలు లభిస్తాయి.

వీటితో పాటు హెల్లా ఇన్‌ఫ్రా, వెసువియస్‌ ఇండియా లిమిటెడ్, ఏపీఐఐసీ, ఏపీ ఎంఎస్‌ఎంఈ కార్పొరేషన్, అన ఒలియో ప్రైవేట్‌ లిమిటెడ్‌కు చెందిన పలు ప్రాజెక్టులకు సీఎం జగన్‌ వర్చువల్‌గా శంకుస్థాపనలతో పాటు పలు యూనిట్లను ప్రారంభిస్తారు.

Show comments