రైతులకు గుడ్ న్యూస్ చెప్పిన CM జగన్ .. ఇక నో టెన్షన్!

YS Jagan: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రైతుల కోసం అనేక పథకాలను ప్రారంభించారు. అంతేకాక వ్యవసాయ రంగంలో ఎన్నో సంస్కరణలు ప్రవేశపెట్టారు. తరచూ రైతులకు గుడ్ న్యూస్ చెప్పే.. సీఎం తాజాగా మరో శుభవార్త చెప్పారు.

YS Jagan: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రైతుల కోసం అనేక పథకాలను ప్రారంభించారు. అంతేకాక వ్యవసాయ రంగంలో ఎన్నో సంస్కరణలు ప్రవేశపెట్టారు. తరచూ రైతులకు గుడ్ న్యూస్ చెప్పే.. సీఎం తాజాగా మరో శుభవార్త చెప్పారు.

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి  రైతుల పక్షపాతి అనే విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కారణంగా..రైతుల గురించి ఆయన ఆలోచించినంతగా మరే ముఖ్యమంత్రి ఆలోచించలేదు. అప్పట్లో దివంగత నేత, ఉమ్మడి ఏపీ సీఎం వైఎస్సార్ ..రైతుల పెద్దపీట వేశారు. రైతుల కోసం ఉచిత కరెంట్ ను ప్రవేశపెట్టిన ఘనత ఆయనదే. ఇక ఆయన బాటలోనే తనయుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నడుస్తున్నారు. రైతులు సంతోషంగా ఉంటేనే రాష్ట్రం బాగుంటుందని బలంగా నమ్మిన వ్యక్తి సీఎం జగన్. అందుకే ప్రజలకు, రైతులకు తరచూ ఏదో ఒక శుభవార్త చెబుతుంటారు. తాజాగా తుఫాన్ కారణంగా నష్టపోయిన రైతులకు ఓ విషయంలో సీఎం గుడ్ న్యూస్ చెప్పారు.

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రైతుల కోసం అనేక పథకాలను ప్రవేశపెట్టారు. అంతేకాక వ్యవసాయ రంగంలో ఎన్నో సంస్కరణలు ప్రవేశపెట్టారు. రైతు భరోసా, రైతుభరోసా కేంద్రాలు వంటివి రైతుల కోసం ప్రారంభించారు. తాజాగా తుఫాన్ కారణంగా నష్టపోయిన రైతులకు సీఎం వైఎస్ జగన్‌ అండగా నిలిచారు. తుఫాన్ కారణంగా రంగు మారిన, తడిసిన ధాన్యాన్ని రైతుల నుంచి పౌరసరఫరాల సంస్థ కొనుగోలు చేస్తోందని సీఎం తెలిపారు. ప్రతి గింజనూ కొనే బాధ్యతను ప్రభుత్వం తీసుకుంటుందనే భరోసాను రైతుల్లో నింపాలని తుఫాన్ ప్రభావిత ప్రాంతాల ఎమ్మెల్యేలకు సూచించారు. తుఫాన్ కారణంగా దెబ్బతిన్న పంటలపై అధికారులతో సీఎం జగన్ సమీక్షించారు.

సీఎం క్యాంప్ కార్యాలయంలో ఈ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులకు సీఎం జగన్ పలు కీలక సూచనలు చేశారు. ధాన్యం కొనుగోలులో ఉదారంగా ఉండాలని.. నిబంధనలు సడలించైనా రైతులకు న్యాయం చేయాలని సీఎం ఆదేశించారు. రైతుల దగ్గరున్న ధాన్యాన్ని కొనుగోలు చేసి.. మిల్లర్లకు పంపే బాధ్యతను పౌరసరఫరాల శాఖ అధికారులు తీసుకుంటారని ఆయన స్పష్టం చేశారు. రైతుల వద్ద నుంచి ధాన్యాన్ని ఆర్‌బీకేల వారీగా సేకరణ జరుగుతోందని తెలిపారు. పంట నష్టానికి సంక్రాంతిలోగా పెట్టుబడి రాయితీ ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఉచిత పంటల బీమా స్కీమ్ కింద పరిహారంపై అనుసరించాల్సిన ప్రక్రియనూ సమర్ధవంతంగా చేపట్టాలని అధికారులను ఆదేశించారు.

ఇదే సమీక్ష సమావేశంలో తుఫాన్ తర్వాత వాటిల్లిన పంటనష్టం గణనపై సీఎం జగన్ ఆరా తీశారు. ఈ సందర్భంగా అధికారులు కీలక అంశాలను సీఎం వద్ద ప్రస్తావించారు. ఈ నెల 11 నుంచి 18వ తేదీ వరకు ఎన్యూమరేషన్‌ చేస్తామన్నారు. అదే విధంగా ఈ నెల 19 నుంచి 22 తేదీ వరకు సామాజిక తనిఖీకి  రైతు భరోసా కేంద్రాల్లో జాబితాలను ప్రదర్శిస్తామని అధికారులు వివరించారు. సవరణలు, అభ్యంతరాల స్వీకరణ తర్వాత నెలాఖరు నాటికి తుది జాబితాలను ప్రభుత్వానికి అందిస్తామని తెలిపారు. మిచౌంగ్ తుఫాన్‌ వల్ల నష్టపోయిన రైతులను ప్రభుత్వం అన్నిరకాలుగా ఆదుకుంటుందని సీఎం జగన్ అన్నారు. రైతులెవ్వరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వారికి భరోసా ఇచ్చారు.

ప్రతి గింజను కూడా కొనుగోలు చేసే బాధ్యతను ప్రభుత్వం తీసుకుంటుంది రైతులకు సీఎం జగన్ ధైర్యాన్ని ఇచ్చారు. ఆర్బీకేల వారీగా ఈ కొనుగోళ్లు జరుగుతాయని.. దీనికి సంబంధించి సంబంధిత అధికారులకు  సీఎం ఆదేశాలు జారీచేశారు. సకాలంలోనే వారికి ఇన్‌పుట్‌ సబ్సిడీ ఇచ్చేందుకు ఇప్పటికే అన్ని రకాల చర్యలు చేపట్టామన్నారు. పంట నష్టపోయిన వారికి వైఎస్సార్‌ ఉచిత బీమా కింద పరిహారం  కూడా అందజేస్తామన్నారు. మరి.. తుఫాన్ ప్రభావిత ప్రాంతంలోని రైతుల విషయంలో జగన్ కీలక వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments