iDreamPost
android-app
ios-app

ఆ రూ.27 కోట్ల వివరాలివ్వండి.. TDP ఆఫీస్‌కు సీఐడీ నోటీసులు!

ఏపీ సీఐడీ.. తెలుగు దేశం పార్టీ కేంద్ర కార్యాలయానికి నోటీసులు జారీ చేసినట్లు సమాచారం. నోటీసుల్లో పలు కీలక అంశాలను పేర్కొన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే స్కిల్ డెవలప్మెంట్, ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో సీఐడీ విచారణ చేపట్టింది.

ఏపీ సీఐడీ.. తెలుగు దేశం పార్టీ కేంద్ర కార్యాలయానికి నోటీసులు జారీ చేసినట్లు సమాచారం. నోటీసుల్లో పలు కీలక అంశాలను పేర్కొన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే స్కిల్ డెవలప్మెంట్, ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో సీఐడీ విచారణ చేపట్టింది.

ఆ రూ.27 కోట్ల వివరాలివ్వండి.. TDP ఆఫీస్‌కు సీఐడీ నోటీసులు!

ఏపీలో సీఐడీ వివిధ కేసులను దర్యాప్తు చేస్తుంది. అంతేకాక పలు అంశాలపై ప్రముఖలకు, ఆఫీసులకు నోటీసులు సైతం జారీ చేస్తుంది. తాజాగా తెలుగు దేశం పార్టీకి కూడా ఏపీ సీఐడీ షాక్ ఇచ్చింది. మంగళగిరిలోని టీడీపీ సెంట్రల్ ఆఫీస్ కి ఏపీ నేర దర్యాప్తు విభాగం(సీఐడీ) నోటీసులు జారీ చేసింది. టీడీపీ ఖాతాలో జమ అయిన నగదు వివరాల్ని కోరుతూ సీఐడీ ఆ నోటీసులు జారీ చేసినట్లు సమాచారం. ఈ మేరకు టీడీపీ జనరల్‌ సెక్రటరీతో పాటు ట్రెజరర్‌ పేరిట సీఐడీ ఆ నోటీసుల్ని జారీ అయినట్లు తెలుస్తోంది.

తెలుగు దేశం పార్టీ అకౌంట్లోకి వచ్చిన రూ. 27 కోట్ల వివరాలు కావాలి అని సీఐడీ నోటీసుల్లో పేర్కొంది. ఈ నెల 18వ తేదీన సీఐడీ కార్యాలయానికి వివరాలతో రావాలంటూ జనరల్ సెక్రటరీ, ట్రెజరర్.. ఇద్దరికి నోటీసుల్లో సీఐడీ సూచించింది. ఇదిలా ఉంటే.. ఏపీ స్కిల్‌ డెవలప్‌మెంట్‌ స్కామ్‌ కేసులోని రూ.27 కోట్లు టీడీపీ ఖాతాలోకి మళ్లిందనే అభియోగాలు ఉన్నాయి. దీనికి సంబంధించిన కీలక ఆధారాలను సీఐడీ, ఏసీబీ కోర్టుకు ఇంతకు ముందే సమర్పించింది.  అంతేకాదు..ఈ కేసులో టీడీపీ అడిటర్‌ను విచారించాల్సిన అవసరమూ ఉందని కోర్టు దృష్టికి తీసుకెళ్లింది కూడా. ఇప్పటికే ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కేసులు చంద్రబాబు అరెస్టై ..బెయిల్ పై విడుదలైన సంగతి తెలిసిందే. 52 రోజుల పాటు ఆయన జైల్లో

ఈ కేసుల్లో సీఐడీ అధికారులు పలు ఆధారాలను సేకరించారు. స్కిల్ డెవలప్మెంట్ కు సంబంధించిన వివరాలను ఇప్పటికే ఏసీబీ కోర్టులో సమర్పించారు. అలానే ఇన్నర్ రింగ్ రోడ్డు, ఫైబర్ గ్రిడ్ కేసుల్లో కూడా సీఐడీ అధికారులు దర్యాప్తు చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా టీడీపీ ఆఫీసుకు కూడా రూ.27 కోట్ల నగదుకు సంబంధించి నోటీసులు ఇచ్చినట్లు సమాచారం. ఈ  విషయం గురించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది. మరి..టీడీపీ ఆఫీసుకు సీఐడీ నోటీసులు ఇవ్వడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.