Dharani
మీ పిల్లలకు ఎలాంటి ఫీజు లేకుండా ఉచితంగా.. మంచి నాణ్యమైన విద్య అందించాలని భావిస్తున్నారా.. అయితే ఇంకెందుకు ఆలస్యం.. వెంటనే ఈ పాఠశాలల్లో చేర్చండి. ఆ వివరాలు..
మీ పిల్లలకు ఎలాంటి ఫీజు లేకుండా ఉచితంగా.. మంచి నాణ్యమైన విద్య అందించాలని భావిస్తున్నారా.. అయితే ఇంకెందుకు ఆలస్యం.. వెంటనే ఈ పాఠశాలల్లో చేర్చండి. ఆ వివరాలు..
Dharani
నేటి కాలంలో చదువుకోవడం అనేది చాలా ఖరీదైన వ్యవహారంగా మారింది. ఇంగ్లీష్ మీడియం చదువుల పేరుతో అడ్డగోలుగా ఫీజులు వసూలు చేస్తూ.. తల్లిదండ్రుల శ్రమను దోపిడి చేస్తుంటాయి కొన్ని ప్రైవేటు స్కూల్ యాజమాన్యాలు. పాఠశాలలో కనీస సౌకర్యాలు కూడా ఉండవు.. కానీ ఫీజుల రూపంలో మాత్రం వేలు, లక్షల రూపాయలు వసూలు చేస్తాయి. పేద, మధ్యతరగతి వారికి.. పిల్లల చదువు అనేది పెద్ద భారంగా మారింది. మరి మీరు కూడా మీ పిల్లలకు మంచి చదువు చెప్పించాలని భావిస్తున్నారా.. అయితే మీ కోసమే ఈ వార్త. మీ పిల్లలకు ఉచితంగా మంచి, నాణ్యమైన విద్య అందించాలని భావిస్తున్నారా.. అయితే వెంటనే ఈ స్కూల్లో అప్లై చేయండి. పూర్తి వివరాలు మీ కోసం..
మోడల్ స్కూళ్లలో ఉచితంగానే విద్యార్థులకు నాణ్యమైన విద్య అందిస్తున్నారు. ఈ క్రమంలోనే చిత్తూరు జిల్లాలోని ఆదర్శ పాఠశాల (ఏపీ మోడల్ స్కూల్)లో 2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించి.. 6 నుంచి 9 వ తరగతుల్లో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. ఈ నెల 14 వరకు చివరి తేదీ అని.. డీఈఓ నాగరాజు తెలిపారు. విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నారు. ఇక ఈ మోడల్ స్కూల్లో ఇంగ్లీష్ మీడియంలోనే విద్యా బోధన ఉంటుందని తెలిపారు. 2024-25 విద్యా సంవత్సరానికి గాను ఇంటర్ ఫస్టియర్, సెకండియర్ కోసం కూడా దరఖాస్తు చేసుకోవచ్చు అని చెప్పుకొచ్చారు. ఈ మోడల్ స్కూల్స్‌లో ఎలాంటి ఫీజు వసూలు చేయరు.
అలానే కుప్పం నియోజకవర్గం, రామకుప్పం మండల కేంద్రంలోని ఆదర్శ పాఠశాలలో 7, 8, 9 తరగతుల్లో ఖాళీగా ఉన్న సీట్లకు కూడా దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ఆదర్శ స్కూల్ ప్రిన్సిపాల్ తెలిపారు. ఆసక్తి ఉన్న వారు జూన్ 11లోపు దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఇందుకోసం స్టడీ సర్టిఫికెట్, విద్యార్థి తల్లిదండ్రుల ఆధార్ కార్డ్స్ జీరాక్స్, రెండు పాస్పోర్ట్ సైజ్ ఫొటోలు అందించాలని తెలిపారు. దరఖాస్తు చేసుకున్న తర్వాత.. వీరికి ప్రవేశ పరీక్ష నిర్వహించి.. మెరిట్ ప్రకారం సెలక్ట్ చేస్తారు.
ఇక ఈ పాఠశాలల్లో 7వ తరగతికి రాష్ట్ర స్థాయి, 8, 9 తరగతులకు సెంట్రల్ సిలబస్ ఉంటుందని తెలిపారు. ఇక ఇక్కడ ఒక్కసారి చేరితో.. ఆహ్లాదరకమైన వాతావరణంలో విద్యార్థులు ఎంతో చక్కగా చదువుకోవచ్చు. తల్లిదండ్రులకు ఫీజులు చెల్లించే భారం ఉండదు. వసతులు కూడా బాగానే ఉంటాయి. అందుకే మీ పిల్లలకు ఉచితంగా.. లేదంటే నామమాత్రంపు ఖర్చుతో మంచి విద్య అందించాలంటే ఈ స్కూల్లో చేర్చండి. వెంటనే అప్లై చేసుకొండి.