ఎన్నికల విధులకు వెళ్లే ఉద్యోగులకు శుభవార్త.. ఆ రోజు వారికి ప్రత్యేకంగా

ఏపీలో ఎన్నికల విధులు నిర్వహించే సిబ్బందికి సీఈవో శుభవార్త చెప్పారు. వారికి ఆ రోజు ప్రత్యేక అనుమతి ఇస్తూ ఆదేశాలు జారీ చేశారు.

ఏపీలో ఎన్నికల విధులు నిర్వహించే సిబ్బందికి సీఈవో శుభవార్త చెప్పారు. వారికి ఆ రోజు ప్రత్యేక అనుమతి ఇస్తూ ఆదేశాలు జారీ చేశారు.

రెండు తెలుగు రాష్ట్రాల్లో మరికొన్ని గంటల్లో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ప్రారంభం కానుంది. ఇప్పటికే ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవడం కోసం సొంత ఊరి బాట పట్టారు. శనివారం ఉదయం నుంచి హైదరాబాద్ లో భారీ ట్రాఫిక్ ఏర్పడింది. రెండు రోజులు వరుస సెలవులు రావడం, పోలింగ్ రోజున కూడా సెలవు ఉండటంతో చాలా మంది జనాలు సొంత ఊర్లకు పయనం అయ్యారు. పోలింగ్ రోజున ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు కచ్చితంగా సెలవు ఇవ్వాలని ఇప్పటికే ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. ఈక్రమంలో ఎన్నికల విధులకు హాజరయ్యే ఉద్యోగులకు శుభవార్త చెప్పింది. ఆ వివరాలు..

ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల విధులకు వెళ్లే ప్రభుత్వ ఉద్యోగులకు ఎన్నికల సంఘం శుభవార్త చెప్పింది. ఈ నెల 13న పోలింగ్ విధులు నిర్వహించే సిబ్బందికి మరో రోజు సెలవు ఇచ్చారు. ఈ నెల 14న ప్రత్యేక క్యాజువల్ లీవ్ (ఆన్ డ్యూటి)పై సీఈవో (రాష్ట్ర ఎన్నికల కమిషనర్) ఎంకే మీనా ప్రత్యేక ప్రకటన జారీ చేశారు. ఈ మేరకు సెలవు మంజూరుకు సంబంధించి ఆయా శాఖలు అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రధానంగా ఎన్నికల పోలింగ్ విధులు నిర్వహించే పీవో(ప్రిసైడింగ్ అధికారులు), ఏపీవో (అసిస్టెంట్ ప్రిసైడింగ్ అధికారులు), మిగిలిన పోలింగ్ సిబ్బందికి 14 తేదీన ఈ స్పెషల్ క్యాజువల్ లీవ్(ఆన్ డ్యూటీ) వర్తిస్తుందని ఈసీ వెల్లడించింది.

అయితే ఈ సెలవు అందరికి వర్తించదు. ఎన్నికల విధుల్లో భాగంగా రిజర్వ్‌డ్ సిబ్బందిగా ఉన్న పీవో, ఏపీవో, ఇతర సిబ్బందిగా డ్రాఫ్ట్ చేయబడిన వారికి ఈ సెలవు వర్తించదని ఈసీ తెలిపింది. ఈ సీఎల్ ఆన్ డ్యూటీ లీవ్ కేవలం పోలింగ్ విధులు నిర్వహించే సిబ్బందికి మాత్రమే వర్తిస్తుందని ఈసీ పేర్కొంది. ఈ మేరకు అన్ని జిల్లాల ఎన్నికల అధికారులకు ఈ ఆదేశాలను రిటర్నింగ్ అధికారు (ఆర్వో)లు తెలియజేయాలన్నారు. ఈ నెల 13న పోలింగ్ ముగిసిన తర్వాత.. రిసెప్షన్ కేంద్రంలో ఎన్నికల సిబ్బంది (పీవో, ఏపీవో, ఓపీవో)కి పోలింగ్ సామాగ్రి అప్పగించిన తర్వాత.. పోలింగ్ నాడు విధుల్లో పాల్గొన్న సిబ్బందికి ఆన్ డ్యూటీ సర్టిఫికేట్లు అందజేస్తారు.

ఎన్నికల విధులకు హాజరైన సిబ్బంది ఈ నెల 14న స్పెషల్ క్యాజువల్ లీవ్ (ఆన్ డ్యూటీ) సౌకర్యాన్ని వినియోగించుకునేలా ఈసీ చర్యలు తీసుకుంటోంది. ఈ మేరకు అందరు అధికారులు, జిల్లా ఎన్నికల అధికారులుగా కలెక్టర్లు, లీవ్ శాంక్షన్ చేసే అథారిటీలకు ఆదేశాలు పంపాలని సీఈవో మీనా కోరారు. ఈ నెల 13న పోలింగ్ విధుల్లో పాల్గొనే సిబ్బందికి.. ఆ మరుసటి రోజు (మే 14న) స్పెషల్ క్యాజువల్ లీవ్ (ఆన్ డ్యూటీ)గా పరిగణించాలని ఏపీ ప్రభుత్వ ఉద్యోగ సంఘాల నేతలు ఎన్నికల సంఘాన్ని కోరారు. ఉద్యోగ సంఘాల విజ్ఞప్తి మేరకు ఏపీ సీఈవో ముఖేష్ కుమార్ మీనా నిర్ణయం తీసుకున్నారు. దీనిపై ఉద్యోగులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Show comments