iDreamPost
android-app
ios-app

ప్రముఖ వ్యాపారవేత్త కోనేరు రాజేంద్ర ప్రసాద్‌ మృతి

  • Published Nov 18, 2023 | 8:30 AMUpdated Nov 18, 2023 | 8:30 AM

ఆంధ్రప్రదేశ్‌కు చెందని ప్రముఖ వ్యాపారవేత్త కోనేరు రాజేంద్ర ప్రసాద్‌ మృతి చెందారు. ఆ వివరాలు..

ఆంధ్రప్రదేశ్‌కు చెందని ప్రముఖ వ్యాపారవేత్త కోనేరు రాజేంద్ర ప్రసాద్‌ మృతి చెందారు. ఆ వివరాలు..

  • Published Nov 18, 2023 | 8:30 AMUpdated Nov 18, 2023 | 8:30 AM
ప్రముఖ వ్యాపారవేత్త కోనేరు రాజేంద్ర ప్రసాద్‌ మృతి

ఈ మధ్య కాలంలో గుండెపోటు మరణాలు ఎక్కువగా నమోదు అవుతున్నాయి. మూడు రోజుల క్రితం నగరంలో బీటెక్‌ సెకండియర్‌ చదువుతోన్న సిరిసిల్ల విద్యార్థిని ప్రదీప్తి గుండెపోటుతో కాలేజీలోనే కుప్పకూలిన సంగతి తెలిసిందే. ఇక తాజాగా మరో సంఘటన చోటు చేసుకుంది. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త కోనేరు రాజేంద్రప్రసాద్‌ కన్నుమూశారు. హైదరాబాద్‌లో గుండెపోటుతో శుక్రవారం తుది శ్వాస విడిచారు.

రాజేంద్రప్రసాద్‌కు భార్య విమలాదేవి, ముగ్గురు కుమారులు ఉన్నారు. ఆయన స్వస్థలం విజయవాడలోని గుణదల. రాజేంద్రప్రసాద్‌ తండ్రి మధుసూదనరావు.. గతంలో విజయవాడలో వైద్య నిపుణులుగా పని చేసి ఎంతో పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నారు. ఆయన కుమారుడైన రాజేంద్రప్రసాద్‌.. చదువు మధ్యలోనే ఆపేసి.. ఉద్యోగం కోసం గల్ఫ్‌ దేశాలకు వెళ్లారు. ఆ తర్వాత పారిశ్రామికవేత్తగా ఎంతో ఎత్తుకు ఎదిగారు.

కోనేరు రాజేంద్రప్రసాద్‌ 2014లో వైసీపీ విజయవాడ వైసీపీ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేశారు. 2016 లో పార్టీకి రాజీనామా చేసి.. ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. ప్రస్తుతం ఆయన చెన్నైలో తన కుటుంబంతో కలిసి ఉంటున్నారు. ఆయన అంత్యక్రియలను కూడా చెన్నైలోనే నిర్వహించనున్నారు. నేడు హైదరాబాద్‌ నుంచి ఆయన భౌతికకాయాన్ని చెన్నై తరలించారు. శనివారం సాయంత్రం 4 గంటలకు బీసెంట్‌నగర్‌ శ్మశానవాటికలో దహన సంస్కారాలు నిర్వహించనున్నట్లు రాజేంద్రప్రసాద్‌ కుటుంబ సభ్యులు తెలిపారు.

కోనేరు రాజేంద్ర ప్రసాద్‌ మృతిపై పలువురు ప్రముఖులు రాజకీయ నాయకులు సంతాపం తెలుపుతున్నారు. స్వయం కృషితో అంచెలంచెలుగా  గొప్ప పారిశ్రామికవేత్తగా ఎదిగారని.. ఆయన ప్రస్థానం ఎందరికో ఆదర్శం అని కొనియాడారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. కొందరు ప్రముఖులు ట్విట్టర్‌ వేదికగా కోనేరు రాజేంద్రప్రసాద్‌ మృతి పట్ల సంతాపం వ్య​క్తం చేశారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి