Dharani
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం ఆస్పత్రిలో చేరారు. అనారోగ్యానికి గురైనట్లు తెలిసింది. ఆ వివరాలు..
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం ఆస్పత్రిలో చేరారు. అనారోగ్యానికి గురైనట్లు తెలిసింది. ఆ వివరాలు..
Dharani
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్, ఆమదాలవలస ఎమ్మెల్యే తమ్మినేని సీతారాం అస్వస్థతకు గురయ్యారు. దాంతో ఆయనని ఆస్పత్రిలో చర్చారు. విషయం తెలియడంతో వైసీపీ నేతలు, కార్యకర్తలు, ఆయన అభిమానులు, అనుచరులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆయన త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నారు. సీతారాం నీరసంగా ఉండటం.. అనారోగ్యంతో ఇబ్బంది పడటం గమనించిన కుటుంబ సభ్యులు గురువారం రాత్రి ఆయన ఆస్పత్రిలో చేర్చారు. శ్రీకాకుళంలోని మెడికవర్ ఆసుపత్రిలో సీతారాంకు చికిత్స అందిస్తున్నారు.
కార్డియాలజిస్ట్ బుడుమూరు అన్నాజీరావు, ఫిజిషియన్ వేణుగోపాలరావు తమ్మినేనికి పలు వైద్య పరీక్షలు చేశారు. ఆయన స్వల్ప అస్వస్థతకు గురయ్యారని.. ఆందోళన చెందాల్సిన పని లేదని డాక్టర్లు తెలిపారు. ఒకరోజు పర్యవేక్షణలో ఉంచి తర్వాత ఆయన్ని ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ చేస్తామని తెలిపారు. దాంతో కుటుంబ సభ్యులు, అనుచరులు ఊపిరి పీల్చుకున్నారు.
ఇదిలా ఉండగా తూర్పు రాయలసీమ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖరరెడ్డి గురువారం నాడు రోడ్డు ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో ఆయన తీవ్రంగా గాయపడగా.. చంద్రశేఖరరెడ్డి పీఏ అక్కడికక్కడే కన్నుమూశాడు. తీవ్రంగా గాయపడ్డ చంద్రశేఖరెడ్డికి ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. ఆయన పరిస్థితి బాగుందని.. త్వరగానే కోలుకుంటారని వైద్యులు వెల్లడించారు. చంద్రశేఖరరెడ్డి కారు.. లారీని ఢీకొట్టడంతో.. ఈ ప్రమాదం సంభవించింది. ఇదే సమయంలో అటుగా వస్తోన్న కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ ప్రమాదాన్ని గమనించి.. తన కారులోనే చంద్రశేఖరరెడ్డిని ఆస్పత్రికి తరలించారు.