AP Elections 2024: AP ఎన్నికల ఫలితాలు.. తొలి రిజల్ట్‌ వచ్చేది అక్కడే

AP Assembly Elections 2024 Counting: మరి కొన్ని గంటల్లో ఏపీ ఎన్నికల కౌంటింగ్‌ ప్రక్రియ ప్రారంభం కానుంది. ఈ క్రమంలో తొలి, చివరి ఫలితాలు ఎక్కడ నుంచి వెలువడుతాయి అనే ఆసక్తికర వివరాలు మీ కోసం..

AP Assembly Elections 2024 Counting: మరి కొన్ని గంటల్లో ఏపీ ఎన్నికల కౌంటింగ్‌ ప్రక్రియ ప్రారంభం కానుంది. ఈ క్రమంలో తొలి, చివరి ఫలితాలు ఎక్కడ నుంచి వెలువడుతాయి అనే ఆసక్తికర వివరాలు మీ కోసం..

మరి కొన్ని గంటల్లో ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికల ఫలితాలు వెల్లడి కానున్నాయి. మంగళవారం ఉదయం 8 గంటల​​కు కౌంటింగ్‌ ప్రారంభం కానుంది. ఇప్పటికే ఎన్నికల కమిషన్‌ ఇందుకు సంబంధించిన చర్యలన్ని తీసుకుంది. కౌంటింగ్‌ కేంద్రాల వద్ద.. భారీ బందోబస్త్‌ ఏర్పాటు చేసింది. మూడంచెల భద్రత ఏర్పాటు చేసింది. మరి కొన్ని నిమిషాల్లో ఏపీతో పాటు సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్‌ ప్రారంభం కానుంది. మధ్యాహ్నం వరకు దాదాపుగా ఫలితాలు వచ్చేయనున్నాయి. ఇక దేశం మొత్తం ఒక లెక్క.. ఏపీ ఒక లెక్క అన్నట్లుగా ప్రస్తుత పరిస్థితి నెలకొని ఉంది. ఏపీ ఫలితాలపై రెండు తెలుగు రాష్ట్రాల భారీ ఉత్కంఠత నెలకొని ఉంది. ఈ క్రమంలో మరి కొన్ని నిమిషాల్లో ఏపీలో ఫలితాల వెల్లడి ప్రక్రియ ప్రారంభం కానుంది. మరి తొలి ఫలితాలు ఏ నియోజనకవర్గానికి సంబంధించి వెలువడుతాయి అనే వివరాలు మీ కోసం..

ఏపీ ఎన్నికల ఫలితాల్లో.. ముందుగా కొవ్వూరు, నరసాపురం అసెంబ్లీ స్థానాలకు తొలుత ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. అలాగే ఈ రెండుచోట్ల 13 రౌండ్లలో కౌంటింగ్ పూర్తికానుంది. దీంతో కౌంటింగ్ ప్రారంభమైన గంటల వ్యవధిలోనే ఈ రెండు నియోజకవర్గాలకు సంబంధించిన పూర్తి స్థాయి ఫలితాలు వెలువడే అవకాశం ఉంది. ఇ​క ఈ ఎన్నికల్లో.. కొవ్వూరులో వైసీపీ నుంచి తలారి వెంకట్రావు, టీడీపీ కూటమి నుంచి ముప్పిడి వెంకటేశ్వరరావు పోటీ చేశారు.. ఇక నరసాపురం విషయానికి వస్తే వైసీపీ నుంచి ముదునూరి ప్రసాదరాజు.. జనసేన నుంచి బొమ్మిడి నాయకర్ బరిలో ఉన్నారు. మరి కొన్ని గంటల్లో వీరిలో విజేత ఎవరో తేలనుంది. అ ఇక భీమిలి, పాణ్యం అసెంబ్లీ నియోజకవర్గాల్లో 26 రౌండ్లలో కౌంటింగ్‌ పూర్తి కానుంది. దీంతో ఈ నియోజకవర్గాల ఫలితాలు వచ్చేందుకు ఆలస్యం కానుంది.

ఇక లోక్ సభ నియోజకవర్గాల విషయానికి వస్తే.. రాజమహేంద్రవరం, నరసాపురం స్థానాల్లో కౌంటింగ్‌ ప్రక్రియ 13 రౌండ్లలో పూర్తి కానుంది. ఇక్కడ ఫలితాలు త్వరగా వచ్చే అవకాశం ఉంది. అలాగే అమలాపురం లోక్ సభ నియోజకవర్గం ఓట్ల లెక్కింపునకు 27 రౌండ్లు పడుతుంది. దీంతో ఫలితాలు వచ్చేందుకు సుమారు 9 గంటల సమయం పడుతుంది. జూన్‌ 4న ఉదయం 8 గంటల నుంచి పోస్టల్‌ బ్యాలెట్‌, 8.30 నుంచి ఈవీఎంలలో పోలైన ఓట్లను లెక్కిస్తారు. అయితే పోస్టల్ బ్యాలెట్ ఓట్లు ఎక్కువగా పోలైన నేపథ్యంలో ఫలితాలకు కొంచెం సమయం పట్టే అవకాశం ఉంది. పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు కోసం ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేశారు. అలాగే కౌంటింగ్ నేపథ్యంలో ఏపీకి 119 మంది అబ్జర్వర్లను ఈసీ నియమించింది.

Show comments