ఏపీ-తెలంగాణ వాహనదారులకు గుడ్ న్యూస్.. ఇక యాక్సిడెంట్లకు భయపడొద్దు!

ఆంధ్రప్రదేశ్-తెలంగాణ వాహనదారులకు గుడ్ న్యూస్. ఇక మీదట ప్రమాదాలకు భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకో ఇప్పుడు తెలుసుకుందాం..

ఆంధ్రప్రదేశ్-తెలంగాణ వాహనదారులకు గుడ్ న్యూస్. ఇక మీదట ప్రమాదాలకు భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకో ఇప్పుడు తెలుసుకుందాం..

ఉభయ తెలుగు రాష్ట్రాల మధ్య రాకపోకలకు హైదరాబాద్-విజయవాడ హైవే చాలా కీలకం అనేది తెలిసిందే. ఇక్కడ ఎంత రద్దీ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన ప్రజలు రోజూ ఈ హైవే మీద రాకపోకలు సాగిస్తుంటారు. వీకెండ్స్​లో ఈ రహదారిపై భారీగా ట్రాఫిక్ ఉంటుంది. పండుగ రోజుల్లోనూ రద్దీ విపరీతంగా ఉంటుంది. అయితే ఈ హైవే ప్రమాదాలకు అడ్డాగా మారింది. ఇక్కడ రోడ్డు ప్రమాదాలు జరగడం సర్వసాధారణం అయిపోయింది. భాగ్యనగరం నుంచి విజయవాడ చేరుకునేలోపు రోజులో కనీసం ఒకట్రెండు ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి. అయితే ఇక మీదట ఈ హైవే మీద ప్రయాణించే వాహనదారులు యాక్సిడెంట్లకు భయపడాల్సిన అవసరం లేదు. వాళ్లకో గుడ్ న్యూస్.

హైదరాబాద్-విజయవాడ హైవే మీద ప్రమాదాలను తగ్గించేందుకు జాతీయ రహదారుల సంస్థ (ఎన్​హెచ్​ఏఐ) సిద్ధమైంది. ఈ రహదారిలో మొత్తం 17 చోట్ల బ్లాక్ స్పాట్స్ ఉన్నాయని అధికారులు గుర్తించారు. ఇక్కడే అత్యధిక ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయట. దీంతో ఆయా ప్రాంతాల్లో తక్షణమే యాక్సిడెంట్ల నివారణకు తీసుకోవాల్సిన చర్యలకు ఎన్​హెచ్​ఏఐ రెడీ అయింది. తెలంగాణలో లోక్​సభ ఎలక్షన్స్ కోడ్ ముగిసిన వెంటనే పనులు మొదలవ్వనున్నాయి. ఈ వర్క్స్​కు సంబంధించిన టెండర్ ప్రక్రియను ఓ ఏజెన్సీకి అప్పగించారు. చౌటుప్పల్ నుంచి నవాబ్​పేట జంక్షన్ దాకా అధికారులు గుర్తించిన మొత్తం 17 బ్లాక్ స్పాట్స్​లో 10 చోట్ల అండర్ పాస్​లు నిర్మించనున్నారు.

అండర్​ పాస్​లు, సైన్ బోర్డ్​లు, రోడ్ల వెడల్పు సహా మొత్తం పనుల నిర్వహణకు రూ.288 కోట్ల నిధుల్ని వెచ్చించనున్నారు. చౌటుప్పల్​తో పాటు పెద్దకాపర్తి, చిట్యాల, టేకుమట్ల, జనగామ క్రాస్, ఎస్వీ కాలేజ్, సూర్యాపేట ఫ్లై ఓవర్, ముకుందాపురం, కొమరబండ క్రాస్ రోడ్, రామాపురం క్రాస్ రోడ్ దగ్గర అండర్​ పాస్​లు నిర్మించనున్నారు. కట్టంగూర్ జంక్షన్, ఇనుపాముల సర్వీస్ రోడ్, ధూర్జపల్లి జంక్షన్, ఆకుపాముల, నవాబ్​పేట మార్గాల వద్ద సైన్ బోర్డుల్ని ఏర్పాటు చేయనున్నారు. అండర్ పాస్​లు, సూచిక బోర్డులు, రోడ్ల విస్తరణ పనులు త్వరలో ప్రారంభం కానున్నాయి. దీంతో ఈ రూట్లలో వెళ్లే వాహనదారులు జర్నీ గురించి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు.

Show comments