Swetha
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్య మంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి.. పేద ప్రజల కలలను సాకారం చేసే దిశగా తానూ సీఎం అయ్యాక కొన్ని పథకాలను అమలులోకి తీసుకుని వచ్చారు. అందులో పేద ప్రజలకు ఇళ్ళు కట్టించడం ప్రారంభించారు. ఇప్పటికే ఈ కార్యక్రమానికి సంబంధించిన పనులు శరవేగంగా సాగుతున్నాయి.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్య మంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి.. పేద ప్రజల కలలను సాకారం చేసే దిశగా తానూ సీఎం అయ్యాక కొన్ని పథకాలను అమలులోకి తీసుకుని వచ్చారు. అందులో పేద ప్రజలకు ఇళ్ళు కట్టించడం ప్రారంభించారు. ఇప్పటికే ఈ కార్యక్రమానికి సంబంధించిన పనులు శరవేగంగా సాగుతున్నాయి.
Swetha
దేశంలో ఎక్కడా లేని విధంగా పేద ప్రజలకు గృహ నిర్మాణ కార్యక్రమం.. ఆంధ్రప్రదేశ్ లో అత్యద్భుతంగా కొనసాగుతోంది. సొంత ఇల్లు అనేది ప్రతి ఒక్కరి కల. పేద ప్రజలు సైతం తమ కలలను సాకారం చేసుకునేందుకు.. డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి సీఎంగా ఉన్నప్పుడు అందరికి సొంత ఇళ్ళు నిర్మించేందుకు చర్యలు చేపట్టారు. ఆ తరువాత దీనిని ఎవరు ముందుకు తీసుకువెళ్లలేకపోయారు. కానీ, సీఎం జగన్ మోహన్ రెడ్డి వారి కలలను ఇప్పుడు నిజం చేస్తున్నారు. ఇప్పటివరకు ప్రభుత్వం ఇళ్ల నిర్మాణానికి దాదాపు రూ.76,670.05 కోట్లు ఖర్చు చేసింది. ఇందులో భాగంగా 30,76,018 మంది మహిళలకు ఉచితంగా పట్టాలిచ్చారు. 70,811.50 ఎకరాల విస్తీర్ణంలో లేఅవుట్లు వేసి ప్రభుత్వమే నీరు, రోడ్లు, విద్యుత్, డ్రెయినేజీ తదితర సౌకర్యాలను సైతం కల్పించింది. దీనికి సంబంధించిన పనులు అన్ని శరవేగంగా కొనసాగుతున్నాయి. ఇది మా ఇల్లు అని ప్రజలు గర్వంగా విధంగా జగన్ ఈ ఇళ్ల నిర్మాణాలపై ప్రత్యేక శ్రద్ద వహిస్తున్నారు.
అయితే జగన్ ప్రభుత్వం ఒక ఇంటి నిర్మాణానికి సుమారు రూ.1.80 లక్షలు అందిస్తోంది. దీనితో పాటు గృహ నిర్మానికి అవసరమయ్యే ఇసుకను ఉచితంగా ఇస్తున్నారు. సిమెంట్, ఐరన్, ఇతర నిర్మాణ సామగ్రిని సబ్సిడీపై పంపిణీ చేస్తున్నారు. ఇలా చేయడం వలన దాదాపు రూ.40 వేల మేర లబ్ధి చేకూరుతోంది. ఇవే కాకుండా అనేక విధాలుగా సాయం చేస్తూ ఒక్కొక్క ఇంటిపై సుమారు రూ.2.70 లక్షల వరకు ప్రభుత్వం ఖర్చు చేస్తోంది. అధికారులు నిత్యం ఈ పనులను ప్రత్యేక శ్రద్ధతో సందరిస్తూ ఉంటారు. ఈ ప్రాంతాలను వైఎస్సార్, జగనన్న కాలనీలుగా పిలుస్తున్నారు. ఇప్పటికే ఈ కాలనీలలో చాలా ఇళ్లు పూర్తి అయ్యి ప్రారంభానికి సిద్ధంగా ఉన్నాయి. పైగా వీరిలోనే పొదుపు మహిళలుంటే వారికి.. పావలా వడ్డీకే బ్యాంకులు రుణాలిచ్చేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంది. సాధారణంగా రుణం తీసుకుంటే 8 నుంచి పది శాతం వరకు వడ్డీ పడుతుంది. ఇప్పుడు వడ్డీ భారం కూడా ప్రభుత్వమే చెల్లిస్తోంది.
కాగా, ఇప్పటి వరకు రాష్ట్రంలో 12.77 లక్షల మంది మహిళలకు రూ.4,500 కోట్ల రుణం అందింది. ఇక ఈసారి అర్హులైన 4,07,323 మందికి వడ్డీ రీయింబర్స్‌మెంట్ కింద సుమారు రూ.46.90 కోట్లను.. సీఎం వైఎస్ జగన్ గురువారం క్యాంపు కార్యాలయంలో విడుదల చేశారు. ఇక సీఎం జగన్ ఆధ్వర్యంలో .. ప్రభుత్వం పేద ప్రజలకు ఇళ్ళు కట్టించడం వలన.. ఒక్కొక్క మహిళకు దాదాపు రూ.10 లక్షల పైన ఆస్తి సమకూరనుంది. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా 8.6 లక్షలకు పైగా నిర్మాణాలు పూర్తయ్యాయి. ఈ విషయమై ప్రజలు సంతోషం ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.