Dharani
Dharani
సమసమాజ స్థాపనలో కీలక పాత్ర పోషించేది ఏది అంటే విద్య. అవును చదువుకున్న వాడు ఎక్కడైనా బ్రతగ్గలడు. కానీ ఆ చదివే చదువు నాణ్యమైనదై ఉండాలి. ఒకప్పుడు ప్రభుత్వ పాఠశాలలు అంటే.. పిల్లల బంగారు భవిష్యత్తుకు అనవాలుగా ఉండేవి. మరి నేడు ప్రభుత్వ పాఠశాలల్లో ఎంత దయనీయ పరిస్థితులు ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. గవర్నమెంట్ స్కూల్స్ కుంటుంపడటంతో.. ఇక మరో గత్యంతరం లేక.. అప్పు చేసైనా సరే.. తమ పిల్లలను.. ప్రైవేట్ స్కూల్స్.. అందునా ఇంగ్లీష్ మీడియం పాఠశాలల్లో చదివిస్తున్నారు. పిల్లల చదువు.. సామాన్యులకు తలకు మించిన భారం అయ్యింది.
ఈ పరిస్థితిని మార్చడం కోసం కంకణం కట్టుకున్నారు సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. ఈ క్రమంలో ప్రభుత్వ పాఠశాలల రూపు రేఖలు మార్చడం కోసం నాడు-నేడు, ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం, విద్యార్థులకు ఆర్థిక సాయం అందించడం అమ్మ ఒడి వంటి అనేక కార్యక్రమాలు ప్రారంభించారు సీఎం జగన్. ఆయన తీసుకున్న నిర్ణయాలు ఎంతో మంచి ఫలితాన్ని ఇస్తున్నాయి. అంతర్జాతీయంగా సైతం జగన్ నిర్ణయాలను కొనియాడుతున్నారు. ఈ క్రమంలో తాజాగా ఏపీ ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు మరో ఘనత సాధించారు. ఆ వివరాలు..
ఏపీ ప్రభుత్వ పాఠశాలలకు చెందిన 10 మంది విద్యార్థులు అమెరికా వెళ్లారు. ఐక్యరాజ్య సమితి ఎస్‌జీటీ సదస్సులో పాల్గొనడం కోసం వీరు అమెరికా పయనమయ్యారు. ఈ నెల 16 నుంచి నార్త్ అమెరికాలో జరగనున్న సదస్సులో పాల్గొని.. ఏపీలో అమలు చేస్తోన్న విద్యా సంస్కరణలపై వీరు ప్రసంగించనున్నారు. నాడు-నేడు, అమ్మ ఒడి, ద్విభాష పాఠ్య పుస్తకాల పంపిణీ వంటి అంశాలపై విద్యార్థులు ఎస్‌జీటీ వేదికగా ప్రసంగించనున్నారు. ఈ పర్యటనకు పది మంది విద్యార్థులతో పాటు ఆరుగురు సంబంధిత శాఖ అధికారులు వెళ్లారు.
వీరంతా సుమారు వారం రోజుల పాటు.. అమెరికాలో పర్యటించనున్నారు. వీరు ఐక్యరాజ్య సమితి హెడ్ క్వార్టర్స్, జనరల్ అసెంబ్లీలో.. విద్యా వ్యస్థలో మార్పుల కోసం ఏపీ ప్రభుత్వం తీసుకువచ్చిన సంస్కరణల గురించి ప్రసగించనున్నారు. ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు.. ఇంతటి అరుదైన ఘనత సాధించడం పట్ల జనాలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇదంతా సీఎం జగన్ కృషి వల్లనే సాధ్యం అయ్యింది అంటున్నారు.