వాలంటీర్లకు గుడ్ న్యూస్.. కొత్త కార్యక్రమం నిర్వహించనున్న జగన్ ప్రభుత్వం!

AP Volunteers: ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీసుకొచ్చిన వ్యవస్థల్లో ప్రధానమైనది వాలంటీర్ వ్యవస్థ. ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రజలకు అందించడంలో ఈ వ్యవస్థ ప్రధానమైనది.

AP Volunteers: ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీసుకొచ్చిన వ్యవస్థల్లో ప్రధానమైనది వాలంటీర్ వ్యవస్థ. ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రజలకు అందించడంలో ఈ వ్యవస్థ ప్రధానమైనది.

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీసుకొచ్చిన వ్యవస్థల్లో ప్రధానమైనది వాలంటీర్ వ్యవస్థ. ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రజలకు అందించడంలో ఈ వ్యవస్థ ప్రధానమైనది. జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తరువాత సచివాలయ వ్యవస్థ, వాలంటీర్ వ్యవస్థ తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. ప్రభుత్వ పథకాలు లబ్ధిదారుల ఇంటికి వరకు చేరాలని, అర్హత ఉన్న ఏ ఒక్కరు పథకాలను కోల్పోకూడదన్న ఆలోచనతోనే సీఎం జగన్..వాలంటీర్ వ్యవస్థ తీసుకొచ్చారు. అలాంటి గ్రామ, వార్డు వాలంటీర్ల కోసం ఏపీ ప్రభుత్వం ఓ కొత్త కార్యక్రమాన్ని తీసుకురానుంది. మరి.. ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం..

ఏపీ వాలంటీర్లకు ఏటా కొన్ని పురస్కారాలను ఇస్తున్న సంగతి తెలిసిందే. ఏడాదిలో ఉత్తమ పనితీరు కనబరిచిన వాలంటీర్లకు సేవా వజ్ర, సేవా రత్న, సేవా మిత్ర అవార్డులతో పాటు నగదు పురస్కారాలను అందిస్తోంది. ఇవే కాకుండా తాజాగా వాలంటీర్ల కోసం ఏపీ ప్రభుత్వం మరో కొత్త కార్యక్రమాన్ని తీసుకురానుంది. ఇప్పుడు ఇస్తున్న గౌరవ వేతనాన్ని పెంచి.. ఉద్యోగాలకు భద్రత కల్పించాలని కొందరు వాలంటీర్లు నిరసనలు చేసినట్లు వార్తలు వచ్చాయి. ఇలాంటి నేపథ్యంలోనే జగన్ ప్రభుత్వం ఈ కీలక నిర్ణయం తీసుకుంది. విధుల్లో ఉత్తమ పనితీరు కనబరిచిన వాలంటీర్లకు నగదు బహుమతులు అందించాలని ఏపీ సర్కార్  నిర్ణయించింది.

ఈ క్రమంలోనే వాలంటీర్ల అభినందన కార్యక్రమం-2024 పేరుతో ఉత్తమ సేవలు అందించిన వారిని ఎంపిక చేయనుంది. మండలం, పట్టణ, జోనల్‌, నియోజకవర్గ, జిల్లా స్థాయిలో ఉత్తమ సేవలు అందించిన వాలంటీర్లను ఎంపిక చేసి.. వారిని సన్మానించి నగదు బహుమతులు అందించనున్నారు. ఇలా ఉత్తమ సేవలు అందించిన వాలంటీర్లను ఎంపిక చేయడానికి  ప్రభుత్వం ఒక ప్రణాళికను సిద్దం చేసింది. ఉత్తమ సేవలు అందించిన వాలంటీర్లను ఎంపిక చేసేందుకు జిల్లా స్థాయి కమిటీలను నియమించింది. ఈ కమిటీకి ఛైర్మన్‌గా జిల్లా కలెక్టర్‌ ఉంటారు.

వైఎస్‌ఆర్‌ పెన్షన్‌ కానుక, ఆసరా, చేయూత పథకాల అమలులో మంచి పనితీరు కనబరిచిన వాలంటీర్లను గుర్తిస్తారు. వారిని ఈ ఏడాది సత్కరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. వచ్చే నెల మూడో వారంలో నిర్వహించే కొత్త కార్యక్రమంలో వాలంటీర్లను ప్రభుత్వం సత్కరించనుంది. మండల, పట్టణ, జోనల్‌ స్థాయిలో ఎంపికైన వారికి రూ.15,000, నియోజకవర్గ స్థాయిలో రూ.20,000, జిల్లా స్థాయిలో రూ.25,000 చొప్పున నగదు బహుమతులు పంపిణీ చేయనున్నారు. మరి.. వాలంటీర్ల విషయంలో ఏపీ ప్రభుత్వం తీసుకురానున్న కొత్త కార్యక్రమంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments