Arjun Suravaram
AP DSC: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉపాధ్యాయ పోస్టులకు సంబంధించిన డీఎస్సీకి నోటీపి కేషన్ విడుదల చేసింది. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ దీనికి సంబంధించిన వివరాలను విడుదల చేశారు. పూర్తి వివరాలు..
AP DSC: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉపాధ్యాయ పోస్టులకు సంబంధించిన డీఎస్సీకి నోటీపి కేషన్ విడుదల చేసింది. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ దీనికి సంబంధించిన వివరాలను విడుదల చేశారు. పూర్తి వివరాలు..
Arjun Suravaram
ఆంధ్రప్రదేశ్ డీఎస్సీకి సంబంధించిన షెడ్యూలు ఇటీవలే విడుదలైన సంగతి తెలిసింది. ఈ నేపథ్యంలోనే తాజాగా ఏపీ డీఎస్సీకి సంబంధించిన నోటిఫికేషన్ విడుదల అయ్యింది. 6,100 పోస్టులతో కూడిన నోటిఫికేషన్ ను రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ సోమవారం విడుదల చేశారు. నేటి ఫిబ్రవరి 12 నుంచి ఫిబ్రవరి 21 వరకు ఫీజు చెల్లింపునకు గడువు ఇచ్చారు. ఈ మొత్తం పోస్టుల్లో ఎస్జీటీలు 2,280, స్కూల్ అస్టిస్టెంట్లు 2,299, టీజీటీలు 1,264, పీజీటీలు 215, ప్రిన్సిపల్స్ 42 నోటిఫికేషన్ విడుదలైంది.
నిరుద్యోగ యువతకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఇటీవల డీఎస్సీకి నోటిపికేషన్ కి సంబంధించిన వివరాలను రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ విడుదల చేసిన సంగతి తెలిసింది. మొత్తం 6,100 టీచర్ పోస్టుల భర్తీకీ ఏపీ ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నేపథ్యంలోనే తాజాగా డీఎస్సీ నోటిఫికేషన్, దరఖాస్తు, పరీక్షలకు సంబంధించిన వివరాలను మంత్రి బొత్స వెల్లడించారు. ఇక మంత్రి తెలిపిన వివరాల ప్రకారం.. నేటి నుంచి డీఎస్సీకి దరఖాస్తు చేసుకునే ప్రక్రియ ప్రారంభమవుతుంది. ఫీజు చెల్లింపునకు ఫిబ్రవరి 21 వరకు గడువు ఇచ్చారు.
ఫిబ్రవరి 22 వరకు దరఖాస్తులను స్వీకరించనున్నారు. మార్చి 5వ తేదీ నుంచి హాల్ టికెట్లు డౌన్ లోడ్ చేసుకునే అవకాశం ఉంది. మార్చి 15 నుంచి మార్చి 30వ తేదీ వరకు ఆన్ లైన్ లో డీఎస్సీ పరీక్షలు జరగనున్నాయి. పరీక్షలు రోజూలో రెండు సెషన్లలో జరగనున్నాయి. ఉదయం 9.30 నుంచి 12 వరకు ఒక సెషన్, మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు రెండో సెషన్ నిర్వహించనున్నారు. ఇలానే 2018 సిలబస్ ప్రకారమే డీఎస్సీ పరీక్షలు జరగనున్నాయి. పూర్తి వివరాలను అధికారిక వెబ్ సైట్ లో ఉంచారు.
ఇక ఈ పరీక్షల విషయంలో జనరల్ కేటగిరి అభ్యర్థులకు గరిష్ట వయోపరిమితి 44 ఏళ్లు కాగా.. రిజర్వ్ కేటగిరి అభ్యర్థులకు మరో ఐదేళ్లు పెంచారు. గతంలో డీఎస్సీ షెడ్యూల్లో తెలిపిన వివరాల ప్రకారం..మార్చి 31వ తేదీన ప్రాథమిక కీ విడుదల అవుతుంది. ఏప్రిల్ 1వ తేదీ వరకు కీపై అభ్యంతరాలు స్వీకరణ ఉంటుంది. ఆ వెంటనే ఏప్రిల్ 2వ తేదీన తుది కీ విడుదల చేస్తారు. చివరగా ఏప్రిల్ 7వ తేదీన ఫలితాలు వెల్లడించనున్నారు.