iDreamPost
android-app
ios-app

Adudam Andhra: CSKతో జగన్ సర్కార్ ఒప్పందం.. MI- SRHతో కూడా..!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆడుదాం ఆంధ్రా ఈవెంట్ ని ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోంది. మట్టిలో మాణిక్యాలను వెలికితీయడమే లక్ష్యంగా ఈ ఆడుదాం ఆంధ్రా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆడుదాం ఆంధ్రా ఈవెంట్ ని ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోంది. మట్టిలో మాణిక్యాలను వెలికితీయడమే లక్ష్యంగా ఈ ఆడుదాం ఆంధ్రా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు.

Adudam Andhra: CSKతో జగన్ సర్కార్ ఒప్పందం.. MI- SRHతో కూడా..!

ఏపీ ప్రభుత్వం రాష్ట్ర ప్రజల కోసం ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశ పెట్టిన విషయం తెలిసిందే. ఇప్పుడు లోకల్ టాలెంట్ ని వెలికి తీసేందుకు “ఆడుదాం ఆధ్రా” అనే కార్యక్రమాన్ని ప్రారంభించింది. మట్టిలో మాణిక్యాలను వెలికి తీయడం మాత్రమే కాకుండా.. క్రీడల్లో ఆంధ్రాని టాప్ ప్లేస్ లో నిలబెట్టాలనే లక్ష్యంతో ఈవెంట్ స్టార్ట్ చేశారు. ఇందుకోసం రూ.41.43 కోట్ల విలువైన 5.09 లక్షల కిట్లను కూడా సిద్ధం చేశారు. ఈ ఈవెంట్ మొత్తం 50 రోజులు జరగనుంది. అంతేకాకుడా యువతలో ఉన్న నైపుణ్యాన్ని ప్రోత్సహించే విధంగా ప్రభుత్వం ఒప్పందాలు కూడా చేసుకుంటోంది.

ఏపీ యువతలో ఉన్న టాలెంట్ ని ప్రోత్సహించే విధంగా ఇప్పటి వరకు 9 సంస్థలతో జగన్ సర్కార్ ఒప్పందాలు చేసుకుంది. మరో రెండు సంస్థలతో కూడా ప్రస్తుతం చర్చలు జరుగుతున్నాయి. ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్, ఆంధ్రా వాలీబాల్ అసోసియేషన్, చెన్నై సూపర్ కింగ్స్,  ప్రైమ్ వాలీబాల్, ఏపీ బ్యాడ్మింటన్ అసోసియేషన్, పీవీ సింధు, ఆంధ్రా ఖోఖో అసోసియేషన్, ఆంధ్రా కబడ్డీ అసోసియేషన్, ప్రో కబడ్డీ లీగ్ సంస్థలతో ఒప్పందాలుచేసుకున్నారు. మరోవైపు ముంబయి ఇండియన్స్, సన్ రైజర్స్ హైదరాబాద్ తో కూడా సంప్రదింపులు జరుపుతున్నారు. ఈ సంస్థలతో ఒప్పందాలు చేసుకోవడానికి ముఖ్య కారణం.. వీటితో ఏపీలో టాలెంట్ హంట్ ని నిర్వహించనున్నారు. ఉత్తమ ప్రతిభ కనబరిచిన క్రీడాకారులను వారి వారి క్రీడల్లో ప్రోత్సహించేందుకు తగిన చర్యలు కూడా తీసుకునేందుకు అవకాశం ఉంది.

అలాగే గ్రామాలు, విద్యాసంస్థలకే పరిమితమైన టాలెంట్ ని అందరికీ పరిచయం చేసేందుకు కూడా ఉపయుక్తంగా ఉంటుంది. ఇంక ఆడుదాం ఆంధ్రా ఈవెంట్ 50 రోజులు జరగనుంది. ఇప్పటికే గ్రామ, వార్డు సచివాలయ్యాల్లో రిజిస్ట్రేషన్ ప్రక్రియ కూడా కొనసాగుతోంది. ఈ ఆడుదాం ఆంధ్రా టోర్నమెంట్ లో పాల్గొనేందుకు 15 ఏళ్లు, అంతకన్నా ఎక్కువ వయసున్న వాళ్లు అర్హులు. ఖోఖో, బ్యాడ్మింటన్, క్రికెట్, కబడ్డీ క్రీడల్లో పోటీలు నిర్వహిస్తారు. మొత్తం 5 దశల్లో ఈ క్రీడలను నిర్వహిస్తారు. పంచాయతీ, మండలం, నియోజకవర్గం, జిల్లా, రాష్ట్రస్థాయిలో ఈ పోటీలు ఉంటాయి. ప్రధాన క్రీడలు మాత్రమే కాకుండా.. మారథాన్, టెన్నికాయిట్, యోగా వంటి క్రీడలను కూడా ఈ ఆడుదాం ఆంధ్రా ఈవెంట్ లో నిర్వహిస్తారు. ఇప్పటికే ఈ కార్యక్రమం ఒక క్రీడా సంబురం అంటూ రాష్ట్ర ప్రజలు కొనియాడుతున్నారు. మొత్తం రూ.100 కోట్లతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని.. ప్రైజ్ మనీ కింద రూ.12 కోట్లు అందిస్తామని ఇప్పటికే మంత్రి రోజా తెలియజేశారు. ఏపీని ఆటల ఆంధ్రప్రదేశ్ గా తీర్చిదిద్దడమే ముఖ్యమంత్రి జగన్ లక్ష్యమని ఈ సందర్భంగా పునరుద్ఘాటించారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి