Dharani
AP Academic Calendar 2024-25-82 Holidays: విద్యార్థులకు పండగలాంటి వార్త చెప్పింది ప్రభుత్వం. ఏకంగా 82 రోజులు సెలవులు ఇవ్వనున్నట్లు తెలిపింది. ఆ వివరాలు..
AP Academic Calendar 2024-25-82 Holidays: విద్యార్థులకు పండగలాంటి వార్త చెప్పింది ప్రభుత్వం. ఏకంగా 82 రోజులు సెలవులు ఇవ్వనున్నట్లు తెలిపింది. ఆ వివరాలు..
Dharani
వేసివ సెలవులు ముగిసి.. పాఠశాలలు ప్రారంభం అయ్యాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లో జూన్ 12 నుంచి పాఠశాలలు మొదలయ్యాయి. అయితే ఉత్తరాదిలో హీట్ వేవ్ కారణంగా జూన్ నెల చివరి వరకు పాఠశాలలు ప్రారంభం కాలేదు. జూలై 1 నుంచి స్కూల్స్ తెరిచారు. ఇక పాఠశాలలు ప్రారంభం అయిన దగ్గర నుంచి విద్యార్థులు సెలవులు కోసం ఆత్రుతగా ఎదురు చూస్తుంటారు. ఇప్పటికే దేశ వ్యాప్తంగా జోరు వానలు కురుస్తున్న నేపథ్యంలో.. పలు రాష్ట్రాల్లో పాఠశాలలకు సెలవులు ఇస్తున్నారు. ఇక రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా గత వారం భారీ వర్షాల కారణంగా స్కూల్స్‌కి సెలవులు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా ప్రభుత్వం సంచలన ప్రకటన చేసింది. విద్యార్థులకు 82 రోజులు సెలవులు ఉండనున్నట్లు ప్రకటించింది. ఆ వివరాలు..
సాధారణంగా పాఠశాలలు ప్రారంభం కాగానే.. అకాడమిక్ క్యాలెండర్ విడుదల చేస్తారు. దీని ద్వారా ఆ ఏడాదిలో ఏ రోజు సెలవు ఉందనుంది.. ఏ పండగలకు ఎన్ని రోజులు సెలవులు ఇవ్వబోతున్నారో ముందుగానే తెలుస్తుంది. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్ విద్యార్థుల కోసం అకాడమిక్ క్యాలెండర్ రిలీజ్ చేశారు. దీనిలో భాగంగా 2024-25 విద్యాసంవత్సరానికి సంబంధించి ఎన్ని రోజులు పాఠశాలలు నడుస్తాయి.. ఎన్ని రోజులు సెలవులు రానున్నాయి అనే వివరాలు వెల్లడించారు. ఇక తాజాగా విడుదల చేసిన ఈ అకాడమిక్ క్యాలెండర్ ప్రకారం.. 2024-25 విద్యాసంవత్సరంలో ఏపీలోని స్కూళ్లు 233 రోజులు పని చేస్తాయని.. 82 రోజులు సెలవులు ఉంటాయని విద్యాశాఖ తెలిపింది.
ఈ మేరకు అకడమిక్ క్యాలెండర్ రూపొందించింది. దసరా సెలవులు అక్టోబర్ 4 నుంచి 13 వరకు, క్రిస్మస్ సెలవులు డిసెంబర్ 20 నుంచి 29 వరకు, సంక్రాంతి సెలవులు జనవరి 11 నుంచి 19 వరకు ఉంటాయని పేర్కొంది. వీటితో పాటు మిగతా పండగలకు సంబంధించిన సెలవులు, జాతీయ సెలవుదినాలు, వేసవి సెలవులపై కూడా ప్రకటన చేశారు.
ఇక ఇదిలా ఉంటే.. భారీ వర్షాల కారణంగా.. జూలై నెలలో రెండు తెలుగు రాష్ట్రాల్లో విద్యార్థులకు ఇప్పటికే అనేక సార్లు సెలవులు ప్రకటించారు. రానున్న 3 రోజుల పాటు కుండపోత వాన కురుస్తుందని.. వాతావరణ శాఖ వెల్లడించింది. భారీ వర్షాలు కురిస్తే.. ఈ మూడు రోజుల్లో సెలవులు ఉండే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మరి ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.