iDreamPost
android-app
ios-app

రూ.10కే పవర్ బ్యాంక్.. ITI చేసిన యువకుడి అద్భుత ఆవిష్కరణలు..

ఐటీఐ పూర్తి చేసిన యువకుడు అద్బుతమైన ఆవిష్కరణలతో అదరగొడుతున్నాడు. సెల్ ఫోన్ ఛార్జింగ్ సమస్యలకు పరిష్కారం చూపుతూ కేవలం 10 రూపాయల ఖర్చుతో పవర్ బ్యాంక్ ను రూపొందించి ఔరా అనిపిస్తున్నాడు.

ఐటీఐ పూర్తి చేసిన యువకుడు అద్బుతమైన ఆవిష్కరణలతో అదరగొడుతున్నాడు. సెల్ ఫోన్ ఛార్జింగ్ సమస్యలకు పరిష్కారం చూపుతూ కేవలం 10 రూపాయల ఖర్చుతో పవర్ బ్యాంక్ ను రూపొందించి ఔరా అనిపిస్తున్నాడు.

రూ.10కే పవర్ బ్యాంక్.. ITI చేసిన యువకుడి అద్భుత ఆవిష్కరణలు..

నాలెడ్జ్ ఒకరి సొంతం కాదని నిరూపిస్తుంది నేటి యువత. వినూత్నమైన ఆలోచనలతో టెక్నాలజీని కొత్త పుంతలు తొక్కిస్తున్నారు. వైవిధ్యమైన ఆవిష్కరణలకు ఉన్నత చదువులు అక్కర్లేదని నిరూపిస్తున్నారు. తమ ప్రతిభతో సొంతంగా స్టార్టప్ లను స్థాపించి లక్షాధికారులుగా, కోటీశ్వరులుగా మారుతున్నారు. ఇదే విధంగా ఓ యువకుడు మానవాళికి ఉపయోగ పడే ప్రాజెక్టులను రూపొందిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నాడు. టెక్నాలజీపై ఉన్న ఆసక్తితో వినూత్నమైన ఆవిష్కరణలకు జీవం పోస్తూ ఔరా అనిపిస్తున్నాడు. ఐటీఐ మాత్రమే చదువుకున్న ఆ యువకుడు ఏకంగా రూ. 10 ఖర్చుతో సెల్ ఫోన్ పవర్ బ్యాంక్ ను రూపొందించి సరికొత్త రికార్డు క్రియేట్ చేశాడు.

ప్రస్తుత సమాజంలో ఉద్యోగాలకు పోటీ ఏ రేంజ్ లో ఉందో వేరే చెప్పక్కర్లేదు. దీన్ని ముందుగానే పసిగట్టిన ఆ యువకుడు ఐటీఐలో చేరితే త్వరగా ఉద్యోగావకాశాలు వస్తాయని భావించి ఐటీఐ విద్యను పూర్తి చేశాడు. సమాజానికి ఉపయోగ పడే ఆవిష్కరణలు చేస్తూ అద్భుతాలు సృష్టిస్తున్నాడు ఈ యువకుడు. ఆ యువకుడు మరెవరో కాదు ఉదయాని అనంతకుమార్. ఇతను పార్వతీపురంమన్యం జిల్లా పాలమిట్టలో జన్మించాడు. తల్లిదండ్రులు పార్వతీ, ఘనపతి వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్నారు. ఉదయాని తనకున్న అసాధారణ ప్రతిభతో 10 రూపాయల ఖర్చుతో సెల్ ఫోన్ ఛార్జింగ్ సమస్యలకు చెక్ పెట్టేలా పవర్ బ్యాంక్ ను రూపొందించాడు. అదే విధంగా రూ. 50 ఖర్చుతో సెలైన్ అలర్టర్ ను తయారు చేసినట్లు వెల్లడించాడు.

బయటికి ఎక్కడికైనా వెళ్లినప్పుడు ఫోన్ లో ఛార్జింగ్ అయిపోతే ఇబ్బంది పడాల్సి వస్తుంది. అందుకోసం చాలా మంది పవర్ బ్యాంకులను క్యారీ చేస్తుంటారు. ప్రస్తుతం మార్కెట్ లో ఉన్న పవర్ బ్యాంకుల ఖరీదు వేలల్లో ఉంటుంది. కానీ ఉదయాని హెచ్ ఐ డబ్య్లూ బ్యాటరీ ప్రైమరీ సెల్స్ తో పవర్ బ్యాంక్ తయారు చేశాడు. ఈ బ్యాటరీతోనే 7 రోజులు సెల్ ఫోన్ కు ఛార్జ్ చేసుకోవచ్చని తెలిపాడు. అదేవిధంగా ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రుల్లో రోగులకు, వైద్య సిబ్బందికి ఉపయోగకరంగా ఉండేలా సెలైన్ అలర్టర్ ను రూపొందించాడు. పేషెంట్ కు సెలైన్ ఎక్కిస్తున్నప్పుడు.. అది అయిపోయే సమయంలో ఎవరూ చూడకపోతే బ్లడ్ బయటికొస్తుంది.

దీంతో రోగి ప్రాణాలకు ప్రమాదం వాటిల్లే అవకాశం ఉంటుంది. దీనికి చెక్ పెట్టేలా బాటిల్ అయిపోయే 10 సెకన్ల ముందు సెలైన్ అలర్ట్ బీప్ శబ్ధంతో అలర్ట్ చేసేలా డివైజ్ ను రూపొందించాడు ఉదయాని. కేవలం రూ. 50 ఖర్చుతోనే ఈ డివైజ్ ను తయారు చేసినట్లు తెలిపాడు. అదే విధంగా అంటువ్యాధులను అరికట్టేందకు సానిటేషన్ పరికరాన్ని, మహిళల రక్షణ కోసం, రైతులకు వ్యవసాయంలో ఉపయోగ పడేలా యంత్ర పరికరాలను రూపొందిస్తూ అద్భుతాలను సృష్టిస్తున్నాడు. తనకు ప్రభుత్వం, టెక్ కంపెనీలు మద్దుతు ఇస్తే మరిని ఆవిష్కరణలు చేస్తానని ఉదయాని వెల్లడిస్తున్నాడు.