Krishna Kowshik
డైరెక్టర్ ఆర్జీవీ గురించి తెలియని వారుండరు. ఏం అంశంపైనేనా స్పందించేస్తుంటారు. మందు, మగువ అంటూ రచ్చ చేస్తుంటారు. నేను, నా ఇష్టం అంటూ నచ్చినట్లు బ్రతికేస్తుంటారు. ఎవ్వరూ ఏమనుకున్నా ఐ డోంట్ కేర్ అంటూ తన దైన స్టెల్లో జీవిస్తుంటారు. అయితే కొన్ని రోజులుగా ఆయన రాజకీయాలపై మాట్లాడుతూ..
డైరెక్టర్ ఆర్జీవీ గురించి తెలియని వారుండరు. ఏం అంశంపైనేనా స్పందించేస్తుంటారు. మందు, మగువ అంటూ రచ్చ చేస్తుంటారు. నేను, నా ఇష్టం అంటూ నచ్చినట్లు బ్రతికేస్తుంటారు. ఎవ్వరూ ఏమనుకున్నా ఐ డోంట్ కేర్ అంటూ తన దైన స్టెల్లో జీవిస్తుంటారు. అయితే కొన్ని రోజులుగా ఆయన రాజకీయాలపై మాట్లాడుతూ..
Krishna Kowshik
వివాదాస్పద దర్శకుడిగా ముద్ర పడ్డారు రామ్ గోపాల్ వర్మ అలియాస్ ఆర్జీవీ. అమ్మాయిలతో పార్టీలు, బోల్డ్ ఇంటర్వ్యూలు చేస్తే ఎప్పుడూ ట్రెండింగ్‌లోనే ఉంటారు. ఆయనను చూస్తుంటే.. ఈ భూమి మీద తనకు నచ్చినట్లే బతికే ఏకైక జీవి ఉందంటే బహుశా ఆర్జీవీనే అనిపించకమానదు. ఇప్పుడు ఆయన చూపు రాజకీయాలపై పడినట్లు కనిపిస్తుంది. కొన్ని రోజులుగా రాజకీయ పరమైన ట్వీట్లు చేస్తూ రచ్చ చేస్తున్నారు. ముఖ్యంగా ఏపీ రాజకీయాల గురించి. ప్రస్తుతం ఆర్జీవీ పొలిటికల్ డ్రామా సినిమాలు కూడా చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల నేపథ్యంలో వ్యూహం, శపథం వంటి సినిమాలు చేస్తున్నారు. వ్యూహం వచ్చే నెల 10వ తేదీన విడుదల కాబోతుంది. ఇప్పటికే ఈ సినిమా ట్రైలర్ ఆకట్టుకుంటోంది.
ఇదిలా ఉంటే ఇప్పుడు ఆయన చేసిన ఓ ట్వీట్ మరో చర్చకు దారి తీసింది. అదే రాజమండ్రి సెంట్రల్ జైలు బయట నుండి సెల్ఫీ తీసుకోవడం. సెల్ఫీ తీసుకుంటే ఆర్జీవీ ఎందుకు అవుతాడు. వెంటనే ‘నేను బయట.. ఆయన లోపల‘ అంటూ నారా చంద్రబాబు నాయుడిని ఉద్దేశించి ఆర్జీవీ ట్వీట్ చేశారు. ఈ పోస్టు కాస్త వైరల్ అయ్యింది. స్కిల్ డెవలప్ మెంట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టైన.. సుమారు 46 రోజుల నుండి రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్న సంగతి విదితమే. సెప్టెంబర్ 10న విజయవాడలోని ఏసీబీ కోర్టు చంద్రబాబుకు జ్యుడిషియల్ రిమాండ్ విధించింది. ఈ కేసుతో పాటు పలు కేసుల్లో నిందితుడిగా ఉన్నారు చంద్రబాబు. ఆనాటి నుండి ఈనాటి వరకు ఆయన రాజమండ్రి జైలులోనే ఉన్నారు.
అయితే ఇటీవల రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజా సోదరుడు గణేష్ వివాహ వేడుకలకు రాజమండ్రి వచ్చిన ఆర్జీవీ.. రాజమండ్రి సెంట్రల్ జైలు ముందు సెల్ఫీ తీసుకోవడం, దాన్ని పోస్టు చేయడంతో నెట్టింట్లో హల్ చల్ చేస్తుంది. బారికేడ్ల ముందు సెల్ఫీ తీసుకుని.. చంద్రబాబు పేరు ప్రస్తావించకుండా ‘మీ అవుట్ సైట్.. హి ఇన్ సైడ్’ అంటూ పేర్కొన్నారు. చంద్రబాబు అరెస్టు తర్వాత తన దైన స్టైల్లో ఆర్జీవీ ట్విట్టర్ వేదికగా విరుచుకుపడిన సంగతి విదితమే. అంతేకాకుండా ఆయన తరుఫున వాదించిన లాయర్లపై కూడా చురకలు అంటించారు రామ్ గోపాల్ వర్మ. అయితే ఈ పోస్టుపై నెటిజన్లు తమ చేతులకు పని చెప్పారు.
A Selfie with RAJAMUNDRY CENTRAL JAIL ..Me OUTSIDE and He INSIDE pic.twitter.com/iNvPLP8R5R
— Ram Gopal Varma (@RGVzoomin) October 26, 2023