iDreamPost
android-app
ios-app

CM జగన్ పై హీరోయిన్ పూనమ్ కౌర్ ప్రశంసలు!

  • Published Mar 06, 2024 | 2:08 PM Updated Updated Mar 06, 2024 | 2:08 PM

Poonam Kaur, YS Jagan: ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పరిపాలనపై సినీ, రాజకీయ ప్రముఖులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. తాజాగా టాలీవుడ్ నటీ పూనమ్ కౌర్ కూడా సీఎం జగన్, వైసీపీ ప్రభుత్వాన్ని ప్రశంసిస్తూ పోస్టు చేసింది.

Poonam Kaur, YS Jagan: ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పరిపాలనపై సినీ, రాజకీయ ప్రముఖులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. తాజాగా టాలీవుడ్ నటీ పూనమ్ కౌర్ కూడా సీఎం జగన్, వైసీపీ ప్రభుత్వాన్ని ప్రశంసిస్తూ పోస్టు చేసింది.

  • Published Mar 06, 2024 | 2:08 PMUpdated Mar 06, 2024 | 2:08 PM
CM జగన్ పై హీరోయిన్ పూనమ్ కౌర్ ప్రశంసలు!

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పరిపాలన దేశంలోని ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచింది. అంతేకాక  దేశ ప్రధానితో సహా పలు రాష్ట్రాలు సీఎం జగన్ చేపట్టిన పలు కార్యక్రమాలను అమలు చేస్తున్నారు. సీఎం జగన్ అధికారంలోకి వచ్చిన తొలి రోజుల్లో కరోనా విజృభించిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో వైఎస్సార్ సీపీ ప్రభుత్వం ఎంతో అద్భుతంగా  పని చేసింది. ఎప్పటికప్పుడు ఆరోగ్యపరంగా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటా ప్రజల సంక్షేమానికి పాటుపడింది. తాజాగా కరోనా సమయంలో వైసీపీ చేపట్టిన అంశాలను ప్రస్తావిస్తూ నటి పూనమ్ కౌర్ సీఎం జగన్ ను ప్రశసించారు.

టాలీవుడ్ హీరోయిన్ పూనమ్ కౌర్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. అనేక తెలుగు చిత్రాల్లో నటించిన ఆమె మంచి గుర్తింపు పొందారు. తరచూ ఏదో ఒక అంశంతో ఆమె వార్తల్లో నిలుస్తుంటారు. సమాజంలో జరిగే అంశాలపై, సినీ ఇండస్ట్రీలో జరిగే వాటిపై ప్రస్తావిస్తూ సోషల్ మీడియాలో  పోస్టు చేస్తుంటారు. తాజాగా ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని ప్రశంసిస్తూ పూనమ్ కౌర్ ట్వీట్ చేశారు. కొవిడ్ మహామ్మారి విజృభించిన సమంయలో చేనేత కార్మికులకు వైసీపీ అండగా నిలిచిందని, వారి కోసం చాలా మంచి పనులు చేసిందని ఆమె ట్విటర్ లో పోస్టు చేసింది. అలానే చేనేత కార్మికుల సమస్యలపై క్రియాశీలకంగా పనిచేసే కార్యకర్తగా చెబుతున్నా ఇది చాలా గొప్ప విషయమని ఆమె ట్వీట్ చేశారు. ఎన్నికల వేళ పూనమ్ కౌర్ చేసిన ఇలాంటి  పోస్ట్ పెట్టడంతో ప్రాధాన్యత సంతరించుకుంది.

Jojobet GirişJojobetHoliganbetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetjojobetjojobet girişbetcioJojobetJojobetJojobetjojobetgrandpashabet