iDreamPost
android-app
ios-app

పాపి కొండల్లో జల ధార వృక్షం! అచ్చం భైరవ ద్వీపం సినిమా తరహాలో!

ప్రకృతిలో ఎన్నో అందాలు, అద్భుతాలు దాగున్నాయి. తనలో ఎన్నో రహస్యాలను దాచుకుంటుంది నేచర్. అయితే తాజాగా మరో వండర్ అధికారులను ఆశ్చర్యానికి గురి అయ్యేలా చేసింది.

ప్రకృతిలో ఎన్నో అందాలు, అద్భుతాలు దాగున్నాయి. తనలో ఎన్నో రహస్యాలను దాచుకుంటుంది నేచర్. అయితే తాజాగా మరో వండర్ అధికారులను ఆశ్చర్యానికి గురి అయ్యేలా చేసింది.

పాపి కొండల్లో జల ధార వృక్షం! అచ్చం భైరవ ద్వీపం సినిమా తరహాలో!

ప్రకృతి తనలో ఎన్నో వింతలు, విశేషాలను దాచుకుంటూ ఉంటుంది. పరికించి చూడాలే కానీ అద్భుతాల మయం. ఒక్కసారి ప్రకృతిలో మమేకమైతే మనల్ని మనం మరిచిపోయేలా చేస్తుంది. కానీ కాలంతో పరుగులు పెడుతూ.. కాంక్రీట్ జంగిల్‌లో బతికేస్తున్నా మనం ఏదో సంవత్సరానికి, లేదా రెండేళ్లకు ఒకసారి బుద్ది పుట్టి అప్పుడప్పుడు నేచర్ ఒడిలో సేదతీరుతూ ఉంటాం. తనివి తీరా చూడాలే కానీ పచ్చని సౌందర్యం పలకరిస్తూ ఉంటుంది. ఆ సమయంలో టైం కూడా గుర్తుకు రాదు. ప్రతి చెట్టు, పుట్ట మనల్ని వెల్ కమ్ చెబుతున్నాయో అనిపించకమానదు. ఎన్నో వండర్స్‪ను తనలో ఇమిడించుకున్న ప్రకృతి శోయగం ముందు మనం ఇన్నాళ్లు పడ్డ కష్టాన్ని కూడా మర్చిపోతుంటాం. అందుకే పర్యావరణాన్ని ఇష్టపడే ప్రేమికులు.. నెలకు ఒకసారి అయినా నేచర్‌లో గడపాలని భావిస్తుంటారు.

మన ఆంధ్రప్రదేశ్‌లో కూడా పలు ప్రాంతాల్లో పచ్చదనం ప్రకృతి ప్రేమికులను అలరిస్తూ ఉంటుంది. ఇక అందులో ఉన్న ప్రతి మాను, మాకు మనతో మాట్లాడుతుంది. అంతేనా అందులో కూడా అద్భుతాలు ఉంటున్నాయి. దేశంలో ఎక్కడా దొరకని రెడ్ వుడ్ అంటే ఎర్ర చందనం కేవలం నల్లమల్ల అడవుల్లో మాత్రమే లభిస్తుంది. ప్రకృతి మనం ఏం ఇస్తామో.. అది తిరిగి ఇస్తుందంటారు పెద్దలు. కానీ దానితో స్నేహం చేస్తే మాత్రం.. తనలో దాగి ఉన్న ఎన్నో రహస్యాలను మన కళ్ల ముందు ఉంచుతుంది. అలాంటిదే ఇది కూడా. ఓ అరుదైన జల ధార వృక్షం ఇప్పుడు అటవీ అధికారులను ఆశ్చర్యానికి గురి చేయడమే కాకుండా.. కనువిప్పు కలిగించింది. చెట్టు నరుకుతుంటే.. వల వలా  నీటి ధార చిమ్ముతుంది.

ఈ అద్భుతం మరెక్కడో కాదు పాపి కొండల్లో. పాపి కొండల జాతీయ కింటుకూరు అటవీ ప్రాంతంలోని బేస్ క్యాంపు పరిశీలను వచ్చారు అటవీ అధికారులు. అక్కడ వారికి ఓ చెట్లు వింతగా కనిపించింది. అది ఎండినట్లు కనిపించడంతో అటవీ అధికారులు దానిని గొడ్డలిలో ఓ వేటు వేయగా..  ఒక్కసారిగా నీటి ధార బయటకు చిమ్మింది. ఈ ధారను చూసి ఔరా అని తిలకించారు ఆఫీసర్స్. కొన్ని నిమిషాల పాటు ఆగకుండా నీరు కారుతూనే ఉంది. ఇంతకు అదేమీ చెట్టు అంటే.. నల్ల మద్దిచెట్టు.  దీని నుండి సుమారు 20 లీటర్ల నీరు వచ్చిందని చెబుతున్నారు అధికారులు. దీన్ని చూస్తుంటే.. భైరవ ద్వీపం సినిమాలో బాలకృష్ణ ఓ చెట్టును నరికితే నీరు వస్తుంది కదా.. ఆ సీన్ గుర్తుకు రావడం ఖాయం. మీరేమంటారు..?