iDreamPost
android-app
ios-app

బిడ్డ కోసం.. జోరు వానలో తల్లి న్యాయ పోరాటం

భర్త ఆమెను నానారకాలుగా హింసపెడుతుంటే.. అతడ్ని వద్దనుకుని బయటకు వచ్చేసిందో ఇల్లాలు. ఆమె తన తల్లిదండ్రుల వద్ద జీవిస్తున్నా సహించలేకపోయాడు భర్త. భార్య వద్దకు వెళ్లి చిత్రవధ చేశాడు. చివరకు బిడ్డను కూడా..

భర్త ఆమెను నానారకాలుగా హింసపెడుతుంటే.. అతడ్ని వద్దనుకుని బయటకు వచ్చేసిందో ఇల్లాలు. ఆమె తన తల్లిదండ్రుల వద్ద జీవిస్తున్నా సహించలేకపోయాడు భర్త. భార్య వద్దకు వెళ్లి చిత్రవధ చేశాడు. చివరకు బిడ్డను కూడా..

బిడ్డ కోసం.. జోరు వానలో తల్లి న్యాయ పోరాటం

భర్తతో నిత్యం గొడవలు జరుగతుంటే పుట్టింటికి వచ్చేసింది ఓ ఇల్లాలు. తన బతుకు తాను బతుకుతుంటే ఆమెను విడిచి పెట్టలేదు భర్త. భార్యను అవమానిచడం, అనుమానించడమే కాకుండా ఆమెను నానా రకాలుగా హింసించి, దాడి చేసి బిడ్డను ఎత్తుకెళ్లిపోయాడు. మానసికంగా కుంగిపోయిన మహిళ.. తన బిడ్డ కోసం న్యాయ పోరాటానికి దిగింది. జోరున కురుస్తున్న వానలో వివేకానంద విగ్రహం వద్ద నిరసన వ్యక్తం చేసింది. పోలీసులు, చట్టాలు, కోర్టులు తనకు ఏం న్యాయం చేయలేకపోతున్నాయని కన్నీటి పర్యంతం అయ్యింది. ఈ ఘటన ఆంధ్రప్రదేశ్ శ్రీకాకుళం జిల్లాలో చోటుచేసుకుంది. తన బిడ్డ తనకు కావాలంటూ కోరుతుంది. పలాస ఆర్టీసీ కాంప్లెక్స్ సమీపంలో గల వివేకానంద విగ్రహం వద్ద ఓ మహిళ న్యాయ పోరాటం చేసింది.

వజ్రపుకొత్తూరు మండలం సుంకర జగన్నాధపురం గ్రామానికి చెందిన నెయ్యిల లోకేశ్ అనే వ్యక్తితో అరుణకు వివాహం జరిగింది. వీరికి 4 ఏళ్ల కుమారుడు ఉన్నాడు. అయితే నిత్యం గొడవలు పుడుతుంటే.. భర్తను వదిలేసి పుట్టింటికి వచ్చింది. తన బిడ్డతో జీవిస్తుంది. కానీ భర్త ఆమెను తిట్టి, కొట్టి కుమారుడ్ని తీసుకెళ్లడంతో జోరు వానలో నిరసనకు దిగింది. వర్షాన్ని సహితం లెక్కచేయక తడుస్తూ వివేకానంద విగ్రహం వద్ద న్యాయపోరాటానికి దిగింది. ఆమె చెప్పిన మాటల్లో.. ‘నా భర్తతో తగాదాలు జరిగాయి. దీంతో నేను మా తల్లిదండ్రుల వద్దకు వచ్చేశాను. భర్త వేధింపులు తట్టుకోలేక పాయిజన్ తాగేశా. ఆ సమయంలో నా బిడ్డను తీసుకెళ్లిపోయాడు నా భర్త లోకేశ్. ఎస్పీ ఆఫీసుకు తిరిగి. నా బిడ్డను నా దగ్గరకు తెచ్చుకున్నా’ అని తెలిపింది.

‘ నా బిడ్డను తెచ్చుకున్న నాలుగు నెలల తర్వాత బాబును తీసుకెళతానని నాపై దాడి చేశాడు. నా బిడ్డ నుండి నన్ను ఎక్కడ దూరం చేస్తారోనని విశాఖ పట్నంలో ఉన్న మా పిన్ని ఇంటికి వెళ్లిపోయాను. దీంతో ఎన్నో రూమర్స్ సృష్టించాడు. ఎవరితోనే తనకు అక్రమ సంబంధం అంటగట్టాడు. నాకు మెయిన్ టెన్స్ ఇవ్వాలంటూ కోర్టును ఆశ్రయించాను. కానీ ఎటువంటి రెస్పాండ్ లేదు. చివరకు అతడు నన్ను దారుణంగా కొట్టి బిడ్డను ఎత్తుకెళ్లిపోయాడు. పోలీసులకు ఫిర్యాదు చేసినా ఉపయోగం ఉండటం లేదు. అందుకే ఇలా నిరసనకు దిగాను. నా బిడ్డ నాకు కావాలి’ అంటూ పేర్కొంది. పలాస ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో వివేకానంద విగ్రహం వద్ద వర్షంలో నిరసన వ్యక్తం చేస్తోంది. తన బిడ్డ తనకు దక్కేవరకు ఇక్కడ్నించి కదిలేదే లేదని చెపుతోంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి