Arjun Suravaram
చాలా మంది తమ కుల వృత్తులను, వంశపారం పర్యంగా వస్తున్న పనులను చేయడానికి వెనుకడుగు వేస్తుంటారు. కానీ.. తమ వృత్తి అంచరించిపోకుండా ఉండేందు..పెద్దల సంప్రదాయాలను కొనసాగిస్తూ.. కొందరు యువత ముందుకు వెళ్తుంటారు. ఆ విధంగానే ఓ జవాన్ హరిదాసుగా మారారు
చాలా మంది తమ కుల వృత్తులను, వంశపారం పర్యంగా వస్తున్న పనులను చేయడానికి వెనుకడుగు వేస్తుంటారు. కానీ.. తమ వృత్తి అంచరించిపోకుండా ఉండేందు..పెద్దల సంప్రదాయాలను కొనసాగిస్తూ.. కొందరు యువత ముందుకు వెళ్తుంటారు. ఆ విధంగానే ఓ జవాన్ హరిదాసుగా మారారు
Arjun Suravaram
హిందువుల సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక సంక్రాంతి పండగ. ఇక ఈ పర్వదినం వేళ పల్లెల్లో ఉండే సందడి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆ పచ్చని పల్లెల్లో సంక్రాంతి పండగను ఎంతో ఘనంగా జరుపుకుంటారు. ఇక ఈపండగ అంటే ఠక్కున గుర్తుకు వచ్చేది.. భోగి మంటలు, గొబ్బెమలు, హరిదాసు కీర్తనలు. ముఖ్యంగా సంక్రాంతి పండగ రోజు హరిదాసు కీర్తలను కచ్చితంగా వినిపించాల్సిందే. అయితే నేటికాలంలో హరిదాసు వృత్తి అనేది చాలా వరకు తగ్గిపోయింది. కొందరు మాత్రం ఏ స్థాయిలో ఉన్న.. తమ కుటుంబం ఆచారిస్తున్న ఈ వృత్తిని కొనసాగిస్తున్నారు. అలానే దేశాన్ని రక్షిస్తున్న ఓ సైనికుడు హరిదాసుగా మారాడు.
హరిదాసు అంటే ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సంక్రాంతి పండగ వేళ ఉదయమే అక్షయ పాత్ర తలపై ఉంచి ఒక చేత్తో తంబుర, మరో చేత్తో చిడతలు వాయిస్తూ హరిలో రంగ హరి అంటూ హరి నామస్మరణ చేస్తుంటారు హరిదాసులు. అలానే తన వంశపారం పర్యంగా వస్తున్న ఈ వృత్తిని స్వీకరించిన మూడోతరం హరిదాసు బెజవాడ సతీష్. అతడి స్వగ్రామం భద్రాచలం సమీపంలోని రామనగరం. అతడు ఆర్మీకి ఎంపికై.. దేశ సరిహద్దుల్లో విధులు నిర్వహిస్తున్నాడు. సంక్రాంతి పండగ సందర్భంగా సెలవుపై వచ్చి మండలంలోని చీపురుగూడెం, పోతవరం, కవులూరు తదితర గ్రామాలలో హరిదాసుగా తిరుగుతుంటారు. ఏటా మాదిరిగానే.. ఈసారికూడా హరిదాసుగా మారేందుకు.. ఈ జవాన్ సిద్ధమైనట్లు తెలుస్తోంది.
బెజవాడ సతీష్.. తాత చిన్ని కృష్ణ తర్వాత తండ్రి నరసింహరావు కొన్నేళ్ల పాటు ఈ వృతిలో ఉన్నారు. వారే చుట్టూ పక్కల గ్రామాల్లో హరిదాసుగా హరినామస్మరణ చేస్తూ జీవనం సాగించారు. ఇక వారిద్దరి తరువాత సతీష్ ఈ వృత్తిలోకి వచ్చారు. ఎంత చదువు చదివినా, ఏ ఉద్యోగం చేస్తున్నా వంశపారం పర్యంగా వచ్చే ఈ వృత్తి వీడలేదు సతీష్. పండగ పూట ఉదయాన్నే 3గంటలకే నిద్రలేచి స్నానం చేసి.. పూజాకార్యక్రమాలు ముగిస్తారు. అనంతరం హరినామ సంకీర్తనలు పాడుతూ ప్రతి గ్రామంలో తిరుగుతుంటారు. దాదాపు 10గ్రామాలు తిరిగాక శిరస్సుపై ఉంచిన కలశాన్ని దించి తిరిగి స్నానం చేస్తారు. అనంతరం మాత్రమే భోజనం చేస్తారు.. అప్పటి వరకు ఎలాంటి ఆహారాన్ని భుజించరు.
తాను ఈ వృత్తిని కొనసాగించడంపై సతీష్ కూడా అనేక విషయాలు తెలిపారు. మారుతున్న కాలం ప్రకారం.. చాలా మంది హరిదాలు మోపెడ్‌లపై తిరుగుతూ హరినామ సంకీర్తనలు సైతం రికార్డు చేసి లౌడ్ స్పీకర్లలో వినిపిస్తూ ఉన్నారు. సతీష్ మాత్రం పూర్వ కాలం ప్రకారమే కాలినడకనే హరినామ సంకీర్తన చేస్తూ తిరుగుతూ కనిపిస్తారు. ఇదేమిటని అడిగే తమ తండ్రి ఈ విధంగానే తిరగాలని చెప్పారని వివరించారు. తాత,తండ్రిల నుంచి వచ్చిన తంబుర, చిడతలు, కలశంనే సతీష్ వినియోగిస్తున్నారు. మరి..వంశపారపర్యంగా వచ్చిన వృత్తిని కొనసాగించేందుకు హరిదాసుగా మారిని ఈ జవాన్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.