iDreamPost
android-app
ios-app

మంత్రాలయానికి హెలికాఫ్టర్ విరాళంగా ఇవ్వనున్న భక్తుడు..!

ఎన్నో సంవత్సరాల చరిత్ర కలిగిన దేవాలయాల్లో మంత్రాలయం కూడా ఒకటి. శ్రీ గురు రాఘవేంద్ర స్వామి మంత్రాలయంలో జీవసమాధి అయ్యారని అంటుంటారు. ఆంధ్రప్రదేశ్ నుండే కాకుండా మహారాష్ట్ర, తమిళనాడు, కర్ణాటక నుండి భక్తులు వస్తుంటారు.

ఎన్నో సంవత్సరాల చరిత్ర కలిగిన దేవాలయాల్లో మంత్రాలయం కూడా ఒకటి. శ్రీ గురు రాఘవేంద్ర స్వామి మంత్రాలయంలో జీవసమాధి అయ్యారని అంటుంటారు. ఆంధ్రప్రదేశ్ నుండే కాకుండా మహారాష్ట్ర, తమిళనాడు, కర్ణాటక నుండి భక్తులు వస్తుంటారు.

మంత్రాలయానికి హెలికాఫ్టర్ విరాళంగా ఇవ్వనున్న భక్తుడు..!

దక్షిణ భారతదేశంలోని ఆధ్యాత్మిక ప్రాంతాల్లో ఒకటి ఆంద్రప్రదేశ్‌లోని కర్నూల్ జిల్లాలో ఉన్న ‘మంత్రాలయం’. తుంగ భద్ర నదీ తీరాన నెలవై ఉన్న ఈ దేవాలయంలో శ్రీ గురు రాఘవేంద్ర స్వామిని కొలుస్తారు భక్తులు. హిందూ సంప్రదాయంలో రాఘవేంద్ర స్వామికి ప్రత్యేక ప్రాధాన్యత ఉంది. శ్రీ గురు రాఘవేంద్ర స్వామి మంత్రాలయంలో జీవసమాధి అయ్యారని అంటుంటారు. ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర ఇలా అనేక ప్రాంతాల నుంచి మంత్రాలయాన్ని దర్శించుకోవడానికి తరలి వస్తుంటారు పర్యాటకులు. సాధారణంగా భక్తులు తమకు తోచిన వాటిని స్వామివారికి విరాళాలుగా అర్పిస్తూ ఉంటారు. ఈ క్రమంలో తాజాగా కర్ణాటకకు చెందిన ఓ భక్తుడు శ్రీ రాఘవేంద్ర స్వామి మఠానికి హెలికాప్టర్ ను విరాళంగా ఇవ్వనున్నట్టు వెల్లడించారు. వివరాల్లోకి వెళ్తే..

రాంనగర్‌కు చెందిన శ్రీ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు సురేశ్.. పీఠాధిపతి సుబుదేంద్ర తీర్థులకు హెలికాప్టర్‌ను విరాళంగా ఇవ్వనున్నట్లు తెలిపారు. ఈ విషయంపైన నవంబర్ 24న పీఠాధిపతులతో చర్చించినట్టు ఆయన పేర్కొన్నారు. ఇక పీఠాధిపతుల అనుమతితో మంత్రాలయంలో మఠం అధికారులు నిర్దేశించిన ప్రదేశంలో.. హెలిప్యాడ్ నిర్మాణ పనులు కూడా ప్రారంభిస్తామని చెప్పారు. హెలిప్యాడ్‌ పనులు పూర్తయితే సంక్రాంతి పండగకు హెలికాప్టర్‌ను మంత్రాలయ పీఠాధిపతికి అందజేసే ప్రయత్నాలు చేస్తున్నామని తెలిపారు. అంతేకాకుండా.. బెంగళూరు నగరానికి 50 కిలోమీటర్ల దూరంలో దాదాపు రూ.300 కోట్ల వ్యయంతో 253 అడుగుల ఎత్తులో రాఘవేంద్రస్వామి విగ్రహాన్ని నిర్మిస్తున్నట్టు ఆయన చెప్పారు.

అలాగే, బెంగళూరులో రాఘవేంద్రస్వామి విగ్రహం ప్రతిష్ఠించనున్న స్థలాన్ని సుబుదేంద్ర తీర్థులు డిసెంబర్‌ మొదటి వారంలో పరిశీలించి, భూమి పూజ చేస్తారని సురేశ్ స్పష్టం చేశారు. కాగా, భక్తులు మంత్రాలయానికి చేరుకోవాలంటే నేరుగా రైల్వే మార్గం కూడా లేదు. దాదాపు 13 కిలోమీటర్ల దూరంలోని మాధవరంలో రైలు దిగి.. రాఘవేంద్రస్వామి ఆలయానికి చేరుకోవాల్సి ఉంటుంది. ఇక భక్తుల విరాళాలతో మంత్రాలయంలో మినీ-ఎయిర్‌పోర్ట్ నిర్మాణానికి ప్రయత్నాలు చేపడుతున్నారు. గతంలో ఆలయ అభివృద్ధి కోసం బళ్లారికి చెందిన మైనింగ్ వ్యాపారి రూ.90 లక్షలు ప్రకటించారు. దేశంలోని పలు ప్రాంతాలనుండి భక్తులు మంత్రాలయానికి వస్తుంటారు. యాత్రికులను ఇంతగా ఆకర్షిస్తున్న ఈ దేవాలయం మూడు వందల సంవత్సరాల క్రితం నిర్మించబడింది. మరి ఈ విషయంపైన మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి.