Arjun Suravaram
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి విద్యారంగంలో చేస్తున్న కృషి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. గతంలో దీనస్థితిలో ఉన్న అనేక ప్రభుత్వ కాలేజీలు, స్కూల్ కూడా నేడు దేశంలోనే ఉన్నత స్థితికి చేరాయి.
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి విద్యారంగంలో చేస్తున్న కృషి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. గతంలో దీనస్థితిలో ఉన్న అనేక ప్రభుత్వ కాలేజీలు, స్కూల్ కూడా నేడు దేశంలోనే ఉన్నత స్థితికి చేరాయి.
Arjun Suravaram
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి విద్యారంగంలో తీసుకొచ్చిన సంస్కరణల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. విద్యా, వైద్య రంగాల్లో అనేక పథకాలను తీసుకొచ్చి..తనదైన మార్క్ ను సీఎం జగన్ వేశారు. ముఖ్యంగా విద్యావ్యవస్థలో సీఎం జగన్ తీసుకొచ్చిన పథకల ద్వారా ఏపీ విద్యార్థులు అంతర్జాతీయ స్థాయిలో ప్రశంసలు అందుకుంటున్నారు. ఇలా కేవలం ప్రభుత్వ పాఠశాల విషయంలోనే కాకుండా, ఇంటర్, పాలిటెక్నిక్ కాలేజీల అభివృద్ధి విషయంలోనూ జగన్ ప్రభుత్వం అడుగులు వేస్తుంది. ఏపీ ప్రభుత్వ కృషి కారణంగా నేడు రాష్ట్రంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీలు నేషనల్ బోర్డ్ ఆఫ్ అక్రెడిటేషన్(NBA) గుర్తింపు సాధనలో దూసుకెళ్తున్నాయి.
ప్రస్తుతం రాష్ట్రంలోని పాలిటెక్ని కాలేజులు గతంలో ఎన్నడూ లేనంతగా అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో ఉన్నాయి. అయితే ఇంతలా ఏపీ విద్యావ్యవస్థ దేశ, అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందుతుంటే..ప్రతిపక్ష టీడీపీ కంటగింపుగా ఉంది. అందుకే పొద్దున లేచింది మొదలు సాయంత్రం పడుకునే వరకు టీడీపీ అధ్యక్షడు చంద్రబాబు, ఆ పార్టీ నేతలు ఏపీ విద్యావ్యవస్థపై అనేక అసత్య ఆరోపణలు చేస్తున్నారు. అసలు విద్యవ్యవస్థ, ముఖ్యంగా పాలిటెక్నిక్ కాలేజీ విషయంలో గతంలో చంద్రబాబు ఎంతో దారుణంగా ప్రవర్తించారు. పేద విద్యార్థులకు ఎంతో కీలకమైన పాలిటెక్నిక్ కళాశాలను ఒకటికాదు రెండు కాదు.. ఏకంగా 60 మూతపడటానికి కారణమయ్యారు. నాడు చేసిన చంద్రబాబు పాప నేడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. బాబు హయాంలో పాలిటెక్నిక్ కాలేజిల దుస్థితి, నేడు అవే కాలేజీలు దేశ స్థాయిలో పొందిన ప్రత్యేక గుర్తింపు పొందిన వార్త నెట్టింట తెగ వైరల్ అవుతోంది.
రాష్ట్రంలో ఇంతకు ముందు చాలా ఎక్కువగా అందుబాటులో పాలిటెక్నిక్ కాలేజీలు ఉండేవి. పదో తరగతిలో మంచి మార్కులతో పాసైన పిల్లలు, వెంటనే సాంకేతిక విద్యను అభ్యసించిడానికి పాలిటెక్నిక్ కోర్సులు ఉపయోగకరంగా ఉంటాయనే విషయం తెలిసింది. అలానే ఈ కోర్సు ద్వారా ఎంతో మంది యువత ఉద్యోగం పొందారు. అయితే బాబు హయాంలో ఒకేసారి 60 పాలిటెక్నిక్ కళాశాలలు మూతపడటానికి కారణం అయ్యారు.
నాడు చంద్రబాబు ప్రభుత్వం పాలిటెక్నిక్ కాలేజీలు అభివృద్ధికై విడుదల చేసిన నిధుల్లో అవకతవకలున్నాయని కారణం చూపుతూ మూసివేత దిశగా అడుగులు వేశారు. ఆ సమయంలో వందల కొద్దీ లెక్చర్లు, వేలాదిగా విద్యార్థులు హైదరాబాద్ లో నిరసన తెలియజేశారు. అయినా వారి వేదనను బాబు పట్టించుకోలేదు. ఈ నేపథ్యంలోనే భారీగా ఉపాధ్యాయుల కొరత ఏర్పడి, సుమారు 60 పాలిటెక్నిక్ కాలేజీలు ఒక్కసారిగా మూత పడ్డాయి. దానితో వేలాది మంది విద్యార్థుల భవిష్యత్తు అంధకారంలోకి వెళ్లింది. దాదాపు ఇన్నేళ్ల తరువాత జగన్ ప్రభుత్వంలో పాలిటెక్నిక్ కాలేజీ పూర్వ వైభవాన్ని సంతరించుకోనున్నాయి.
సీఎం జగన్ విద్యారంగంలో తీసుకొచ్చిన అనేక సంస్కరణ కారణంగా పాలిటెక్నిక్ కాలేజీల స్థితి మారింది. నేడు దుర్భమైన స్థితిలో ఉన్న ఈ ప్రభుత్వ కాలేజీలు నేషనల్ బోర్డ్ ఆఫ్ అక్రెడిటేషన్(NBA) గుర్తింపు సాధనలో దూసుకెళ్తున్నాయి. గతంలో ఎన్నడూ లేనంతగా అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో విద్యనందిస్తూ గణనీయమైన ప్లేస్ మెంట్స్ నమోదు చేస్తున్నాయి. తాజాగా మరో 12 ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలకు ఎన్బీఏ సర్టిఫికేషన్ దక్కింది. అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే NBA సర్టిఫికేషన్ ఒకేసారి ఇన్ని కాలేజీలకు దక్కడంపై… వవాటిలో పని చేసే ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
సీఎం జగన్ ఆదేశాలకు అనుగుణంగా విద్యా ప్రమాణాలను పెంపొందిస్తున్నామనీ, అందువల్లే ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీలకు అత్యంత ప్రతిష్టాత్మక ఎనిన్డీఏ సర్టిఫికేషన్ దక్కుతోందనీ విద్యాశాఖ అధికారులు తెలిపారు. ఉద్యోగ అవకాశాలు పెంచేలా 674 పరిశ్రమలతో ఒప్పందాలు చేసుకున్నామనీ, గత అకాడమిక్ ఇయర్ లో 7 వేల మంది చదువులు పూర్తి చేసుకుంటే 4 వేల మందికి పైగా ప్లేస్ మెంట్స్ సాధించారనీ, గతంలో 10 శాతం గా ఉన్న ప్లేస్మెంట్లను 60 శాతానికి తీసుకువచ్చామనీ అధికారులు తెలిపారు. మరి చంద్రబాబు హయాంలో దారుణమైన స్థితిలో ఉన్న కాలేజీలు..నేడు దేశంలోనే అత్యున్నత స్థితిలోకి వెళ్లడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.