SSC Exams: 53 ఏళ్ల వయస్సులో పదో తరగతి పరీక్షలకు హాజరు!

చదువుకోవాలనే తపన ఉండాలే కానీ వయస్సు అనేది అడ్డంకే కాదు. ఇది కేవలం మాటలు కాదు.. నిజమని నిరూపించిన వారు ఎందరో ఉన్నారు. యాబై పదులు దాటిన వాళ్లు సైతం వివిధ పరీక్షలు రాస్తూ ఔరా అనిపిస్తున్నారు. తాజాగా ఓ పెద్దావిడ కూడా పదో తరగతి పరీక్షలకు హాజరయ్యారు.

చదువుకోవాలనే తపన ఉండాలే కానీ వయస్సు అనేది అడ్డంకే కాదు. ఇది కేవలం మాటలు కాదు.. నిజమని నిరూపించిన వారు ఎందరో ఉన్నారు. యాబై పదులు దాటిన వాళ్లు సైతం వివిధ పరీక్షలు రాస్తూ ఔరా అనిపిస్తున్నారు. తాజాగా ఓ పెద్దావిడ కూడా పదో తరగతి పరీక్షలకు హాజరయ్యారు.

విద్య అనేది మనిషి విలువను, గౌరవాన్ని పెంచుతుంది. అందుకే చాలా మంది బాగా చదువుకుని ఉన్నత స్థితిలో స్థిర పడుతుంటారు. అయితే కొందరు మాత్రం చదువుకోవాలని బలమైన కోరిక, తపన ఉన్నప్పటికీ కుటుంబ పరిస్థితులు, ఇతర కారణాలతో చదువు కోరు. మరికొందరు చదువును మధ్యలోనే ఆపేస్తారు. ముఖ్యంగా మహిళల విషయంలో ఇలాంటి ఘటనలు జరుగుతుంటాయి. అయితే కొందరు మాత్రం చదువుకు వయస్సు అడ్డం కాదని 60 పదుల వయస్సులో కూడా పలు రకాల పరీక్షలకు హాజరై అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తుంటారు. తాజాగా విజయనగరం జిల్లాకు చెందిన ఓ పెద్దామ చదువుపై తనకు ఆసక్తిని చూపించింది. ఆమెను చూసిన స్థానికులు నువ్వు గ్రేట్ తల్లి అంటూ అభినందిస్తున్నారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే..

ప్రస్తుతం  రెండు తెలుగు రాష్ట్రాల్లో  పదో తరగతి పరీక్షలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే రెండు ఎగ్జామ్స్ పూర్తి కాగా..మిగిలిన పరీక్షలు జరగనున్నాయి. ఇక ఈ పదో తరగతి పరీక్షలకు పెద్ద సంఖ్యలో విద్యార్థులు హాజరయ్యారు. ఇలా విద్యార్థులు పరీక్షలు రాయడం వింత ఏమిలేదు. కానీ పార్వతిపురం మన్యం జిల్లాలో ఓ పెద్దావిడ కూడా మిగిలిన విద్యార్థుల మాదిరిగానే పరీక్షలకు హాజరైంది. విద్యార్థుల మాదిరిగా పరీక్షకు హాజరైన ఆమెను చూసి..మిగిలిన విద్యార్థుల తల్లిదండ్రులు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఆ గురించి పూర్తిగా తెలుసుకుని అభినందనలు తెలిపారు. పార్వతీపురం మన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురం మండలంలోని మాలపాడుకు చెందిన పెద్దమ్మి తన కుటుంబంతో కలిసి నివాసం ఉంటుంది.

ప్రస్తుతం ఆమె వయస్సు 53 ఏళ్లు. ఆమెకు చిన్నతనం నుంచి చదువుపై ఎంతో ఆసక్తి ఉండేది. అయితే  ఏడో తరగతి వరకు చదివిన ఆమె వివిధ కారణాలతో చదువును మధ్యలోనే ఆపేసింది. అయితే ఎలాగైనా పదో తరగతి అయినా చదవాలని ఆమె లక్ష్యంగా పెట్టుకుంది. కానీ కుటుంబ ధ్యాసలో పడి.. తన చదువుకు సమయం కేటాయించలేక పోయింది. ఇలా ఏళ్లు గడుస్తున్న ఆమెలో చదువుపై ఉన్న తపన మాత్రం తగ్గలేదు. చివరు 53 ఏళ్ల వయస్సులో పదో తరగతి పరీక్షలు రాసేందుక సిద్ధమైంది. సోమవారం నుంచి ప్రారంభమైన పదో తరగతి సార్వత్రిక పరీక్ష రాసేందుకు భద్రగిరి ఏపీఆర్‌ కేంద్రానికి వచ్చారు. ఈ సందర్భంగా ఆమెను మీడియా పలకరించగా.. అనివార్య కారణాలతో ఏడో తరగతిలో చదువు మానేశానని, ఆసక్తి ఉండటంతో మళ్లీ పరీక్షలకు వస్తున్నానని పెద్దమ్మి తెలిపారు. చదువుకోవాలనే తపన ఉండాలే కానీ..వయస్సు అడ్డురాదని పెద్దమ్మి నిరూపించారు. మరి.. యాబై పదుల వయస్సులో కూడా పట్టుదలతో తన లక్ష్యం వైపు అడుగులు వేసిన ఈ అమ్మపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments