iDreamPost

పల్నాడు జిల్లా బస్సు ప్రమాద ఘటన…ఆ కుటుంబ విషయం తెలిస్తే కన్నీరే!

పల్నాడు జిల్లాలో జరిగిన ఓ ఘోర ప్రమాదం అనేక కుటుంబాల్లో విషాదం నింపింది. సంతోషంగా సాగిపోతున్న జీవితాల్లో ఈప్రమాదం పెను కుదుపును తీసుకొచ్చింది. ఈ ఘటనలో ఓ కుటుంబంకి జరిగిన దారుణం తెలిస్తే కన్నీరు ఆగవు.

పల్నాడు జిల్లాలో జరిగిన ఓ ఘోర ప్రమాదం అనేక కుటుంబాల్లో విషాదం నింపింది. సంతోషంగా సాగిపోతున్న జీవితాల్లో ఈప్రమాదం పెను కుదుపును తీసుకొచ్చింది. ఈ ఘటనలో ఓ కుటుంబంకి జరిగిన దారుణం తెలిస్తే కన్నీరు ఆగవు.

పల్నాడు జిల్లా బస్సు ప్రమాద ఘటన…ఆ కుటుంబ విషయం తెలిస్తే కన్నీరే!

మంగళవారం అర్థరాత్రి పల్నాడు జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. చిలకలూరి పేట ప్రాంతంలో జరిగిన ప్రమాదం అనేక కుటుంబాల్లో విషాదం నింపింది. బాధ్యతగా ఓటు వేసేందుకు సొంత ఊళ్లకు వచ్చిన వారు తిరిగి పయనం అయ్యారు.  ఈ క్రమంలోనే చిలకలూరిపేట సమీపంలో చోటు చేసుకున్న యాక్సిడెంట్‌ కారణంగా బస్సులో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో ఆరుగురు సజీవదహనం కాగా.. 20 మంది గాయాలయ్యాయ. ప్రమాదంలో గాయపడ్డ వారికి ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. ఓటు వేయడానికి వచ్చిన వారు.. ఇలా అనంత లోకాలకు వెళ్తారని ఊహించలేదు అంటూ బాధితుల కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరు అవుతున్నారు. ఇక ప్రమాదంతో ఓ కుటుంబంలో జరిగిన ఘోరం గురించి తెలిస్తే కన్నీరు ఆగదు.

మంగళవారం అర్థరాత్రి పల్నాడు జిల్లాలో ఘోర బస్సుప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. చీరాల నియోజవర్గంలోని చిన్నగంజాం నుంచి హైదరాబాద్ వెళ్తున్న ప్రైవేటు ట్రావెల్స్ బస్సులో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. టిప్పర్ లారీని ట్రావెల్స్ ఢీ కొట్టడంతో ఈ ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. టిప్పర్ లారీని ఢీకొట్టిన క్రమంలోనే రెండు వాహనాల మధ్య మంటలు చెలరేగాయి.ఇవి ట్రావెల్ బస్సులోకి వేగంగా వ్యాపించాయి. గాఢనిద్రలో ఉన్న ప్రయాణికులు ఏం జరిగిందని తెలుసుకునే లోపే.. సజీవహ దహనం అయ్యారు. ఈ ఘటనలో ఎనిమిదేళ్ల చిన్నారితో సహా  ఆరుగురు వ్యక్తులు సజీవ దహనమయ్యారు.

ఇక ఈ ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన వారు ముగ్గురు ఉన్నారు. బాపట్ల జిల్లా చిన్నగంజాం మండలం నీలాయిపాలెంకు చెందిన ఉప్పు గుండూరు కాశీ(65), ఆయన భార్య లక్ష్మి (55), వాళ్ల మనవరాళ్లు సాయిశ్రీలు మృతి చెందారు.ప్రమాదం జరిగినప్పుడు చాలా మంది  బస్సు అద్దాలు పగలగొట్టుకుని బయటకు దూకారు. అయితే వీరు మాత్రం బయటకు దూకే ప్రయత్నం చేసేలోపే మంటలు చుట్టు ముట్టాయి. దీంతో వారు ఈ ప్రమాదంలో దుర్మరణం చెందారు. పొట్టకూటి కోసం సొంత ఊరిని వదలి వీరు హైదరాబాద్ లో నివాసం ఉంటున్నారు. పండగలకు, ఇతర ప్రత్యేక సమయంలో సొంత ఊర్లకు వస్తుంటారు.

అలానే సోమవారం ఎన్నికలు ఉండటంతో స్వగ్రామాలకు వచ్చారు. అక్కడ ఓటు వేసి.. తిరిగి మంగళవారం హైదరాబాద్ కి పయనమయ్యారు. అంతలోనే ఈఘోరం జరిగి.. ఆ దంపతులు వారి మనవరాళ్లు మృతి చెందింది. ఇక  ప్రమాదంలో గాయపడిన వారిని గుంటూరులోని జీజీ హెచ్ ఆస్పత్రికి చరలించి చికిత్స అందిస్తున్నారు. కొందరు తీవ్ర స్థాయిలో గాయపడ్డారు. ఇక కాశీ కుటుంబ గురించి తెలుసుకున్న అందరూ కన్నీరు మున్నీరు అవుతున్నారు. విధి ఆడిన వింత నాటకంలో వారి కుటుంబంలో చీకటి నిండింది. మరి.. ఈ విషాద ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి