Krishna Kowshik
ప్రస్తుతం దేశ వ్యాప్తంగా పొటిలికల్ హీట్ నడుస్తోంది. సార్వత్రిక ఎన్నికలు , నాలుగు రాష్ట్రాలకు అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న సంగతి విదితమే. అలాగే నామినేషన్ల పర్వం కూడా మొదలైంది. ఏపీలో తాజాగా ముగిసింది.
ప్రస్తుతం దేశ వ్యాప్తంగా పొటిలికల్ హీట్ నడుస్తోంది. సార్వత్రిక ఎన్నికలు , నాలుగు రాష్ట్రాలకు అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న సంగతి విదితమే. అలాగే నామినేషన్ల పర్వం కూడా మొదలైంది. ఏపీలో తాజాగా ముగిసింది.
Krishna Kowshik
దేశ వ్యాప్తంగా ఎన్నికల హడావుడి మొదలైంది. సార్వత్రిక ఎన్నికలతో పాటు నాలుగు రాష్ట్రాలకు అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. ఇప్పటికే తొలి దశ పూర్తయ్యింది. 88 స్థానాలకు ఏప్రిల్ 26న రెండవ దశ పోలింగ్ జరుగుతోంది. మరో వైపు కొన్ని రాష్ట్రాల్లో ఎన్నికల నామినేషన్ పర్వం జోరుగా కొనసాగుతుంది. ఇటు ఆంధ్రప్రదేశ్‌లో కూడా నామినేషన్ల ప్రక్రియ ముగిసింది. గత నెల ఎన్నికల నోటిఫికేషన్ జారీ కాగా, 175 అసెంబ్లీ, 25 పార్లమెంటు స్థానాలకు ఈ నెల 18 నుండి నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ మొదలైంది. ఏప్రిల్ 25న గురువారం మధ్యాహ్నం 3 గంటలకు రాష్ట్ర వ్యాప్తంగా ఈ ప్రక్రియ ముగిసింది. పలు కీలక నేతలు నామినేషన్లను దాఖలు చేశారు.
ఇదిలా ఉంటే ఓ అభ్యర్థి రెండంటే.. రెండు నిమిషాలు ఆలస్యం కారణంగా నామినేషన్ దాఖలు చేయలేకపోయాడు. నామినేషన్ దాఖలు చేసేందుకు తనను అనుమతించాలని విధుల్లో ఉన్న పోలీసులను కాళ్లు పట్టుకుని ప్రాథేయపడిన.. సమయం మించిపోవడంతో వారు నిరాకరించారు. ఈ ఘటన చిత్తూరు జిల్లాలో చోటుచేసుకుంది. చిత్తూరు ప్లారమెంట్ స్థానానికి స్వతంత్ర అభ్యర్థిగా నామినేట్ వేయడానికి పలమనేరుకు చెందిన రెడ్డెప్ప.. హుటా హుటిన స్థానిక కలెక్టరేట్ వద్దకు వచ్చాడు. అయితే అప్పటి సమయం 3.02 నిమిషాలు అయ్యింది. ఏప్రిల్ 25 మధ్యాహ్నం 3.00 వరకు మాత్రమే నామినేషన్ దాఖలు చేసేందుకు సమయం ఉండటంతో.. అతడ్ని కలెక్టర్ కార్యాలయంలోకి అనుమతించలేదు పోలీసులు.
నామినేషన్ దాఖలు చేసేందుకు వచ్చానని చెప్పగా.. సమయం ముగిసిందని, అనుమతించడం కుదరని చెప్పారు పోలీసులు. అక్కడే ఉన్న పోలీసుల అధికారి కాళ్లు మీద పడేంత పని చేశాడు ఆ ఎంపీ అభ్యర్థి.. చాలా సేపు ప్రాథేయపడినప్పటికీ ఉపయోగం లేదు. చివరకు నిరాశతో వెనుదిరిగాడు రెడ్డెప్ప. సమయం ఎంత కీలకమైనదో మరోసారి తెలియ చెప్పిన ఘటనగా మారింది. ఈ ఘటన చూస్తుంటే విద్యార్థుల నిమిషం నిబంధన గుర్తుకు రావడం ఖాయం. ఇక చివరి రోజు కూడా పలువురు కీలక నేతలు నామినేషన్లు దాఖలు చేశారు. మొత్తంగా అసెంబ్లీ స్థానాలకు 5,751 నామినేషన్లు, లోక్‌సభ స్థానాలకు మొత్తం 1,070 నామినేషన్లు దాఖలయ్యాయి. ఈసారి ఇండిపెండెంట్ అభ్యర్థులు ఎక్కువ సంఖ్యలో నామినేషన్లు దాఖలు చేసినట్లు తెలుస్తోంది. ఇక నామినేషన్ల ఉపసంహరణకు ఈ నెల 29 వరకు అవకాశం ఉంది.