iDreamPost

నలుగురు పోలీసులకు జైలు శిక్ష.. తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పు..

నలుగురు పోలీసులకు జైలు శిక్ష.. తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పు..

తాజగా సోమవారం నాడు తెలంగాణ హైకోర్టు ఓ సంచలన తీర్పు ఇచ్చింది. తెలంగాణ హైదరాబాద్ లో పని చేస్తున్న నలుగురు పోలీసు ఉన్నతాధికారులకు నాలుగు వారాల జైలు శిక్ష విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది. సుప్రీం కోర్టు ధిక్కరణ కేసులో ఈ పోలీసు అధికారులకు జైలు శిక్ష విధించింది తెలంగాణ హైకోర్టు.

హైదరాబాద్ జాయింట్ సీపీ ఏఆర్ శ్రీనివాస్, బంజారాహిల్స్ ఏసీపీ సుదర్శన్, జూబ్లీహిల్స్ సీఐ రాజశేఖర్ రెడ్డి, ఎస్ఐ నరేశ్ లకు తెలంగాణ హైకోర్టు నాలుగు వారాల పాటు జైలు శిక్ష విధించింది. అంతేకాకుండా ఈ నలుగురిపై శాఖాపరమైన క్రమశిక్షణ చర్యలు కూడా తీసుకోవాలని నగర కమిషనర్‌కు ఆదేశాలు జారీ చేసింది హైకోర్టు. గతంలో ఓ భార్యభర్తల వివాదం కేసులో ఈ పోలీసు అధికారులు సుప్రీంకోర్టు ఆదేశాలకు విరుద్ధంగా పని చేశారని, సుప్రీం నిబంధనల మేరకు CRPC 41ఏ నోటీసు ఇవ్వలేదని ఆరోపణలు ఉన్నాయి.

దీంతో ఈ కేసులో వీరికి జైలు శిక్షని విధించారు. నలుగురు పోలీసు ఉన్నతాధికారులకు ఇలా హైకోర్టు జైలు శిక్ష విధించడంతో ఒక్కసారిగా అంతా షాక్ అయ్యారు. అయితే దీనిపై అప్పీలు వెళ్లేందుకు నాలుగు వారాల జైలు శిక్షని ఆరు వారాల పాటు నిలిపివేసింది తెలంగాణ హైకోర్టు. ఒకవేళ ఈ లోపు ఎలాంటి ప్రాసెస్ లేకపోతే ఆరు వారాల తర్వాత వీరిని జైలుకి పంపనున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి