iDreamPost
android-app
ios-app

సింగరేణి కారుణ్య నియామక ఉద్యోగార్థులకు రేవంత్ సర్కార్ గుడ్ న్యూస్.. అదేంటంటే?

సింగరేణి కారుణ్య నియామక ఉద్యోగార్థులకు తెలంగాణ ప్రభుత్వం తీపికబురును అందించింది. ఆ విషయంలో రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ఇంతకీ ఆ గుడ్ న్యూస్ ఏంటంటే?

సింగరేణి కారుణ్య నియామక ఉద్యోగార్థులకు తెలంగాణ ప్రభుత్వం తీపికబురును అందించింది. ఆ విషయంలో రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ఇంతకీ ఆ గుడ్ న్యూస్ ఏంటంటే?

సింగరేణి కారుణ్య నియామక ఉద్యోగార్థులకు రేవంత్ సర్కార్ గుడ్ న్యూస్.. అదేంటంటే?

తెలంగాణలో అధికారం చేపట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుని అమలు చేస్తున్నది. ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు కృషి చేస్తోంది రేవంత సర్కార్. ఆరు గ్యారంటీలను పూర్తి స్థాయిలో అమలు చేసేందుకు ప్లాన్ చేస్తోంది. ఇక నిరుద్యోగులను దృష్టిలో పెట్టుకుని ఉద్యోగాల భర్తీపై ఫోకస్ చేసింది తెలంగాణ ప్రభుత్వం. పలు ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న జాబ్స్ ను భర్తీ చేసేందుకు చర్యలు తీసుకుంటోంది. ఈ క్రమంలో రేవంత్ సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. సింగరేణి కారుణ్య నియామక ఉద్యోగార్థులకు గుడ్ న్యూస్ అందించింది. ప్రభుత్వ నిర్ణయంతో వందలమంది ఉద్యోగార్థులకు ప్రయోజనం చేకూరనున్నది.

నల్ల బంగారంతో సిరులు కురిపించే సింగరేణి ఎంతో మందికి ఉపాధి కల్పిస్తున్నది. సింగరేణిపై ఆధారపడి వేలాది కుటుంబాలు జీవిస్తున్నాయి. సింగరేణి సంస్థలో పనిచేసే కార్మికులు మెడికల్ ఇన్ వ్యాలిడేషన్ కు గురైనా, మృతి చెందినా కారుణ్య నియామకాల ద్వారా వారసులకు బదిలీ వర్కర్ల ద్వారా ఉద్యోగాలు కల్పిస్తారు. కాగా కారుణ్య నియామక ఉద్యోగార్థుల వయసు విషయంలో తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. వారసుల గరిష్ట వయోపరిమితిని 40 ఏళ్లకు పెంచుతూ సింగరేణి యాజమాన్యం నిర్ణయం తీసుకుంది.

ఇదివరకు గరిష్ఠ వయోపరిమితి 35 ఏండ్లుగా ఉండగా, కార్మిక సంఘాల వినతి మేరకు ఈ నిర్ణయం తీసుకొన్నది. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా సీఎం రేవంత్‌రెడ్డి ఇచ్చిన హామీ మేరకు ఈ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నిర్ణయాన్ని 2018 మార్చి 9 నుంచి అమలు చేయనున్నట్టు సింగరేణి వెల్లడించింది. ఈ మేరకు సోమవారం సింగరేణి సంస్థ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రుభుత్వ నిర్ణయంతో కారుణ్య నియామక ఉద్యోగార్థులకు లబ్ధి చేకూరనున్నది. ప్రభుత్వ నిర్ణయంతో వారు హర్షం వ్యక్తం చేస్తున్నారు. వయోపరిమితి కారణంగా కారుణ్య ఉద్యోగం పొందే ఛాన్స్ కోల్పోయిన వారికి వయోపరిమితి పెంచడంతో ఉద్యోగాలు లభించనున్నాయి. మరి తెలంగాణ ప్రభుత్వం కారుణ్య నియామక ఉద్యోగార్థుల వయోపరిమితి పెంచుతూ తీసుకున్న నిర్ణయంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి