ప్రభుత్వ పాఠశాలల పనివేళల్లో మార్పులు చేసింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఈ మేరకు రాష్ట్ర విద్యాశాఖ ఉత్తర్వులను సైతం జారీ చేసింది. దాంతో స్కూల్ టైమింగ్స్ లో మార్పులు జరగనున్నాయి. గతంలో ఉదయం 10 గంటలకు స్కూల్స్ ప్రారంభం అయ్యేవి. సాయంత్రం 5 గంటల వరకు పని చేసేవి. కానీ తాజాగా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో.. స్కూల్ టైమింగ్స్ లో మార్పులు చోటుచేసుకున్నాయి. మరి మారిన టైమింగ్స్ ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం స్కూల్స్ టైమింగ్ విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. స్కూల్ టైమింగ్స్ లో మార్పులు తీసుకొస్తూ.. విద్యాశాఖ ఉత్తర్వులను జారీ చేసింది.విద్యాశాఖ జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం.. ఇకపై ప్రైమరీ పాఠశాలలు(1-5వ తరగతి) ఉదయం 9.30 గంటలకు ప్రారంభం అయ్యి.. సాయంత్రం 4.15 గంటల వరకు కొనసాగుతాయి. ఇక అప్పర్ ప్రైమరీ పాఠశాలలు(6-10వ తరగతి) ఉదయం 9.30 గంటల నుంచి సాయంత్రం 4.45 గంటల వరకు పని చేయాలని ఉత్తర్వులలో పేర్కొంది ప్రభుత్వం.
అయితే అప్పర్ ప్రైమరీ స్కూళ్లలోని ప్రైమరీ స్కూళ్లు కూడా ఉదయం 9.30 గంటలకు ప్రారంభం అయ్యి సాయంత్రం 4.15 గంటల వరకే పని చేయాలని తెలిపింది. కాగా.. సికింద్రాబాద్, హైదరాబాద్ తప్పించి రాష్ట్రంలోని మిగతా స్కూల్స్ అన్నింటికీ ఈ కొత్త టైమింగ్సే వర్తిస్తాయని ప్రభుత్వం ఆదేశించింది. మరి తెలంగాణ తీసుకొచ్చిన ఈ నూతన టైమింగ్స్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.