iDreamPost

నేడు తెలంగాణ బీజేపీ అభ్యర్థుల తొలి జాబితా విడుదల!

తెెలంగాణ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ రిలీజ్ అయ్యింది. ఇక 40 రోజుల్లో ఎన్నికలు జరగబోతున్నాయి.. దీంతో పార్టీ నేతలు ప్రచారంలో దూకుడు పెంచారు.

తెెలంగాణ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ రిలీజ్ అయ్యింది. ఇక 40 రోజుల్లో ఎన్నికలు జరగబోతున్నాయి.. దీంతో పార్టీ నేతలు ప్రచారంలో దూకుడు పెంచారు.

నేడు తెలంగాణ బీజేపీ అభ్యర్థుల తొలి జాబితా విడుదల!

తెలంగాణలో ఎన్నికల షెడ్యూల్ రిలీజ్ అయిన వెంటనే పార్టీ నేతల్లో హడావుడి మొదలైంది. నవంబర్ 30న ఎన్నికలు, డిసెంబర్ 3న కౌంటింగ్ ఉండబోతున్నట్లు ఎన్నికల సంఘం తెలిపింది. దీంతో అధికార, ప్రతిపక్ష పార్టీలు దూకుడు పెంచాయి. తమ తమ వ్యూహాలతో ప్రజల్లోకి వెళ్తున్నారు. బీఆర్ఎస్ నుంచి సీఎం కేసీఆర్, కాంగ్రెస్ నుంచి రాహుల్ గాంధీ, ప్రియాంకలు, తెలంగాణ కాంగ్రెస్ నేతలు ప్రచారం కొనసాగిస్తున్నారు. తెలంగాణలో ప్రధాన పార్టీ గా చెప్పుకునే బీజేపీ లో మాత్రం ఎలాంటి సందడి లేదు. ఇప్పటి వరకు ఎమ్మెల్యే అభ్యర్థుల పేర్లు ప్రకటించలేదు. ఓ వైపు బీఆర్ఎస్ ఎమ్మెల్యే అధ్యర్థుల పేర్లు ప్రకటించడమే కాదు.. బీ-పారాలు కూడా ఇచ్చారు. కాంగ్రెస్ సైతం 55 మంది లీస్ట్ రిలీజ్ చేసింది..త్వరలో మరో లీస్ట్ కూడా రాబోతుంది. ఈ క్రమంలోనే బీజేపీ శ్రేణుల్లో అసంతృప్తి నెలకొంది. అయితే అభ్యర్థుల పేర్లు అధిష్టానానికి పంపించగా నేడు కొంతమంది పేర్లు ఖరారు చేసి రిలీజ్ చేయబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. వివరాల్లోకి వెళితే..

తెలంగాణలో అధికార పార్టీ బీఆర్ఎస్, ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్ ప్రచారంలో దూసుకు పోతున్నాయి. బీజేపీ ఇప్పటి వరకు ఎమ్మెల్యే అభ్యర్థుల లీస్ట్ ఖారారు చేయలేదు.. ప్రచారానికి శ్రీకారం చుట్టలేదు. దీనిపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలోనే బీజేపీ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి 55 మందితో తొలి జాబితా అధికారికంగా విడుదల చేయనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే కొంతమంది పేర్లు ప్రచారంలో ఉన్నట్లు చెబుతున్నారు. వారికి సంబంధించిన లీస్ట్ కూడా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ప్రధాని మోదీ అధ్యక్షతన ఢిల్లీలో శుక్రవారం రాత్రి కీలక సమావేశం జరిగింది.. పోటీ చేయడానికి 55 మందితో కూడా ఫస్ట్ లీస్ట్ పార్లమెంటరీ బోర్డు ఆమోదం కూడా తెలిపినట్లు సమాచారం. ఈ మేరకు శనివారం అధికారికంగా విడుదల చేయబోతున్నట్లు సమాచారం. ఈసారి అసెంబ్లీ ఎన్నికలో కిషన్ రెడ్డి, ఎంపీ లక్ష్మణ్ బరిలో ఉండటం లేదని సమాచారం. ఈటెల రాజేందర్ మాత్రం హుజూరాబాద్, గజ్వేల్ నియోజకవర్గాల నుంచి పోటీ చేయబోతున్నట్లు తెలుస్తుంది. ఇక నటి విజయశాంతికి కామారెడ్డి లేదా మెదక్ నియోజకవర్గం దక్కే అవకాశాలు ఉన్నట్లు కనిపిస్తున్నాయి.

రాష్ట్రంలో నలుగురు ఎంపీల్లో ముగ్గురిని శాసన సభ ఎన్నికల బరిలో నిలబెట్టే యోచనలో ఉన్నట్లు తెలుస్తుంది. కరీంనగర్ ఎంపీ అయిన బండి సంజయ్ ని కరీంనగర్ నియోజకవర్గం నుంచి, ఆదిలాబాద్ ఎంపీ అయిన సోయం బాపూరావు ను బోథ్ నియోజకవర్గం నుంచి, నిజామాబాద్ ఎంపీ అయిన ఎంపీ ధర్మపురి అర్వింద్ ని కోరుట్ల నియోజకవర్గం నుంచి పోటీలో నిలపనున్నట్లు సమాచారం. సిట్టింగ్ ఎమ్మెల్యే  రఘునందన్ రావును తిరిగి దుబ్బాక టికెట్ కేటాయించినట్లు తెలుస్తుంది. డీకే అరుణ గద్వాల నుంచి, రాణి రుద్రమ ను సిరిసిల్ల నుంచి పోటీ చేయడానికి కేంద్రం కమిటీ నిర్ణయం తీసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. సాయంత్రం ఫస్ట్ లీస్టు వస్తే కానీ అభ్యర్థుల పేర్లు, వారికి కేటాయించిన నియోజకవర్గాల పేర్లపై స్పష్టత వస్తుంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి