iDreamPost

తీన్మార్ మల్లన్న కొత్త పార్టీ.. ఈసీఐ కి ధరఖాస్తు!

తీన్మార్ మల్లన్న కొత్త పార్టీ.. ఈసీఐ కి ధరఖాస్తు!

తెలంగాణలో త్వరలో ఎన్నికలు రాబోతున్నాయి. ఇప్పటి నుంచి అధికార, ప్రతిపక్ష పార్టీలు వచ్చే ఎన్నికల్లో గెలుపు కోసం అన్ని రకాల వ్యూహాలతో ముందుకు సాగుతున్నారు. ఇప్పటి వరకు తాము చేసిన అభివృద్ది పనులు, పథకాల గురించి చెబుతూ మరో ఛాన్స్ ఇవ్వాల్సిందిగా అధికార పార్టీ బీఆర్ఎస్ ప్రజల్లోకి వెళితే.. తెలంగాణను అభివృద్ది పేరుతో మోసం చేస్తున్నారని..కుటుంబ పాలన కొనసాగుతుందని చెబుతూ.. ప్రతిపక్ష నేతలు ప్రజల్లోకి వెళ్తున్నారు. ఈ క్రమంలో తాజాగా తెలంగాణలో మరో కొత్త పార్టీ ఆవిర్భవించబోతుందని వార్తలు వస్తున్నాయి. జర్నలిస్ట్ తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్ కుమార్ గతంలో కొత్త పార్టీ పెట్టబోతున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. తన పార్టీ రిజిస్ట్ర కోసం తాజాగా ఈసీకి దరఖాస్తు చేసుకున్నారు మల్లన్న. వివరాల్లోకి వెళితే..

తీన్మార్ మల్లన్న ఓ ప్రముఖ ఛానల్ లో తెలంగాణ యాసలో వార్తలు చదువుతూ తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యారు. ఆ తర్వాత పలు ఛానల్స్ లో జర్నలిస్ట్ గా పనిచేసిన ఆయన సొంతగా క్యూ న్యూస్ యూట్యూబ్ ఛానల్ ను ఏర్పాటు చేసి ప్రభుత్వం పనితీరుపై విమర్శలు చేస్తున్నారు. కొంత కాలంగా తీన్మార్ మల్లన్న రాజకీయాల్లో యాక్టీవ్ గా కనిపిస్తున్న విషయం తెలిసిందే.  తెలంగాణలో మరికొన్ని నెలల్లో ఎన్నికలు జరగబోతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో తీన్మార్ మల్లన్న అధ్యక్షతన కొత్త రాజకీయ పార్టీ పెట్టబోతున్నట్లు గతంలో ప్రకటించారు. తాజాగా ‘తెలంగాణ నిర్మాణ పార్టీ’ పేరును రిజిస్టర్ చేయాలని భారత ఎన్నికల సంఘం (ఈసీఐ)కు దరఖాస్తు చేసుకున్నారు మల్లన్న.

ఈ నేపథ్యంలో పార్టీ పేరు, ఇతర అంశాలపై ఎమైనా అభ్యంతరాలు ఉంటే ఈ నెల 30వ తేదీ లోపు తెలియజేయాలని ఈసీఐ వెబ్ సైట్ లో పేర్కొంది. అయితే పార్టీ ప్రధాన కార్యదర్శిగా మాదం రజినీ కుమార్ (వరంగల్ జిల్లా ధర్మసాగర్) కోశాధికారిగా ఆర్.భావన (హైదరాబాద్, చంపాపేట్, సరూర్ నగర్) ఉంటారుని దరఖాస్తులో పేర్కొన్నారు. గతంలో తాను ప్రజల కోసం పోరాడితే జైల్లో పెట్టారని.. అధికార పార్టీ చేస్తున్న దురాగతాలన్నీ ప్రజల్లోకి తీసుకువస్తానని.. తెలంగాణ ప్రజల ఆకాంక్ష నెరవేర్చేది యువతేనని రైట్‌ రీ కాల్‌ తీసుకొస్తామని తీన్మార్ మల్లన్న అంటున్నారు. కాగా, తీన్మార్ మల్లన్న అధ్యక్షత కొత్తగా రాజకీయ పార్టీ రాబోతున్న విషయంపై రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి