iDreamPost

విలియమ్సన్ ను వెనక్కినెట్టి.. తొలిసారి జైస్వాల్ కు ప్రతిష్టాత్మకమైన అవార్డు!

టీమిండియా యువ సంచలనం యశస్వీ జైస్వాల్ ప్రతిష్టాత్మకమైన అవార్డును దక్కించుకున్నాడు. కివీస్ స్టార్ బ్యాటర్ కేన్ విలియమ్సన్ ను వెనక్కినెట్టి మరి ఈ అవార్డును కైవసం చేసుకున్నాడు జైస్వాల్. ఆ వివరాల్లోకి వెళితే..

టీమిండియా యువ సంచలనం యశస్వీ జైస్వాల్ ప్రతిష్టాత్మకమైన అవార్డును దక్కించుకున్నాడు. కివీస్ స్టార్ బ్యాటర్ కేన్ విలియమ్సన్ ను వెనక్కినెట్టి మరి ఈ అవార్డును కైవసం చేసుకున్నాడు జైస్వాల్. ఆ వివరాల్లోకి వెళితే..

విలియమ్సన్ ను వెనక్కినెట్టి.. తొలిసారి జైస్వాల్ కు ప్రతిష్టాత్మకమైన అవార్డు!

యశస్వీ జైస్వాల్.. టీమిండియాలోకి దూసుకొచ్చిన ఈ యువకెరటం అదరగొడుతున్నాడు. స్టార్ బ్యాటర్లను తలదన్నేలా రికార్డుల మీద రికార్డులు బద్దలు కొడుతూ.. టాక్ ఆఫ్ ది టౌన్ గా మారాడు. ఇటీవల ఇంగ్లండ్ తో ముగిసిన ఐదు టెస్ట్ మ్యాచ్ ల సిరీస్ లో టాప్ స్కోరర్ గా నిలిచి అందరి చేత శభాష్ అనిపించుకున్నాడు. అసాధారణ ప్రదర్శనతో తొలిసారి ఐసీసీ ప్రతిష్టాత్మకమైన అవార్డును దక్కించుకున్నాడు. కివీస్ స్టార్ కేన్ విలియమ్సన్ ను కాదని జైస్వాల్ ఈ అవార్డును ఎగరేసుకుపోయాడు.

టీమిండియా యంగ్ ఓపెనర్ యశస్వీ జైస్వాల్ ప్రతిష్టాత్మకమైన ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ద మంత్ అవార్డును గెలుచుకున్నాడు. ఈ ఏడాది ఫిబ్రవరి నెలలో అత్యుత్తమ ప్రదర్శన కనబర్చాడు జైస్వాల్. భారత్ వేదికగా ఇంగ్లండ్ తో జరిగిన టెస్ట్ సిరీస్ లో తన విశ్వరూపం చూపాడు. ఫిబ్రవరిలో ఇంగ్లండ్ తో జరిగిన మూడు టెస్ట్ ల్లో 112 సగటుతో ఏకంగా 560 రన్స్ చేశాడు. అందులో రెండు డబుల్ సెంచరీలు కూడా ఉన్నాయి. ఓవరాల్ గా ఈ సిరీస్ లో 712 పరుగులు చేసి టాప్ స్కోరర్ గా ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ ను అవార్డును కూడా అందుకున్నాడు. ఇక ఇప్పుడు ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ద మంత్ అవార్డును దక్కించుకున్నాడు.

కాగా.. ఈ అవార్డు కోసం న్యూజిలాండ్ స్టార్ బ్యాటర్ కేన్ విలియమ్సన్ తో పాటుగా శ్రీలంక ఆటగాడు పథుమ్ నిస్సంక పోటీ పడ్డారు. కానీ వీరిద్దరిని వెనక్కినెట్టి ఎక్కువ ఓట్లతో జైస్వాల్ అవార్డు సాధించాడు. కాగా.. మహిళల విభాగంలో ఆస్ట్రేలియా ఆల్ రౌండర్ అన్నాబెల్ సదర్లాండ్ ఈ అవార్డును దక్కించుకుంది. మరి అతి తక్కువ కాలంలోనే ఐసీసీ అవార్డును కైవసం చేసుకున్న యశస్వీ జైస్వాల్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

ఇదికూడా చదవండి: రోహిత్ ఎలాంటి వాడంటే..? ముంబై బౌలింగ్‌ కోచ్‌ జహీర్‌ ఖాన్‌ షాకింగ్‌ కామెం‍ట్స్‌!

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి