iDreamPost

వీడియో: సింగిల్ ప్రోమోతో ఫుల్ క్లారిటీ.. T20 వరల్డ్ కప్​ స్క్వాడ్ గురించి చెప్పేశారుగా!

  • Published Apr 24, 2024 | 10:04 AMUpdated Apr 24, 2024 | 10:04 AM

పొట్టి ప్రపంచ కప్​నకు వెళ్లే భారత జట్టులో ఏయే ఆటగాళ్లు ఉంటారనే దాని గురించి నిత్యం డిస్కషన్స్ నడుస్తూ ఉన్నాయి. అయితే ఒక్క ప్రోమోతో ఈ విషయంపై ఫుల్ క్లారిటీ వచ్చేసింది.

పొట్టి ప్రపంచ కప్​నకు వెళ్లే భారత జట్టులో ఏయే ఆటగాళ్లు ఉంటారనే దాని గురించి నిత్యం డిస్కషన్స్ నడుస్తూ ఉన్నాయి. అయితే ఒక్క ప్రోమోతో ఈ విషయంపై ఫుల్ క్లారిటీ వచ్చేసింది.

  • Published Apr 24, 2024 | 10:04 AMUpdated Apr 24, 2024 | 10:04 AM
వీడియో: సింగిల్ ప్రోమోతో ఫుల్ క్లారిటీ.. T20 వరల్డ్ కప్​ స్క్వాడ్ గురించి చెప్పేశారుగా!

పొట్టి ప్రపంచ కప్​నకు వెళ్లే భారత జట్టులో ఏయే ఆటగాళ్లు ఉంటారనే దాని గురించి నిత్యం డిస్కషన్స్ నడుస్తూ ఉన్నాయి. ఆ ప్లేయర్ ఉంటాడు, ఈ ప్లేయర్​కు ఛాన్స్ లేదంటూ ఏవేవో రూమర్స్ వస్తున్నాయి. అయితే దీనిపై భారత క్రికెట్ బోర్డు నుంచి ఇప్పటిదాకా అధికారిక ప్రకటన మాత్రం రాలేదు. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, కోచ్ రాహుల్ ద్రవిడ్, చీఫ్​ సెలక్టర్ అజిత్ అగార్కర్ కూడా ఈ విషయంపై ఎక్కడా రియాక్ట్ కాలేదు. అయితే ఐపీఎల్-2024లో ఆటగాళ్ల ప్రదర్శనను బట్టే టీమ్ సెలక్షన్ ఉంటుందని, సెలక్షన్ కమిటీ సభ్యులు క్యాష్​ రిచ్ లీగ్​లోని ప్రతి మ్యాచ్​ను దగ్గర నుంచి గమనిస్తున్నారని క్రికెట్ వర్గాల సమాచారం. లీగ్​లో క్రికెటర్ల పెర్ఫార్మెన్స్​ను బట్టే సెలక్షన్ ఉంటుందని వినికిడి. ఈ తరుణంలో ఒక్క ప్రోమోతో టీమిండియా స్క్వాడ్​పై ఫుల్ క్లారిటీ వచ్చేసింది.

ఐపీఎల్ ముగిసిన వెంటనే వరల్డ్ కప్ హడావుడి మొదలుకానుంది. జూన్ నెల మొత్తం పొట్టి ప్రపంచ కప్ సందడే ఉండనుంది. ఇప్పటికే అన్ని దేశాలు తమ టీమ్ సెలక్షన్ దగ్గర నుంచి ప్లేయర్ల ప్రాక్టీస్ వరకు చాలా విషయాల్లో తలమునకలై ఉన్నాయి. భారత జట్టుకు వచ్చేసరికి క్రికెటర్లు ఐపీఎల్​లో ఆడుతూ బిజీగా ఉన్నారు. త్వరలో టీమ్ స్క్వాడ్​పై క్లారిటీ వస్తుందని అంటున్నారు. ఈ తరుణంలో స్టార్ స్పోర్ట్స్ సంస్థ టీ20 వరల్డ్ కప్ ప్రోమోను తాజాగా విడుదల చేసింది. జాతీయ గీతం వందేమాతరం ఆంథమ్​తో ఈ ప్రోమో సాగింది. ఇందులో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, సీనియర్ బ్యాట్స్​మెన్ విరాట్ కోహ్లీతో పాటు పించ్ హిట్టర్ సూర్యకుమార్ యాదవ్, స్టార్ ఆల్​రౌండర్ రవీంద్ర జడేజాను హైలైట్ చేశారు. వీళ్లతో పాటు జట్టులో చోటు కష్టమే అనుకుంటున్న మరో ప్లేయర్​ను కూడా చూపించారు.

రోహిత్, కోహ్లీ, జడ్డూ, సూర్యతో పాటు వరల్డ్ కప్ స్క్వాడ్​లో బెర్త్ డౌట్ అని అనుకుంటున్న స్టార్ ఆల్​రౌండర్ హార్దిక్ పాండ్యాను ప్రోమోలో హైలైట్ చేసింది స్టార్ స్పోర్ట్స్. ప్రపంచ కప్​లో భారత జట్టు ప్రయాణం ఎలా ఉండనుందో చెబుతూ ఈ ప్రోమోను స్పెషల్​గా తయారు చేశారు. ఈ సింగిల్ ప్రోమోతో టీ20 వరల్డ్ కప్​లో టీమిండియా స్క్వాడ్ ఎలా ఉండనుందో ఓ క్లారిటీ వచ్చేసింది. హార్దిక్ పాండ్యా టీమ్​లో ఉండడని కొన్నాళ్లుగా వార్తలు వస్తున్నాయి. లేటెస్ట్ ప్రోమోతో దీనిపై క్లారిటీ వచ్చేసింది. అతడికి జట్టులో చోటు పక్కా అని దీంతో కన్ఫర్మ్​ అయిపోయింది. అలాగే రోహిత్, కోహ్లీ, సూర్య, జడ్డూ కూడా టీమ్​లో ఉంటారనేది తేలిపోయింది. ఇలా సగం స్క్వాడ్ మీద క్లారిటీ వచ్చేసింది. త్వరలో చేసే అధికారిక ప్రకటనతో పూర్తి జట్టుపై స్పష్టత వచ్చేస్తుంది. మరి.. వరల్డ్ కప్ స్క్వాడ్​లో ఏయే ప్లేయర్లు ఉండాలని మీరు కోరుకుంటున్నారో కామెంట్ల రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి