iDreamPost
android-app
ios-app

వరల్డ్ కప్‌లో ఇండియా బలాలు, బలహీనతలు! మూడో కప్ గెలిచే ఛాన్స్?

  • Published Oct 03, 2023 | 11:29 AM Updated Updated Oct 03, 2023 | 11:29 AM
  • Published Oct 03, 2023 | 11:29 AMUpdated Oct 03, 2023 | 11:29 AM
వరల్డ్ కప్‌లో ఇండియా బలాలు, బలహీనతలు! మూడో కప్ గెలిచే ఛాన్స్?

క్రికెట్‌ ఫ్యాన్స్‌ ఎంతగానో ఎదురుచూస్తున్న వన్డే వరల్డ్‌ కప్‌ ప్రారంభానికి అంతా రెడీ అయింది. తొలి మ్యాచ్‌కు టాస్‌ పడటమే ఆలస్యం. అయితే ఈ మెగా టోర్నీ ఆరంభానికి చాలా రోజుల ముందు నుంచి ఉన్న చర్చ ఏంటంటే? ఏ టీమ్‌ వరల్డ్‌ కప్‌ గెలుస్తుంది? ఏ జట్టుకు ఎక్కువ అవకాశాలు ఉన్నాయి? హాట్‌ ఫేవరేట్‌గా ఉన్న టీమిండియాకు ప్రధాన పోటీ ఏ టీమ్‌ నుంచి ఉంది? ఇలాంటి ప్రశ్నలు క్రికెట్‌ అభిమానుల నుంచి వ్యక్తం అవుతున్నాయి. ముఖ్యంగా ఇండియన్‌ క్రికెట్‌ ఫ్యాన్స్‌ టీమిండియాపైనే ఫోకస్‌ పెట్టారు. పైగా ఆసియా కప్‌ 2023, ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్‌ విజయాలతో ఫుల్‌ జోష్‌లో ఉన్నట్లు కనిపిస్తోంది. జట్టుల్లోని ఆటగాళ్లంతా సూపర్‌ ఫామ్‌లో ఉన్నారు. దీంతో.. ఈ సారి కప్పు కొట్టకుండా టీమిండియా ఆపేది ఎవడ్రా అంటూ సోషల్‌ మీడియా వేదికగా భారత క్రికెట్‌ అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. మరి నిజంగానే టీమిండియా అంత స్ట్రాంగ్‌గా ఉందా? అసలు బలం, బలహీనతలు ఎలా ఉన్నాయి? ఇప్పుడు తెలుసుకుందాం..

బలాలు..
టీమిండియా ప్రస్తుతం సూపర్‌ ఫామ్‌లో ఉన్న మాట వాస్తవం. జట్టులోని ప్రతి ఆటగాడు మంచి టచ్‌లో ఉండటం భారత జట్టు ప్రధాన బలంగా చెప్పవచ్చు. ఓపెనర్లు రోహిత్‌ శర్మ, శుబ్‌మన్‌ గిల్‌.. టీమ్‌కు మంచి ఆరంభాలను అందిస్తున్నారు. ఇక వన్‌డౌన్‌లో విరాట్‌ కోహ్లీ ఉండటం టీమిండియా కొండంత అండ. కోహ్లీ స్టామినా, క్యాలిబర్‌పై ఎవరికి ఎలాంటి డౌట్స్‌ అక్కర్లేదు. ఆ తర్వాత శ్రేయస్‌ అయ్యర్‌, కేఎల్‌ రాహుల్‌, హార్డిక్‌ పాండ్యాతో మిడిల్డార్‌ సైతం చాలా పటిష్టంగా ఉంది. వీరిలో ఎవరికి రెస్ట్‌ ఇచ్చినా.. ఇషాన్‌ కిషన్‌ సైతం ఫామ్‌లో ఉన్నాడు. ఇక రవీంద్ర జడేజా సైతం బాల్‌తో అదరగొడుతున్నాడు. కుల్దీప్‌ యాదవ్‌ రూపంలో క్వాలిటీ స్పిన్నర్‌ ఉన్నాడు. పైగా కుల్దీప్‌ కెరీర్‌ పీక్‌ ఫామ్‌లో ఉన్నాడు.

ఇక పేస్‌ ఎటాక్‌ అయితే.. ప్రత్యర్థి గుండెల్లో రైళ్లు పరిగెట్టించేలా ఉంది. బుమ్రా, సిరాజ్‌, షమీ.. పిచ్‌ నుంచి హెల్ప్‌ లేకపోయినా.. మంచి ప్రదర్శన కనబరుస్తున్నారు. ఇక పిచ్‌ నుంచి స్వింగ్‌ లభిస్తే.. వీళ్లను ఎదుర్కొవడం ప్రపంచంలో ఏ టీమ్‌ వల్ల కాదు. పైగా వరల్డ్‌ కప్‌ మ్యాచ్‌లు మన దేశంలోనే జరుగుతుండటం టీమిండియా కలిసొచ్చే అంశం. మన పిచ్‌లపై, వేల మంది అభిమానల మధ్య రెట్టించిన ఉత్సాహంతో టీమిండియా బెబ్బులిలా చెలరేగే అవకాశం ఉంది. 2011లో టీమిండియా గెలిచిన వరల్డ్‌ కప్‌ సైతం.. మన దేశంలోనే జరగిన విషయం తెలిసిందే. ఇప్పుడు అదే మ్యాజిక్‌ను టీమిండియా రిపీట్‌ చేస్తుందని, చేయాలని ఫ్యాన్స్‌ ఆశిస్తున్నారు.

బలహీనతలు..
ఓవరాల్‌గా టీమ్‌.. బ్యాటింగ్‌ బౌలింగ్‌లో అద్భుతంగా కనిపిస్తోంది. కానీ, ఫీల్డింగ్‌లో మెరుగుపడాల్సి ఉంది. ఇదొక్కటే ప్రస్తుతం టీమిండియాలో కనిపిస్తున్న ప్రధాన సమస్యగా చెప్పుకోవచ్చు. ఆసియా కప్‌ 2023, ఆస్ట్రేలియాతో జరిగిన మూడు వన్డేల సిరీస్‌లో టీమిండియా ఫీల్డింగ్‌లో చాలా పొరపాట్లు చేసింది. ముఖ్యంగా చాలా సులువైన క్యాచ్‌లను సైతం టీమిండియా ఆటగాళ్లు వదిలేసిన సందర్భాలు ఉన్నాయి. విరాట్‌ కోహ్లీ లాంటి అత్యుత్తమ ఫీల్డర్‌ నుంచి కూడా క్యాచ్‌లు డ్రాప్‌ అయ్యాయి. మరి వరల్డ్‌ కప్‌ లాంటి ప్రతిష్టాత్మక టోర్నీ నెగ్గాలంటే.. అన్ని విభాగాల్లో మెరుగ్గా ఉండాలి. ఈ వరల్డ్‌ కప్‌లో టీమిండియా ఫీల్డింగ్‌లోనూ మెరుగైతేనే.. విజయావకాశాలు మరింత బలపడతాయని చెప్పవచ్చు.

టీమ్‌: రోహిత్‌ శర్మ(కెప్టెన్‌), శుబ్‌మన్‌ గిల్‌, విరాట్‌ కోహ్లీ, శ్రేయస్‌ అయ్యర్‌, ఇషాన్‌ కిషన్‌, కేఎల్‌ రాహుల్‌, హార్దిక్‌ పాండ్యా(వైస్‌ కెప్టెన్‌), రవీంద్ర జడేజా, శార్దుల్‌ ఠాకూర్‌, సూర్యకుమార్‌ యాదవ్‌, రవిచంద్రన్‌ అశ్విన్‌, జస్ప్రీత్‌ బుమ్రా, మొహమ్మద్‌ సిరాజ్‌, మొహమ్మద్‌ షమీ, కుల్దీప్‌ యాదవ్‌.

ఇదీ చదవండి: వరల్డ్ కప్‌లో ఇంగ్లండ్‌ బలాలు, బలహీనతలు! రెండో కప్ గెలిచే ఛాన్స్?