iDreamPost
android-app
ios-app

Virat Kohli: క్రికెటర్ కాకపోయుంటే ఆ పని చేసుకుంటూ బతికేవాడ్ని.. కోహ్లీ ఇంట్రెస్టింగ్ కామెంట్స్!

  • Published May 04, 2024 | 5:56 PM Updated Updated May 04, 2024 | 5:56 PM

క్రికెట్ ద్వారా ఫుల్ క్రేజ్, పాపులారిటీ సంపాదించిన కింగ్ విరాట్ కోహ్లీ.. ఇప్పుడు ఆ గేమ్​కే బ్రాండ్ అంబాసిడర్​గా మారాడు. అలాంటోడు ఒకవేళ క్రికెటర్ కాకపోయుంటే ఏం చేసేవాడో తలచుకుంటేనే ఆశ్చర్యకరంగా ఉంటుంది. దీనిపై స్వయంగా కోహ్లీ రియాక్ట్ అయ్యాడు.

క్రికెట్ ద్వారా ఫుల్ క్రేజ్, పాపులారిటీ సంపాదించిన కింగ్ విరాట్ కోహ్లీ.. ఇప్పుడు ఆ గేమ్​కే బ్రాండ్ అంబాసిడర్​గా మారాడు. అలాంటోడు ఒకవేళ క్రికెటర్ కాకపోయుంటే ఏం చేసేవాడో తలచుకుంటేనే ఆశ్చర్యకరంగా ఉంటుంది. దీనిపై స్వయంగా కోహ్లీ రియాక్ట్ అయ్యాడు.

  • Published May 04, 2024 | 5:56 PMUpdated May 04, 2024 | 5:56 PM
Virat Kohli: క్రికెటర్ కాకపోయుంటే ఆ పని చేసుకుంటూ బతికేవాడ్ని.. కోహ్లీ ఇంట్రెస్టింగ్ కామెంట్స్!

సచిన్ టెండూల్కర్ తర్వాత వరల్డ్ క్రికెట్​లో మళ్లీ ఓ ప్లేయర్ పేరు ఆ రేంజ్​లో పాపులర్ అయిందంటే అది విరాట్ కోహ్లీదే అని చెప్పాలి. పదిహేనేళ్లుగా కన్​సిస్టెంట్​గా రన్స్ చేస్తూ రికార్డుల మీద రికార్డులు సృష్టిస్తున్నాడు కింగ్. నీళ్లు తాగినంత ఈజీగా సెంచరీలు కొడుతూ అందర్నీ ఆశ్చర్యపరుస్తున్నాడు. టీమిండియా తరఫునే కాదు.. ఐపీఎల్​లో ఆర్సీబీ తరఫున కూడా అదరగొడుతున్నాడు. ఒకప్పుడు ఎలాగైతే సచిన్ బ్యాటింగ్ కోసం ఎదురుచూసేవారో.. ఇప్పుడు విరాట్ బ్యాటింగ్ కోసం కూడా అలాగే ఎదురుచూస్తున్నారు అభిమానులు. క్రికెట్ ద్వారా ఫుల్ క్రేజ్, పాపులారిటీ సంపాదించిన కింగ్.. ఇప్పుడు ఆ గేమ్​కే బ్రాండ్ అంబాసిడర్​గా మారాడు. అలాంటోడు ఒకవేళ క్రికెటర్ కాకపోయుంటే ఏం చేసేవాడో తలచుకుంటేనే ఆశ్చర్యకరంగా ఉంటుంది. దీనిపై స్వయంగా కోహ్లీ రియాక్ట్ అయ్యాడు. క్రికెట్​లోకి రాకపోతే ఆ పని చేసుకొని బతికేవాడ్నని అన్నాడు.

ఆర్సీబీ ఫ్రాంచైజీ నిర్వహించిన ఓ కార్యక్రమంలో సహచర ఆటగాళ్లతో కలసి పాల్గొన్నాడు కోహ్లీ. ఈ సందర్భంగా క్రికెటర్ కాకపోతే ఏ కెరీర్​ను ఎంచుకునేవాడివి? ఏమయ్యేవాడివి? అని విరాట్​ను యాంకర్ ప్రశ్నించాడు. ఈ ప్రశ్నకు కింగ్ స్పందిస్తూ.. నిజాయితీగా చెప్పాలంటే ఎప్పుడూ దీని గురించి ఆలోచించలేదన్నాడు. ఏదైనా బిజినెస్ చేసేవాడ్ని అని అన్నాడు. అయితే వ్యాపారం ఎలా చేయాలో తనకు ఐడియా లేదన్నాడు. ఇప్పుడిప్పుడే దాని గురించి నేర్చుకుంటున్నానని తెలిపాడు. క్రికెట్ కాకుండా బిజినెస్​లోకి వెళ్లి ఉంటే పక్కా 200 శాతం మోసపోయేవాడ్ని అని కోహ్లీ పేర్కొన్నాడు. దీంతో అక్కడున్న వాళ్లందరూ నవ్వుల్లో మునిగిపోయారు.

క్రికెటర్​ కాకపోయుంటే బిజినెస్​మన్ అయ్యేవాడ్ని అని చెప్పిన కోహ్లీ.. ఒకప్పుడు వ్యాపారం గురించి ఏమీ తెలియదని, కానీ ఇప్పుడు దాని గురించి అవగాహన వచ్చిందన్నాడు. బిజినెస్​లో కొన్ని ఎదురుదెబ్బలు, మోసాలు చూశానని.. అందుకే అది ఎలా ఉంటుందో ఓ క్లారిటీ వచ్చిందన్నాడు కింగ్. ఇక, ఈ ఏడాది ఐపీఎల్​లో విరాట్ బ్యాట్​తో దుమ్మురేపుతున్నాడు. ఇప్పటివరకు ఆడిన 10 మ్యాచుల్లో ఒక సెంచరీ, నాలుగు హాఫ్ సెంచరీలు కలుపుకొని మొత్తంగా 500 పరుగులు చేశాడు. అయితే అతడి స్ట్రైక్ రేట్ 147గా ఉండటంతో పలు విమర్శలు వస్తున్నాయి. కింగ్ స్లోగా ఆడుతున్నాడంటూ, ఇలాగైతే కష్టమేననే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. దీంతో గత కొన్ని మ్యాచుల్లో అతడు మరింత వేగంగా ఆడుతున్నాడు.