iDreamPost

వీడియో: కమిన్సే బౌలర్, కమిన్సే బ్యాటర్.. సోషల్ మీడియాను షేక్ చేస్తున్న వీడియో!

  • Published May 08, 2024 | 5:43 PMUpdated May 08, 2024 | 5:43 PM

సన్​రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ ఇవాళ పుట్టిన రోజును జరుపుకుంటున్నాడు. గత ఏడాది కాలంలో ఎన్నో సక్సెస్​లు చూసిన కమిన్స్​కు ఇది నిజంగా స్పెషల్ బర్త్ డే అనే చెప్పాలి.

సన్​రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ ఇవాళ పుట్టిన రోజును జరుపుకుంటున్నాడు. గత ఏడాది కాలంలో ఎన్నో సక్సెస్​లు చూసిన కమిన్స్​కు ఇది నిజంగా స్పెషల్ బర్త్ డే అనే చెప్పాలి.

  • Published May 08, 2024 | 5:43 PMUpdated May 08, 2024 | 5:43 PM
వీడియో: కమిన్సే బౌలర్, కమిన్సే బ్యాటర్.. సోషల్ మీడియాను షేక్ చేస్తున్న వీడియో!

ప్యాట్ కమిన్స్.. వరల్డ్ క్రికెట్​లో మోస్ట్ డేంజరస్ టీమ్ అయిన ఆస్ట్రేలియాకు సారథి. స్టీవ్ వా, రికీ పాంటింగ్​ చూపించిన దారిలోనే నడుస్తూ కంగారూలకు అద్భుత విజయాలు అందిస్తూ సక్సెస్​ఫుల్ కెప్టెన్​గా మారాడు. ఒక్క ఏడాదిలోనే రెండు ఐసీసీ ట్రోఫీలు గెలిచాడు. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్​షిప్​తో పాటు వన్డే ప్రపంచ కప్-2023లో ఆసీస్​ను విజేతగా నిలిపాడు. గతేడాదికి గానూ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ అవార్డును గెలచుకున్నాడు. వరుస ఓటములతో మసకబారిన సన్​రైజర్స్ హైదరాబాద్​ ప్రతిష్టను మళ్లీ నిలబెట్టాడు కమిన్స్. ఈ ఏడాది టీమ్ కెప్టెన్సీ పగ్గాలు చేపట్టి రాత మార్చేశాడు. అలాంటోడి బర్త్ డే ఇవాళ.

ఏడాది కాలంలో ఏ క్రికెటర్ కూడా సాధించనన్ని ఘనతలు అందుకున్న కమిన్స్ ఇవాళ పుట్టిన రోజును జరుపుకుంటున్నాడు. దీంతో సెలబ్రిటీలు అందరూ అతడికి విషెస్ చెబుతున్నారు. ఈ తరుణంలో ఓ వీడియో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. అందులో బౌలర్, బ్యాటర్.. ఇద్దరూ కమిన్సే కావడం విశేషం. దీన్ని బిగ్​బాష్ లీగ్ రూపొందించింది. కమిన్స్ తన బౌలింగ్​లో వేసిన ఫుల్ టాస్​కు తానే బౌండరీగా మలిచి నవ్వుతూ సెలబ్రేట్ చేసుకోవడాన్ని ఇందులో చూడొచ్చు. బీపీఎల్​లో ఆడే టైమ్​లో కమిన్స్ బౌలింగ్, బ్యాటింగ్ చేసిన రెండు వేర్వేరు వీడియోలను తీసుకొని దీన్ని తయారు చేశారు. అయితే ఆ తేడా ఏమాత్రం తెలియకుండా పర్ఫెక్ట్​గా ఎడిట్ చేయడంతో వీడియో అదిరిపోయింది.

కమిన్స్ బౌలింగ్, బ్యాటింగ్ వీడియో చూసిన నెటిజన్స్ అతడికి బర్త్ డే విషెస్ చెబుతూనే, ఎడిటింగ్ అదిరిపోయిందని కామెంట్స్ చేస్తున్నారు. బీపీఎల్ ఆలోచన బాగుందని మెచ్చుకుంటున్నారు. ఇదే క్రమంలో తదుపరి మరింత మంది ఆల్​రౌండర్స్​ వీడియోలు ఇలా రావొచ్చని అంటున్నారు. ఇక, ఐపీఎల్ ఫస్టాఫ్​లో ఎస్​ఆర్​హెచ్​ను విజయాల బాటలో నడిపించిన కమిన్స్.. సెకండాఫ్​లో అదే ఊపును కంటిన్యూ చేయడంలో ఫెయిల్ అవుతున్నాడు. అతడు బౌలర్​గా, కెప్టెన్​గా సక్సెస్ అయినా.. మిగతా ఆటగాళ్లు విఫలమవడం జట్టుకు శాపంగా మారింది. ప్లేఆఫ్స్ చేరాలంటే మిగిలిన 3 మ్యాచుల్లో రెండింట్లో ఆరెంజ్ ఆర్మీ తప్పక నెగ్గాలి. మరి.. కమిన్స్ బర్త్ డే స్పెషల్ వీడియో మీకెలా అనిపించిందో కామెంట్ చేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి