iDreamPost
android-app
ios-app

KL Rahul: ఇంగ్లండ్ సిరీస్​కు ముందు రాహుల్ పూజలు.. ఈసారి ఏం మొక్కుకున్నాడంటే..!

  • Published Jan 17, 2024 | 7:54 PM Updated Updated Jan 17, 2024 | 7:54 PM

టీమిండియా స్టార్ బ్యాట్స్​మన్ కేఎల్ రాహుల్ ఓ ఆలయంలో ప్రత్యేక పూజలు చేశాడు. ఇంగ్లండ్​ సిరీస్​కు ముందు గుడికి వెళ్లిన రాహుల్ అక్కడ ఏం మొక్కుకున్నాడో ఇప్పుడు తెలుసుకుందాం..

టీమిండియా స్టార్ బ్యాట్స్​మన్ కేఎల్ రాహుల్ ఓ ఆలయంలో ప్రత్యేక పూజలు చేశాడు. ఇంగ్లండ్​ సిరీస్​కు ముందు గుడికి వెళ్లిన రాహుల్ అక్కడ ఏం మొక్కుకున్నాడో ఇప్పుడు తెలుసుకుందాం..

  • Published Jan 17, 2024 | 7:54 PMUpdated Jan 17, 2024 | 7:54 PM
KL Rahul: ఇంగ్లండ్ సిరీస్​కు ముందు రాహుల్ పూజలు.. ఈసారి ఏం మొక్కుకున్నాడంటే..!

ఆఫ్ఘానిస్థాన్​తో టీ20 సిరీస్​తో బిజీగా ఉన్న భారత క్రికెట్ జట్టు ఇది ముగియగానే మరో కీలక సిరీస్​లో ఆడనుంది. ఇంగ్లండ్​తో స్వదేశంలో 5 టెస్టుల సిరీస్​లో పాల్గొననుంది టీమిండియా. ఇందులో భాగంగా ఇప్పటికే మొదటి రెండు టెస్టులకు 16 మంది సభ్యులతో కూడిన స్క్వాడ్​ను కూడా ప్రకటించారు సెలక్టర్లు. ఆఫ్ఘాన్​తో సిరీస్​లో ఆడుతున్న పలువురితో పాటు ఉన్న రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్ కూడా ఇంగ్లీష్ టీమ్​తో సిరీస్​లో బరిలోకి దిగనున్నారు. గాయం నుంచి ఇంకా కోలుకోని మహ్మద్ షమీని తొలి రెండు టెస్టులకు దూరంగా ఉంచింది బీసీసీఐ. అతడు పూర్తిగా రికవర్ అయితేనే ఆడించే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ సిరీస్​కు సెలక్ట్ అయిన అయ్యర్ లాంటి వాళ్లు ప్రాక్టీస్ మొదలుపెట్టేశారు. ఈ తరుణంలో కేఎల్ రాహుల్ ఓ ఆలయాన్ని సందర్శించడం చర్చనీయాంశంగా మారింది.

ఉడుపిలోని శ్రీ మూకాంబికా ఆలయనికి వెళ్లాడు రాహుల్. అమ్మ వారి ఆశీస్సలు తీసుకున్నాడు. శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించిన ఆలయ అర్చకులు టీమిండియా స్టార్ బ్యాటర్​ను ఆశీర్వదించారు. మూకాంబికా ఆలయానికి వెళ్లిన సందర్భంలో అక్కడ రాహుల్ దిగిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇవి చూసిన అభిమానులు అసలు రాహుల్ ఏం కోరుకొని ఉంటాడా అని ఆలోచనల్లో పడ్డారు. అయితే అతడు మూడు కోరికలు కోరుకొని ఉండొచ్చని కొందరు నెటిజన్స్ అంటున్నారు. టీ20 వరల్డ్ కప్​-2024కు వెళ్లే టీమిండియా స్క్వాడ్​లో తనకు చోటు దక్కాలని, ఐపీఎల్​-2024లో లక్నో సూపర్ జెయింట్స్ ట్రోఫీ నెగ్గాలని, గాయం నుంచి పూర్తిగా కోలుకోవాలని రాహుల్ కోరుకున్నాడని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

కాగా, గతేడాది ఆసియా కప్, ఆ తర్వాత ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్, అనంతరం వన్డే వరల్డ్ కప్.. ఇలా ఆడిన ప్రతి చోటా దుమ్మురేపాడు కేఎల్ రాహుల్. ఇటీవల జరిగిన సౌతాఫ్రికా టూర్​లోనూ టెస్టుల్లో సెంచరీతో మెరిశాడు. ఆ సిరీస్​లో శతక్కొట్టిన ఏకైక టీమిండియా క్రికెటర్ రాహులే కావడం గమనార్హం. ఇంత భీకర ఫామ్​లో ఉన్నా, హార్డ్ హిట్టింగ్ ఎబిలిటీస్ ఉన్నా ఆఫ్ఘానిస్థాన్​తో టీ20 సిరీస్​కు అతడ్ని సెలక్ట్ చేయలేదు. దీంతో టీ20 వరల్డ్ కప్​లో అతడ్ని ఆడిస్తారా లేదా అనే సందేహాలు నెలకొన్నాయి. అదే టైమ్​లో ఇంజ్యురీ నుంచి పూర్తిగా రికవర్ కాకపోవడంతో ఇంగ్లండ్​తో టెస్ట్ సిరీస్​లో స్పెషలిస్ట్ బ్యాటర్​గానే రాహుల్ బరిలోకి దిగనున్నాడని టాక్. ఈ నేపథ్యంలో గుడికి వెళ్లిన స్టైలిష్​ బ్యాటర్ ఈ సమస్యలన్నీ తీరాలని కోరుకున్నాడని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. మరి.. రాహుల్ ఏం మొక్కుకున్నాడని మీరు భావిస్తున్నారో కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: Virat Kohli: పాండ్యాతో కలిసి కోహ్లీ మాస్‌ డాన్స్‌! సోషల్‌ మీడియాను షేకాడిస్తున్న వీడియో