iDreamPost
android-app
ios-app

Virat Kohli: పాండ్యాతో కలిసి కోహ్లీ మాస్‌ డాన్స్‌! సోషల్‌ మీడియాను షేకాడిస్తున్న వీడియో

  • Published Jan 16, 2024 | 7:29 PM Updated Updated Jan 16, 2024 | 7:29 PM

ఒకవైపు ఆఫ్ఘాన్‌తో టీ20 సిరీస్‌తో టీమిండియా బీజీగా ఉంటే.. మరోవైపు ఒక డాన్స్‌ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ వీడియోలో విరాట్‌ కోహ్లీ-హార్దిక్‌ పాండ్యా మాస్‌ డాన్స్‌తో ఇరగదీశారు. అసలు ఆ వీడియో ఎక్కడిది? ఎందుకు డాన్స్‌ చేశారో ఇప్పుడు తెలుసుకుందాం..

ఒకవైపు ఆఫ్ఘాన్‌తో టీ20 సిరీస్‌తో టీమిండియా బీజీగా ఉంటే.. మరోవైపు ఒక డాన్స్‌ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ వీడియోలో విరాట్‌ కోహ్లీ-హార్దిక్‌ పాండ్యా మాస్‌ డాన్స్‌తో ఇరగదీశారు. అసలు ఆ వీడియో ఎక్కడిది? ఎందుకు డాన్స్‌ చేశారో ఇప్పుడు తెలుసుకుందాం..

  • Published Jan 16, 2024 | 7:29 PMUpdated Jan 16, 2024 | 7:29 PM
Virat Kohli: పాండ్యాతో కలిసి కోహ్లీ మాస్‌ డాన్స్‌! సోషల్‌ మీడియాను షేకాడిస్తున్న వీడియో

టీమిండియా ప్రస్తుతం ఆఫ్థనిస్థాన్‌తో టీ20 సిరీస్‌తో బీజీగా ఉంది. ఇప్పటికే ముగిసిన రెండు మ్యాచ్‌ల్లోనూ విజయం సాధించి.. సిరీస్‌ను 2-0తో కైవసం చేసుకుంది. ఇక మిగిలి ఉన్న ఒక్క మ్యాచ్‌ను కూడా గెలిస్తే.. సిరీస్‌ క్లీన్‌ స్వీప్‌ అవుతుంది. ఈ సిరీస్‌తో చాలా కాలం తర్వాత.. సీనియర్‌ స్టార్‌ ఆటగాళ్లు రోహిత్‌ శర్మ, విరాట్‌ కోహ్లీ తిరిగి టీ20ల్లోకి ఎంట్రీ ఇచ్చారు. ప్రస్తుతం వాళ్లిద్దరూ టీ20ల్లో ఎలా ఆడతారా అనే దానిపై క్రికెట్‌ అభిమానులు ఆసక్తి చూపిస్తున్నారు. అయితే.. మరోవైపు సోషల్‌ మీడియాలో ఒక వీడియో వైరల్‌ అవుతుంది. ఆ వీడియోలో విరాట్‌ కోహ్లీ, ఇషాన్‌ కిషన్‌, హార్ధిక్‌ పాండ్యా కలిసి డాన్స్‌ వేస్తున్న ఆ వీడియో క్రికెట్‌ అభిమానులను తెగ ఆకట్టుకుంటుంది.

ఎవరో వ్యక్తి డ్రెస్సింగ్‌ రూమ్‌లో వస్తున్న సమయంలో ఇషాన్‌ కిషన్‌, విరాట్‌ కోహ్లీ అతనితో కలిసి మాస్‌ స్టెప్పులేశారు. అక్కడే హార్దిక్‌ పాండ్యా సైతం ఎగురుతూ కనిపించాడు. అయితే.. ఇది ఇప్పటి వీడియో కాదని తెలుస్తుంది. గతంలో టీమిండియా కోల్‌కత్తాలోని ఈడెన్‌ గార్డెన్స్‌లో మ్యాచ్‌ ఆడుతున్న సమయంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. అయితే.. ఈ వీడియోలో ముఖ్యంగా కోహ్లీ డాన్స్‌కు క్రికెట్‌ అభిమానులు ఫిదా అవుతున్నారు. ఆ వీడియోను తెగ షేర్లు చేస్తూ.. ఖుషీ అవుతున్నారు.

అయితే.. ఈ సమయంలో ఈ వీడియో వైరల్‌ అవుతుండటంపై కూడా క్రికెట్‌ ఫ్యాన్స్‌ కాస్త ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం హార్దిక్‌ పాండ్యాపై తీవ్ర స్థాయిలో ట్రోలింగ్‌ జరుగుతోంది. పాండ్యా గుజరాత్‌ టైటాన్స్‌ను వీడి.. ముంబై ఇండియన్స్‌కి తిరిగి రావడం, ముంబై యాజమాన్యం రోహిత్‌ శర్మను తప్పించి అతనికి కెప్టెన్సీ అప్పగించడంతో చాలా మంది క్రికెట్‌ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి టైమ్‌లో కోహ్లీతో పాండ్యా క్లోజ్‌గా ఉన్న డాన్స్‌ వేస్తున్న వీడియో వైరల్‌ కావడం విశేషం. మ్యాచ్‌ జరిగిన సమయంలో కాకుండా ఈ వీడియో ఇప్పుడు వైరల్‌ కావడం కాస్త ఆశ్చర్యానికి గురిచేస్తోంది. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Jojobet GirişgrandpashabetcasibomjojobetcasibomgrandpashabetJojobetjojobetholiganbetmatbet girişgrandpashabetDeneme Bonusu Veren Sitelergrandpashabet kayıp bonusugrandpashabet kayıp bonusugrandpashabet telegramgrandpashabet girişGrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetjojobetjojobet girişcasibomgrandpashabetesrar satın algrandpashabetmarsbahis girişholiganbetholiganbetgrandpashabet