భారత క్రికెట్ బోర్డును ఒక ప్రముఖ సంస్థ నిలువునా ముంచింది. ఏకంగా రూ.కోట్లలో డబ్బులు చెల్లించలేదని తెలుస్తోంది.
భారత క్రికెట్ బోర్డును ఒక ప్రముఖ సంస్థ నిలువునా ముంచింది. ఏకంగా రూ.కోట్లలో డబ్బులు చెల్లించలేదని తెలుస్తోంది.
ఆస్ట్రేలియాతో 5 టీ20ల సిరీస్ ముగిసిపోవడంతో ఇప్పుడు సౌతాఫ్రికా సిరీస్ మీద భారత్ కన్నేసింది. ఆసీస్ సిరీస్ నుంచి ఎన్నో విషయాలను నేర్చుకుంది టీమిండియా. ఈ సిరీస్ మన టీమ్‌కు పెద్ద ప్లస్ అనే చెప్పాలి. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్‌లో యంగ్‌స్టర్స్ అదరగొట్టారు. మరో ఏడు నెలల్లో పొట్టి ఫార్మాట్లో ప్రపంచ కప్ ఉన్న నేపథ్యంలో త్వరలో తుదిజట్టుపై ఓ క్లారిటీ రావాల్సి ఉంటుంది. అందుకే కంగారూలతో సిరీస్‌ను ప్రతిష్టాత్మకంగా భావించింది టీమిండియా మేనేజ్మెంట్. అందుకు తగ్గట్లే యువకులకు అవకాశాలు ఇస్తూ ప్రోత్సహించింది. ఏయే ప్లేసెస్‌కు ఎవరు సెట్ అవుతారనేది పరీక్షించింది. ఒకవేళ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, రవీంద్ర జడేజా, కేఎల్ రాహుల్ లాంటి సీనియర్లు టీ20 టీమ్‌లోకి కమ్‌బ్యాక్ ఇస్తే ఎవరెవర్ని తీసేయాల్సి ఉంటుందనేది దాని మీదా ఐడియాకు వచ్చింది.
ఆసీస్‌తో సిరీస్ ద్వారా భారత జట్టుకు సుదీర్ఘ కాలం సేవలు అందించగల సత్తా ఉన్న యంగ్‌స్టర్స్ ఎవరో తెలుసుకోవడంలో టీమ్ మేనేజ్మెంట్ చాలా మటుకు సక్సెస్ అయింది. ఓపెనింగ్‌లో యశస్వి జైస్వాల్, రుతురాజ్ గైక్వాడ్ అదరగొట్టారు. ముఖ్యంగా జైస్వాల్ ఎలాంటి బెరుకు లేకుండా ధనాధన్ ఇన్నింగ్స్‌లు ఆడాడు. క్విక్ స్టార్ట్స్ అందించాడు. అయితే పవర్‌ప్లేలోనే ఔట్ అవ్వకుండా ఇన్నింగ్స్‌ను పొడిగించుకోగలిగితే ఫ్యూచర్ స్టార్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. మరో ఓపెనర్ రుతురాజ్ తన క్లాస్ బ్యాటింగ్‌తో అలరించాడు. కావాల్సినప్పుడు షాట్లు కొడుతూ, అవసరమైనప్పుడు స్ట్రైక్ రొటేట్ చేస్తూ ఓ సీనియర్ ప్లేయర్ మాదిరిగా ఆడాడు.
కొత్త కుర్రాడు, వికెట్ కీపర్ జితేష్ శర్మ కూడా ఆకట్టుకున్నాడు. బ్యాటింగ్‌లో పించ్ హిట్టింగ్తో ప్రత్యర్థులను భయపెట్టిన జితేష్.. కీపింగ్‌లోనూ తన మార్క్ చూపించాడు. తిలక్ వర్మ మొదట్లో కాస్త తడబడ్డా తర్వాతి మ్యాచుల్లో పుంజుకొని రాణించాడు. ఇషాన్ కిషన్ అయితే వరుసగా మెరుపు ఇన్నింగ్స్‌లు ఆడి టీమ్‌లో తానెంత విలువైన ప్లేయరో మరోమారు ప్రూవ్ చేసుకున్నాడు. ఆఖర్లో బ్యాటింగ్‌కు వచ్చే రింకూ సింగ్ అయితే మహేంద్ర సింగ్ ధోని తరహాలో కూల్‌గా మ్యాచులను ఫినిష్ చేస్తూ మంచి క్రేజ్ సంపాదించాడు. అతడే మరో ధోని అంటూ అందరూ ప్రశంసిస్తున్నారు. బౌలింగ్‌లో ముకేశ్ కుమార్, అర్ష్‌దీప్ సింగ్, ఆవేశ్ ఖాన్లు రన్స్ ఇచ్చుకున్నా కీలక సమయాల్లో వికెట్లు తీస్తూ తమలోని సత్తాను చాటుకున్నారు. ఈ సిరీస్ హీరోల్లో మరో ఇద్దరు ఉన్నారు. వాళ్లే అక్షర్ పటేల్, రవి బిష్ణోయ్. ఇప్పటికే ఎన్నో మ్యాచుల్లో భారత్‌ను గెలిపించిన అక్షర్ అదే ఫామ్‌ను కంటిన్యూ చేశాడు.
బిష్ణోయ్ అయితే ఫ్యూచర్ స్పిన్నర్ తానేనని నిరూపించుకున్నాడు. ఇలా ఎన్నో పాజిటివ్ అంశాలను భారత్‌కు మిగిల్చిన ఈ సిరీస్ ముగియడంతో నెక్స్ట్ సఫారీ టూర్‌పై అంతా ఫోకస్ పెడుతున్నారు. ఇదిలా ఉంటే.. భారత క్రికెట్ బోర్డు (బీసీసీఐ)ని ఒక ప్రముఖ సంస్థ రూ.కోట్లలో ఎగవేయడం చర్చనీయాంశంగా మారింది. 2019లో టీమిండియాకు స్పాన్సర్‌కు వచ్చిన బైజుస్ సంస్థ బీసీసీఐకి రూ.158 కోట్లు ఇవ్వాల్సి ఉందట. ఎన్ని రోజులు గడుస్తున్నా స్పాన్సర్షిప్ డబ్బులు చెల్లించకపోవడంతో నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టీ) ఆశ్రయించింది బీసీసీఐ. బైజుస్‌కు మాతృ సంస్థ అయిన థింక్ అండ్ లర్న్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ మీద కేసు వేసింది. దీంతో బైజుస్‌కు నోటీసులు పంపిన ఎన్సీఎల్టీ.. దీనిపై రెండు వారాల్లోగా వివరణ ఇవ్వాలని ఆదేశించింది. ఈ కేసులో తదుపరి విచారణను డిసెంబర్ 22కు వాయిదా వేసింది ట్రిబ్యునల్. మరి.. బైజుస్ సంస్థ బీసీసీఐని డబ్బులు ఇవ్వకుండా ముంచడంపై మీరేం అనుకుంటున్నారో కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇదీ చదవండి: IPL 2024 Auction: అందరి టార్గెట్ అతడే! రూ. 20 కోట్లైనా తగ్గేదేలే..
The BCCI has claimed that Byju’s has defaulted 158cr payment. (MoneyControl). pic.twitter.com/gqC5BEX5ek
— Mufaddal Vohra (@mufaddal_vohra) December 4, 2023